MohanPublications Print Books Online store clik Here Devullu.com

వద్దంటే.. అప్పు.. కాస్త జాగ్రత్త_BewareOfLoans



వద్దంటే.. అప్పు.. కాస్త జాగ్రత్త BewareOfLoans EMI LoanEMI RateofInterest NewLoan HowtoHandleLoan LoanPremium BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Eenadu EenaduBusinessPage EenaduSiri EenaduSunday



వద్దంటే.. అప్పు.. కాస్త జాగ్రత్త!

అత్యవసరాల్లో డబ్బు అవసరం వస్తే.. ఆ కష్టం అంతాఇంతా కాదు.. ఇప్పుడు ఏ అవసరం అయినా.. అప్పు సులభంగానే దొరుకుతుంది. అయితే, రుణం ఏదైనా తీసుకునేముందు తగిన నిర్ణయం ఎలా తీసుకోవాలి?
అప్పు తీసుకుంటే అసలుతో పాటు దానికి వడ్డీ కూడా చెల్లించాలి. ఆదాయం సరిపోతుందిలే అని ప్రతి అవసరానికీ అప్పు తీసుకుంటూ వెళ్తే..నెలవారీ వాయిదాల చెల్లింపులకు ఇబ్బంది రావచ్చు... కాబట్టి,
* అవసరం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి.. దానికి ఎంత అప్పు కావాలో అంతే తీసుకోండి. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ఎక్కువ తీసుకుంటే.. తర్వాత నెలవారీ వాయిదాలు భారం కావచ్చు. దీంతోపాటు ఎక్కువ వడ్డీ, అనేక రుసుములూ భరించాలి.
* ఏ బ్యాంకు ఏ తరహా రుణాలు అందిస్తున్నది తెలుసుకునేందుకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకోండి.
* ఉద్యోగం కోల్పోవడంలాంటివి జరిగినప్పుడు వచ్చే ఆదాయ వనరులు ఆగిపోవచ్చు. ఇలాంటప్పుడు ఆదాయం లేకపోగా.. వాయిదాలు చెల్లించాల్సిన భారం ఉంటుంది. అందుకే, ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు ఏం చేయాలన్నది ముందే ఆలోచించుకోవాలి.
* రుణం తీసుకునేప్పుడు దానికి సంబంధించిన అన్ని నియమ నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకోండి. చాలామందికి అప్పు తీసుకున్న తర్వాతే రుసుము ఎంత విధించారో అర్థం అవుతుంది.
* హామీ ఉన్న రుణాలకంటే.. హామీ లేని రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.
* రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించాలి. లేకపోతే బ్యాంకులు అపరాధ రుసుములాంటివి వసూలు చేస్తాయి. దీనివల్ల మీ జేబుకు భారమే కాకుండా.. రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరుపై కూడా ప్రభావం పడుతుంది.
* ముందస్తు చెల్లింపు చేసినప్పుడు ఏదైనా రుసుములు విధిస్తున్నారా.. ఇదీ కీలకమే. ఏదైనా అనుకోని డబ్బులు అందినప్పుడు వెంటనే ఆ అప్పును తీర్చడానికి ప్రయత్నిస్తే.. ఎలాంటి రుసుములు లేకపోతేనే మేలు.
* ఒకవేళ మీరు రున వాయిదాలు చెల్లించలేని పరిస్థితి ఉంటే.. రుణ సంస్థల నుంచి తప్పించుకు తిరగడం మంచిది కాదు. దానికన్నా మీ పరిస్థితిని వివరిస్తూ.. బ్యాంకులను సంప్రదించడం ఉత్తమం. మీరు తిరిగి వాయిదాలు చెల్లించడం ప్రారంభించేదాకా కాస్త సమయం ఇవ్వాలని అడగండి. బ్యాంకే మీకు సరైన మార్గం చూపిస్తుంది.


ఏం చేయాలి..
ఆదాయం తగ్గి, వాయిదాలు చెల్లించలేనప్పుడు.

* వ్యవధి పెంచుకోండి: వీలును బట్టి రుణ వ్యవధిని పెంచుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల నెలసరి వాయిదాల భారం తగ్గుతుంది.
* వాయిదా వేయండి: స్వల్పకాలిక ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు.. రుణ వాయిదాల చెల్లింపును తాత్కాలికంగా వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తాయి బ్యాంకులు. ఆ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరండి. ఆర్థికంగా మెరుగైనప్పుడు వ్యక్తిగత రుణం వాయిదాలు చెల్లించవచ్చు.
* కొత్త రుణం తీసుకోవడం ద్వారా: ఇప్పుడు చాలా బ్యాంకులు రుణాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఫోన్లు చేస్తూనే ఉన్నాయి. మీ పాత రుణాన్ని మార్చుకొని, కొత్త రుణం తీసుకునేందుకు ఏదైనా వీలుందా చూసుకోండి. కొత్త అప్పు తీసుకున్నప్పుడు కాస్త అధిక మొత్తం కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఏదైనా అత్యవసరానికి దాన్ని వాడుకునేందుకు అవకాశం ఉంది.
ఎప్పుడైనా సరే.. రుణం తీసుకోవడానికి అవసరమే ప్రాతిపదిక కావాలి.. అప్పు ఇస్తున్నారు కదా అని అవసరం గుర్తుకు రాకూడదు. ఈ విషయాన్ని గుర్తించుకున్నప్పుడే.. ఆర్థికంగా ఇబ్బందుల్లేకుండా..మన డబ్బుతో మనం హాయిగా ఉండొచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list