MohanPublications Print Books Online store clik Here Devullu.com

అభాగ్యుల ఆరోగ్యక్షేత్రం చెరువుగట్టు ఆలయం!_Jadala Ramalingeswara Swamy temple MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU


అభాగ్యుల ఆరోగ్యక్షేత్రం చెరువుగట్టు ఆలయం! Jadala Ramalingeswara Swamy temple Ramalingeswara Swamy Temple Cheruvugattu Nalgonda Telangana District Narketpalli Lord shiva Lord parvathi Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


చెరువుగట్టు పార్వతీ 
జడల రామలింగేశ్వర స్వామి ఆలయం

దేవుడంటే ఓ నమ్మకం. ఆపదలోఉన్నవారికి అండగా నిలిచే ఓ విశ్వాసం. సిరిమంతులు కావాలని.. ఉద్యోగాల్లో పదోన్నతులు రావాలని.. పెద్ద ఆలయాలకు వెళ్లి మొక్కుతుంటారు. అనుకున్నది నెరవేరితే కానుకల రూపంలో.. కట్నాల రూపంలో మొక్కులు తీర్చుకుంటారు. కానీ.. సిరిసంపదలు కాకుండా ఆరోగ్యం బాగుండాలని కోరేవాడైతే.? అలాంటివారికీ ఉందో క్షేత్రం. అదే చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. భక్తి నిద్ర చేస్తే ఆరోగ్యం ప్రసాదించి ఆరోగ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న చెరువుగట్టు ఆలయమే ఈవారం దర్శనం.

ఎక్కడ ఉన్నది? :

పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిగా పిలిచే ఈ ఆలయం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో ఉన్నది.

ఎలా వెళ్లాలి? :

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మీదుగా నార్కట్‌పల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

విశిష్టత? :

ఆసుపత్రులు.. ఆరోగ్యకేంద్రాలు తిరిగినా చేకూరని ఆరోగ్యం ఇక్కడ ఒక్క నిద్ర చేస్తే నయమవుతుందని భక్తుల నమ్మకం.

స్థల పురాణం :

త్రేతాయుగంలో జమదగ్ని మహర్షి కొడుకైన పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాల్లో ఆఖరిది చెరువుగట్టు లింగం. అతనికి శివుడు ప్రత్యక్షమై ఈక్షేత్రం సుప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటిగా ప్రకాశిస్తుందని ఇక్కడకు వచ్చే భక్తుల మొక్కులు నెరవేర్చుతానని చెప్పి అదృశ్య మయ్యాడట. అప్పట్నుంచి ఇది సుప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్నది.

ఆలయాల కేంద్రం :

చెరువుగట్టు క్షేత్ర పరిధిలో కొండకింద శ్రీపార్వతీ అమ్మవారు కొలువుదీరారు. పరివార దేవతలుగా మల్లిఖార్జున స్వామి.. సుబ్రహ్మణ్యస్వామి.. భద్రకాళీ వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. గట్టుమీద స్వామివారికి పరివార దేవతలుగా విఘ్నేశ్వరస్వామి.. ఆంజనేయస్వామి.. ఎల్లమ్మ తల్లి.. క్షేత్రపాలకుడుగా కాలభైరవ స్వామి కొలువుదీరారు.

ఆరోగ్యక్షేత్రం:

దేవాలయ ప్రాంగణంలో అనారోగ్యంతో ఉన్న భక్తులు సంచరిస్తే వారికున్న రోగాలు మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే దేవాలయ ప్రాంగణంలో మండల.. అర్ధమండల దీక్ష తీసుకొని స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే తమ ఆరోగ్యం చక్కబడుతుండడం వల్ల ఈ ఆలయాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తుంటారు. స్వామివారి దర్శనానంతరం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఆపరేషన్ బండ ఉంటుంది. కడుపులో గడ్డలున్నవాళ్లు ఈ బండపై పడుకుంటే ఆ గడ్డలు కరిగిపోతాయంటారు.

అమావాస్య జాతర :

చెరువుగట్టు ఆలయంలో ప్రతి నెలా అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజు రుద్రహోమం చేయడం ఆనవాయితీ. ప్రతీ అమావాస్య రోజు స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించి తదనంతరం స్వామివారిని వాహనసేవలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ గావిస్తారు. ఈరోజున సుమారుగా లక్ష మంది భక్తులు హాజరవుతుంటారట. ఇక్కడ నిద్ర చేసినవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే కొందరు 11 అమావాస్యలు.. 9 అమావాస్యలు.. 7 అమావాస్యలు నిద్ర చేస్తుంటారు.

కోడెను కట్టుట :

చెరువుగట్టు ఆలయంలో ఉన్న మరో విశిష్టమైన నమ్మకం భక్తులకు సంతాన ప్రాప్తి. కోరుకున్నట్టుగా సంతానం కలిగితే కోడెను కట్టే ఆచారం ఇక్కడ ఉన్నది. స్వామివారి ఆశీస్సులతో సంతానం కలిగినందు వల్ల ప్రతిరోజు ఈ దేవాలయంలో కోడెను కట్టి వారి మొక్కులను చెల్లించి అదే రోజు అమ్మవారికి పల్లకిసేవ లేదా వాహన సేవ చేయించడం ఇక్కడ సంప్రదాయం. ఇంకా ప్రతీనెలా పౌర్ణమి రోజు అమ్మవారి దేవాలయంలో చండీ హోమం నిర్వహిస్తారు.

మూడుగుండ్లు :

శివుడు భూలోకాన చెరువుగట్టు సమీపాన అతి ఎత్తయిన మూడు గుండ్లపై వెలసి.. తనను మూడుగుండ్లు ఎక్కి దర్శించే భక్తులకు సమస్త కోరికలు తీర్చుతాడని భక్తుల నమ్మకం. పగలనక.. రాత్రనక భక్తులు మూడు గుండ్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. మూడుగుండ్ల దర్శనం వల్ల పాపభీతి.. కష్టాలు.. కల్మషాలు.. మానసిక క్షీణతలు పోతాయి. గుట్టపైన పుష్కరిణి ఉంటుంది. దీంట్లో స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని భక్తలు నమ్మకం. గుట్టపై స్వామివారి పాదాలు ఉంటాయి. కోరికలు నెరవేరాలని భక్తులు తలపై పాదుకలు పెట్టుకొని తడిబట్టలతో 11, 21, 41 ప్రదక్షిణలు చేస్తారు.

శక్తివంతమైంది

చెరువుగట్టు ఆలయం చాలా శక్తివంతమైనది. ఇక్కడికి ఆరోగ్యం బాగుపడాలని భక్తులు వస్తుంటారు. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయి ఆశలు వదులుకున్న వాళ్లకు కూడా ఇక్కడ నిద్ర చేస్తే ఆరోగ్యం బాగవుతుంది. ఇది నిరూపితం కూడా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మేం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ లోటూ లేకుండా చూసుకుంటేనే మాకు సంతృప్తి ఉంటుంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list