GRANTHANIDHI blog Posts updates, Followకై Facebook MOHAN PUBLICATIONS Page LIKE చెయ్యగలరు

శ్రీ_చంద్రశేఖరేంద్ర_సరస్వతీ_శంకర! శివ!_sankara! siva!


Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakaluఆదిశంకర విరచిత కొన్ని ముఖ్య స్తోత్రాలను, పరమాచార్యులు, శంకరభగవత్పాదులు, కంచికామాక్షి, వివాహ వ్యవస్త గురించి వ్యాసాలను జోడించి చిన్న సంకలనం భక్తులకు అందించటం జరిగింది.

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu
           free pdf downlode clik here

1967- 68 ప్రాంతములలో పరమాచార్యుల వారు ఆంధ్రదేశమున విజయ యాత్ర చేశారు.

ఆ సందర్భమున ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక భక్తుని యింట ౩ రోజులుండి భిక్ష చేసి అనుగ్రహించారు.

ఆ తరువాత వారి కుమార్తె వివాహ విషయికముగా తలెత్తిన ధర్మ మీమాంసను పరిష్కరించి వివాహానికి ఆశీస్సులు పలికారు.

ఆ గృహస్తుడు ఎవరోకాదు. మా మామగారే. తర్వాత అనేక పర్యాయములు కంచి వెళ్ళి ఆచార్య సన్నిధిలో గడప గలుగుట నా అదృష్టంగా భావిస్తున్నాను.

పరమాచార్యులనుగ్రహించిన అనుభూతిని నలుగురితో పంచుకో వాలన్న సంకల్పం కలిగింది.

ఆ స్ఫూర్తి తోనే ఆదిశంకర విరచిత కొన్ని ముఖ్య స్తోత్రాలను, పరమాచార్యులు, శంకరభగవత్పాదులు, కంచికామాక్షి, వివాహ వ్యవస్త గురించి వ్యాసాలను జోడించి చిన్న సంకలనం భక్తులకు అందించటం జరిగింది.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

అర్చక పరీక్షలు అవగాహన_archaka parekshalu avagahanaBhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


అర్చక (ఆగమ) పరీక్షలు - అవగాహన
archaka parekshalu avagahana

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

చిన్న_జియ్యర్_స్వామివారి_పంచాంగం_Jeeyar_Panchangam


చిన్న జియ్యర్ స్వామివారి పంచాంగం Jeeyar Panchangam Vilambi Panchangam Ugadi Panchangam Panchangam 2018-19 Jeeyar Swamy Panchangam 2018-19  Jeeyar Panchangam Vilambi 2018-19 MOHAN PUBLICATIONS, MOHANPUBLICATIONS, JYOTISHAM, VASTU, VYDYAM, ADYATMIKAM, POOJA BOOKS, POOJABOOKS, PUJA, PURANAM, DEVUDU, DEVATALU, GRANTHANIDHI, MOHAN PUBLICATIONS FACE BOOK, LALITHA VISTNU, RAMAYANAMU, MOHAN BOOKS BHAKTI BOOKS, BHAKTHI, BHAKTI BOOKS, www.facebook.com/mohanpublicationsBhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


చిన్న జియ్యర్ స్వామివారి పంచాంగం 2018-19స్వేచ్ఛ-స్వచ్ఛత_PurityInFreedom


స్వేచ్ఛ-స్వచ్ఛత PurityInFreedom Freedom Nature Close to Nature Human Humanbeing Freedom to live Live to freedom Antaryami Eenadu Tuesday Antaryami Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


స్వేచ్ఛ-స్వచ్ఛత


శాస్త్రానికి సంబంధించిన అంశం ఏదైనా, అది సముద్రంతో సమానం. ఆ అంశాన్ని అర్థం చేసుకున్నా, అధ్యయనం చేసినా మనిషి అందులో కొంతవరకే సాధించగలడు. సంపూర్ణ అభ్యాసానికి అతడి జీవితకాలం సరిపోదు. అంతా కరతలామలకం అయిందని కొందరు అనుకుంటారు. తమను మించినవాళ్లు లేరని మిడిసిపడతారు. తాడి దన్నేవాడు ఉంటే, వాడి తలదన్నేవాడు ఉంటాడని కొంతకాలానికి తెలుసుకుంటారు. విహంగంలా ఆకాశ విహారం చేసే కాళ్లను మళ్లీ భూమిమీద ఆన్చక తప్పదు.

మనిషి విజ్ఞానానికి మొదటి సవాలు ప్రకృతి. ఎన్నో ప్రతులున్న అద్భుత పుస్తకమది. వీక్షించే, ఆలకించే మనసు ఉండాలే కాని- అన్నీ వింతలూ విడ్డూరాలే! కళ్లు విప్పార్చుకుని చూస్తూ ఆశ్చర్యపడటం తప్ప, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. ప్రకృతి ముందు అందరూ పసికూనలే. ఒడిలో చేర్చుకొని లాలించే కన్నతల్లి ప్రకృతి. కన్నెర్ర చేస్తే, అది అపర కాళి. తల్లిని గౌరవించినట్లు, ప్రకృతికీ మనిషి శుశ్రూష చేయాలి. అప్పుడే అతడి మనుగడ నల్లేరు మీద బండి నడక. లేదంటే, ప్రళయ హేల!

మనిషి మనసులో ఎన్నో రకాల భావాలు నాటిన అంతర్యామి, అందులో సూదిమొనంత స్వార్థాన్నీ చేర్చాడు. ఎదుగుతున్న మానవుడు దాన్ని చీమంత ఉంచుతాడా, ఏనుగంత చేసుకుంటాడా అన్నది అతడి వ్యక్తిత్వానికే వదిలిపెట్టాడు. మానవుణ్ని బుద్ధిజీవిగా సృష్టించాడు కాబట్టి- ప్రకృతిలో అడుగడుగునా అణువణువునా తన అస్తిత్వం ఉందని, దాని పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత అతడిదేనని నర్మగర్భంగా తెలియజెప్పాడు. స్వార్థం వ్యక్తిగతమే అయితే, అది అతడికి చెరుపు చేస్తుంది. సామాజికం అయితే, మొత్తం సమాజమే అతలాకుతలం అవుతుంది. దాని దుష్ప్రభావం ప్రకృతి మీదా పడుతుంది. ఒకరు పాలిథీన్‌ సంచిలో సరకులు తెచ్చుకుంటారు. బయట పడేసిన ఆ సంచిని ఆవు తిని, జీర్ణం కాక సతమతమవుతుంది. దాని బాధను అతడు చూడలేకపోవచ్చు. జీవహింసకు కారణం మాత్రం ఆ మనిషే!

ఉద్యోగాలు కల్పించి పొట్ట నింపే పారిశ్రామిక సంస్థ- వ్యర్థ పదార్థాల్ని కలుషిత నీరు, వాయువు రూపాల్లో వెలుపలికి వదులుతుంది. పరిసర ప్రాంతాల్ని విషతుల్యం చేస్తుంది. జీవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. తోటమాలి రక్షణలో ఉన్న మొక్క చక్కని నిగారింపుతో పూలు, పళ్లతో మిసమిసలాడుతుంది. రోడ్డును విభజిస్తూ ఏర్పరచిన స్థలంలో గల మొక్క- అటూ ఇటూ తిరిగే వాహనాల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ వాడిపోయి ఉంటుంది. ప్రకృతిలో జనించిన ప్రతి జీవికీ స్వేచ్ఛగా, ఆనందంగా స్వచ్ఛమైన వాతావరణంలో జీవించే హక్కు ఉంది. అది దైవ ప్రసాదితం. దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కాగితాల మీద ఏవో కొన్ని హక్కులు రాసుకుని, వాటిని పూర్తిగా తన సౌలభ్యం కోసమే ఉపయోగించుకోవాలని మనిషి అనుకోవడం అసమంజసం.

మానవుడు ఎంత సాధించినా, వానల కోసం రుతువుల మీద ఆధారపడాల్సిందే. పెద్ద కొండలుంటేనే, అవి మేఘాల్ని అడ్డుకుంటాయి, వానలు కురిపిస్తాయి. చెట్లు ఉంటేనే ప్రాణవాయువునిచ్చి, మనిషి గుండెను పదిలంగా ఉంచుతాయి. సర్వత్రా స్వచ్ఛత ఉన్నప్పుడే, మనిషికి ఆయుర్దాయం. ప్రకృతి అన్నీ స్వచ్ఛంగానే ఇచ్చింది. దాన్ని మనిషి స్వార్థమే కలుషితం చేస్తోంది. నదులు, చెరువులు ఉంటేనే ప్రాణుల దాహార్తి తీరుతుంది. అవి కలుషిత కాసారాలైతే, మనిషిని కాపాడే దిక్కెవరు?

మానవుడు తన స్వేచ్చను హరించే ఏ పని జరిగినా, అన్యాయం అనిపించినా గొంతెత్తుతాడు. రోడ్డెక్కుతాడు. చెట్లు, పుట్టలు, మూగజీవులు ఆ పని చేయలేవు. అన్నింటినీ మౌనంగా భరిస్తాయి. పూర్వం రుషుల ఆశ్రమ వాతావరణంలో మనుషులతో పాటు జంతువులూ కలిసి ఉండేవి. కాలక్రమంలో జంతువులకు మనిషి దూరమయ్యాడు. భారమయ్యాడు. ప్రకృతి పరిరక్షణ, జంతు సంరక్షణ గురించి మానవీయ కోణంలో పిల్లలకు పాఠాలు చెబితే- రానున్న తరాలైనా ప్రకృతిని, జీవ జంతుజాలాన్ని తమ కళ్లతో చూడగలుగుతాయి. లేదంటే తెరపై కదిలే దృశ్యాలే మిగులుతాయి. కృత్రిమ వాతావరణంలో ప్రాణం గల జీవిగా మనిషి ఒక్కడే మిగులుతాడు!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

వేదాలు తెచ్చిన... నారాయణా_Vedas are brought ... Narayana


వేదాలు తెచ్చిన... నారాయణా Vedas are brought ... Narayana Matsya Jayanti Matsya Jayanti Festival Vishnu Avtar Matsya Puja Significance of Matsya Jayanti Puja Significance Of Matsya Jayanthi Matsya TTD TTD Ebooks Sapthagiri Saptagiri Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


వేదాలు తెచ్చిన... నారాయణా

మత్స్య జయంతి
 
ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధమైనవి. భగవంతుడి దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మొదటిదైన మత్సా్యవతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.
బ్రహ్మకు ఒక పగలు, అంటే- వేయి మహాయుగాలు గడిస్తే... ఆయన సృష్టిని ఆపి నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనమవుతుందంటారు. దీన్ని నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మరల యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడంటారు. దీనికి ‘కల్పం’ అని పేరు.

వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు. విష్ణుభక్తుడు. ఒకసారి అతడు కృతమాలానదికి వెళ్లి స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా దోసిట్లో చేపపిల్ల పడింది. రాజు దాన్ని నీటిలోకి జారవిడిచాడు. మళ్ళీ నీటిని తీస్తున్నప్పుడు చేప చేతిలోనికి వచ్చి ‘రాజా! నన్ను పెద్దచేపలు తినివేస్తాయి. రక్షించు’ అని కోరింది. రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు. మర్నాటికి ఆ చేప, పాత్ర పట్టనంత పెద్దదైంది. అప్పుడు చెరువులో విడిచాడు. మర్నాటికి చెరువు కూడా పట్టలేదు. అప్పుడు రాజు దాన్ని సముద్రంలో వదిలాడు. ఆ మత్స్యం శతయోజన ప్రమాణానికి విస్తరించింది. తాను శ్రీమన్నారాయణుడినని, నాటికి ఏడు రోజుల్లో ప్రళయం రానున్నదని, సర్వజీవరాసులు నశించిపోతాయని, ఈ లోకమంతా మహాసాగరమవుతుందని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి, దానిలో పునఃసృష్టికి అవసరమైన ఓషధులు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తర్షులు కూడా ఆ నావలోకి రాగలరని చెప్పింది. మీనరూపుడైన నారాయణుడు తన కొమ్ముకు మహాసర్పరూపమైన తాటితో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యయోగ క్రియాసహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యుడికి శ్రద్ధదేవుడిగా జన్మించి ‘వైవస్వత మనువు’గా ప్రసిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురయ్యాయి. పరమేష్ఠి నిద్రావస్థలో ఉన్నప్పుడు సోమకాసురుడు నాలుగు వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలోకి వెళ్లిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ధ్యానించగా ఆయన మత్స్యరూపంలో జలనిధిని అన్వేషించి సోమకుడితో పోరాడి ఆ రాక్షసుడి కడుపుచీల్చి వేదాలను, దక్షిణావర్త శంఖాన్ని తీసుకుని బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను గ్రహించాడు. శిథిలమైన వేదభాగాలను పూరించమని బ్రహ్మను ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యాయవతారం.

వేదాలను అపహరించడమంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేయడమని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృష్టికార్య ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందడమే వేదాలు మరల గ్రహించడమని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి 

వేదాలు తెచ్చిన... నారాయణా Vedas are brought ... Narayana Matsya Jayanti Matsya Jayanti Festival Vishnu Avtar Matsya Puja Significance of Matsya Jayanti Puja Significance Of Matsya Jayanthi Matsya TTD TTD Ebooks Sapthagiri Saptagiri Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

వేదాలు తెచ్చిన... నారాయణా Vedas are brought ... Narayana Matsya Jayanti Matsya Jayanti Festival Vishnu Avtar Matsya Puja Significance of Matsya Jayanti Puja Significance Of Matsya Jayanthi Matsya TTD TTD Ebooks Sapthagiri Saptagiri Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


సౌర, చాంద్రమానాలెందుకు?_WhySouramanaandChandramana


సౌర, చాంద్రమానాలెందుకు? WhySouramanaandChandramana సౌర, చాంద్రమానాలెందుకు? WhySuryamanaandChandramana Souramana Ugadi Chandramana Ugadi Surya Siddhanta Chadramana Panchangam Souramana Panchangam Festival Ugadi Ugadi Ugadi The Festival Eenadu Sunday Magazine Eenadu Sunday Magazine Eenadu Suday Paper Bhakthi Pustakalu BhakthiPustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


సౌర, చాంద్రమానాలెందుకు?మనం ఉగాది పండగను చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం. తమిళులూ మలయాళీలూ సౌరమానం ప్రకారం మనకన్నా ఆలస్యంగా ఏప్రిల్‌ నెలలో చేసుకుంటారు. సంక్రాంతి పండగను మాత్రం సౌరమానం ప్రకారమే చేసుకుంటాం. అయితే ఇలా రెండు రకాల మానాలను ఎందుకు లెక్కలోకి తీసుకుంటున్నాం, అసలు కాలాన్ని రెండు పద్ధతుల్లో ఎందుకు లెక్కిస్తున్నాం, అన్న సందేహాలకు ప్రముఖ జ్యోతిష్కులు శంకరమంచి రామకృష్ణశాస్త్రి సమాధానమిస్తున్నారిలా...

‘కాలః కాలయితా మహం’ అంటాడు గీతాచార్యుడు. అంటే కంటికి కనిపించని ఆ కాల స్వరూపం నేనే అని అర్థం. మరి అలాంటి కాలాన్ని లెక్కించడం అంటే సామాన్యమా... గ్రహాలూ నక్షత్ర సంచారం గురించి ఎంతటి అవగాహన ఉండాలి! దానికి మరెంతటి పరిశీలన ఉండాలి! అయితే ప్రత్యక్షంగా కనిపించే కాలస్వరూప దైవం ఆదిత్యుడే. అందుకే పాశ్చాత్య దేశాలన్నీ సూర్యుడి గమనాన్ని మాత్రమే లెక్కించారు. కానీ భారతీయ ఖగోళనిపుణులు సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల ప్రభావాన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అదే జ్యోతిషశాస్త్రం. అందులో భాగంగానే సూర్యుడితోపాటూ చంద్రుడూ, బృహస్పతి గమనాలనూ లెక్కించారు. మనం సూర్య, చంద్ర గమనాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, సమప్రాధాన్యం ఇస్తున్నాం. ఎందుకంటే యజ్ఞయాగాదులు నిర్వహించాలంటే ఒక్క సౌరమానం సరిపోదు, చాంద్రమానంలోని తిథి, నక్షత్రాలు కూడా తెలియాలి. అంతేకాదు, ఒక పగలుతోబాటు రాత్రి కలిస్తేనే రోజు పూర్తవుతుంది. ఆ రాత్రిని ప్రభావితం చేసేది చంద్రుడే. మనమీద ఆ ప్రభావం తెలుసుకోవాలంటే చంద్రగమనాన్నీ లెక్కించాల్సిందే. అందుకే మనవాళ్లు రెండింటినీ తీసుకుని సమన్వయం చేస్తున్నారు.

సౌరమానమంటే...
సూర్యగమన గణనమే సౌరమానం. సూర్యుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలో సంచరిస్తుంటాడు (నిజానికి ఇక్కడ సూర్యుడు తిరుగుతున్నాడని కాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యనే సూర్యగమనంగా లెక్కించారు నాటి నిపుణులు). అలా సంచరించే కక్ష్యనే పన్నెండు భాగాలుగా విభజించారు. అవే మేషం, వృషభం, కుంభం... వంటి రాశులు. దీన్నే రాశి వృత్తం అంటారు. ఈ పన్నెండు రాశుల్లో సూర్యుడు సంచరించడానికి ఏడాది పడుతుంది. ఒక్కో రాశిలోనూ ఒక్కో నెల ఉంటాడు. ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే రాశి సంక్రమణం. అందుకే సంక్రాంతి అనేది ప్రతీ రాశికీ ఉంటుంది. కానీ ఈ రాశిచక్రం ద్వారా నెల మాత్రమే తెలుస్తుంది. ఆ రోజు తిథి, నక్షత్రాల గురించి తెలియాలంటే మాత్రం చాంద్రమానాన్ని అనుసరించాల్సిందే.

చాంద్రమానమంటే...
చంద్రుడి గమనం ద్వారా తిథినీ నక్షత్రాన్నీ కూడా తెలుసుకోవచ్చు. నిజానికి చాంద్రమానానికీ సూర్య(భూ)గమనమే కీలకం. సూర్యుడు తిరిగే కక్ష్యను రాశి చక్రం మాదిరిగానే మరో 27 భాగాలుగా విభజించారు. అవే నక్షత్రాలు. ఆ వృత్తాన్ని నక్షత్ర వృత్తం అంటారు. అయితే సూర్యుడు ఉన్న సమయంలో నక్షత్రాలు కనిపించవు. కాబట్టి ఆ సమయంలో నక్షత్ర గమనాన్ని లెక్కించలేం. నక్షత్ర గమనంతో కాలాన్ని లెక్కిస్తే అది దోషరహితంగానూ, స్థిరంగానూ ఉంటుంది. కోట్ల సంవత్సరాల నాటి సంఘటనల సమయాన్ని తెలుసుకోవాలంటే ఆ సమయంలో ఏ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయో చెబితే కచ్చితంగా లెక్కించగలగడానికి అదే కారణం. సూర్యుడికీ చంద్రుడికీ మధ్యలో భూమి అడ్డు రావడంవల్ల చంద్రుడి కళలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. వాటినే తిథులుగా లెక్కించారు. అలాగే చంద్రుడు రోజుకి ఒక నక్షత్రం చొప్పున నెలలో 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు. అంటే ఏడాదికి చాంద్రమానం ప్రకారం 354 రోజులే. కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటల 11 నిమిషాల 31 సెకన్లు పడుతుంది. అదే చంద్రుడు తిరగడానికి 354 రోజులు పడుతుంది. అంటే... భూమి, చంద్రుడి గమనాల్లో 11 రోజుల తేడా ఉంటుంది. ఈ తేడాని సరిచేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. వాటిని సైతం ఒక పద్ధతిలో 34, 35, 34, 35, 28 నెలలకోసారి వచ్చేలా లెక్కించారు.

చాంద్రమానమే ప్రధానం
ఈ సౌర, చాంద్రమానాలకీ ఉగాదికీ సంబంధం ఏమిటీ అనుకోవచ్చు. ‘ఉ’ అంటే నక్షత్రం. ‘గ’ అంటే గమనం. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని లెక్కించడం మొదలుపెట్టిన రోజనే అర్థం అని కొందరి అభిప్రాయం. చాంద్రమానాన్ని అనుసరించే చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటున్నాం. తెలుగువారితోబాటు కన్నడిగులు, మహారాష్ట్రీయులు కూడా ఆ రోజునే ఈ పండగ జరుపుకుంటారు. సంక్రాంతిని మినహాయిస్తే ఉగాది సహా మిగిలిన పండగలన్నీ చాంద్రమానం ప్రకారమే ఉంటాయి. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం పండగలూ వ్రతాల విషయంలో కొన్ని తిథులు నిర్ణీత సమయంలోనే ఉండాలి. సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజే ఉగాది. మధ్యాహ్నానికి నవమి తిథి ఉంటేనే శ్రీరామనవమి. అర్ధరాత్రి సమయానికి అష్టమి తిథి ఉంటేనే శ్రీకృష్ణాష్టమి. మధ్యాహ్నానికి చవితి ఉంటే తప్ప అది వినాయకచవితి అనిపించుకోదు. ఇలా ప్రతీ పండగకీ నిర్ణీత సమయాలున్నాయి. అంతేకాదు, ఏ కాలమానాన్ని ఆచరించే వారైనప్పటికీ చంద్రునికీ నక్షత్రాలకీ పౌర్ణమితో ముడిపడిన చైత్రాది నామాలతోనే నెలలను పిలుస్తుంటారు. ఉదాహరణకు సౌరమానాన్ని పాటించే తమిళులు కూడా చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ గల చాంద్రమాన పేర్లతోనే నెలలను లెక్కించడం విశేషం. అవన్నీ ఎలాగున్నా పంచాంగం చూసుకోవాలన్నా జాతకచక్రం తెలుసుకోవాలన్నా చాంద్రమానమే ప్రామాణికం!

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం