MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఏటీఎంలోనే నకిలీ నోట్లు వస్తే.._ATM fake notes


ఏటీఎంలోనే నకిలీ నోట్లు వస్తే.. ATM fake notes ATM Fake Notes Cash Currency Indian Currency Banks in india Indian corporate banks Fake Currency bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


ఏటీఎంలోనే నకిలీ నోట్లు వస్తే..

  • బ్యాంకులదే బాధ్యత అంటున్న ఆర్బీఐ
  • ఏటీఎం నుంచి బయటకు వెళ్లేలోపే గుర్తించాలి
  • సీసీటీవీ కెమెరాకు ఫేక్‌ నోటు చూపించాలి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: బ్యాంకు ఏటీఎంల నుంచే నకిలీ నోట్లు వస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? మొన్న ఢిల్లీ, నిన్న పూణె తాజాగా యూపీలోని బరేలీలో ఎటీఎంల నుంచే ఫేక్‌ కరెన్సీ రావడం షాక్‌కు గురిచేసింది. రిజర్వుబ్యాంకు స్థానంలో ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఉన్న నకిలీ నోట్లు సవాల్‌ విసురుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఖాతాదారులుగా మీరేం చేయాలి? మీ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి?
 
 
బాధ్యత బ్యాంకులదే!
  • ఏటీఎంల నుంచి నకిలీ కరెన్సీ నోట్లు వస్తే..బ్యాంకులు తమకు సంబంధం లేదని తప్పించుకోవడానికి వీల్లేదు. సంబంధిత బ్యాంకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • ప్రతిబ్యాంకులో నకిలీ నోట్లను గుర్తించే యంత్రాలను అమర్చారు. ఏటీఎంలలో నింపడానికి ఏజెన్సీలకు నోట్ల కట్టలు ఇవ్వడానికి ముందు బ్యాంకులు క్షుణ్ణంగా కరెన్సీని చెక్‌ చేస్తాయి.
  • ఆర్‌బీఐ మర్గ నిర్థేశకాల ప్రకారం, నకిలీ నోట్లను బ్యాంకులు గుర్తించలేదంటే..ఫేక్‌ కరెన్సీ వ్యాప్తికి పరోక్షంగా సహకరిస్తున్నట్టే! ఇలాంటి తప్పిదాలకు బ్యాంకులు జరిమానాలు కట్టాల్సి ఉంటుంది.
ఏం చేయాలి?
  • ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయగానే జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. బయటకు వెళ్లి దొంగ నోట్లు వచ్చాయంటే చూసుకోకపోవడం మీ తప్పిదమే అవుతుంది.
  • ఏటీఎం నుంచి నకిలీ నోటు వస్తే..అక్కడున్న సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేస్తే ఉపయోగం లేదు. వెంటనే ఎటీఎంలోని సీసీటీవీ కెమెరాకు ఫేక్‌ నోటును చూపించి రిపోర్టు చేయాలి. అది మున్ముందు మీ వాదనకు సాక్ష్యంగా నిలుస్తుంది.
  • ట్రాన్సాక్షన్‌ స్లిప్‌ను భద్రపరుచుకోవాలి. నోటు సీరియల్‌ నంబరును రాసిపెట్టుకోవాలి. ఆతర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.
  • మీకు వచ్చిన దొంగ నోటును మరొకరికి అంటగట్టే ప్రయత్నం చేయకండి. అది మిమ్మల్ని మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. అరెస్టయ్యే ప్రమాదం కూడా ఉంది.
  • మీ చేతికి నకిలీ నోటు వస్తే..వెంటనే బ్యాంకులో అప్పగించండి. దానిపై ఫేక్‌ నోటుగా స్టాంప్‌ వేసి..బ్యాంకులు ఆర్బీఐకి పంపుతాయి. అలాంటి నకిలీ నోట్లను ఆర్బీఐ నాశనం చేస్తుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list