MohanPublications Print Books Online store clik Here Devullu.com

చీర.. ఆకట్టుకునేలా!-Saree

చీర.. ఆకట్టుకునేలా!
చీర కట్టుకుంటే అందంగా కనిపించాలి.. ఆధునికత ఉండాలి.. సౌకర్యంగానూ మెరిసిపోవాలి.. ఆ తరం నుంచి ఈ తరం మగువల వరకు ఇదే కోరుకుంటారు.. కానీ ఒక్క విషయమండోయ్.. మీ ఎత్తు, మీ బరువు, మీ షేప్‌ని బట్టి చీరలను ఎంచుకోవాలని తెలుసా?మనల్ని బట్టి మనం ఎంచుకునే చీరలు ఉండాలంటున్నారు ఫ్యాషనిస్టులు.. ఆకట్టుకునేలా చీరకట్టుతో మెరిసి పోవాలంటే.. ఎలాంటి చీరలు ఎంచుకోవాలో చదువండి..
పియర్ షేప్
ఈ ఆకృతి ఉన్నవాళ్లకు పైనతో పోలిస్తే కింద భాగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షిఫాన్, జార్జెట్ చీరలను ఎంచుకుంటే కింద పార్ట్ ఎక్కువగా కనిపించదు. అలాగే చేపల చీరను చుట్టకుండా కుచ్చిళ్లు పెద్దగా పెట్టి, కొంగు సింపుల్‌గా వేస్తే సరిపోతుంది. వీరికి బోల్డ్, బ్రైట్ కలర్స్ బాగా సూటవుతాయి. అలాగే చిన్న ప్రింట్స్, ఎంబ్రాయిడరీ, పెద్ద బార్డర్‌లు వచ్చిన చీరలను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. 

యాపిల్ షేప్
పొట్ట, పై భాగం ఎక్కువ ఉందా? అయితే మీరు ఈ ఆకృతికి చెందినవారే! మీరు ఎంబ్రాయిడరీ ఎక్కువ వచ్చిన చీరలను ఎంచుకోవడం మంచిది. కొన్ని భాగాల్ని కప్పేలాగా ఉంటూ, బ్లౌజ్ కచ్చితంగా పొడుగు చేతులు ఉండేలా చూసుకోండి. సిల్క్ చీరలు మీకు బాగా నప్పుతాయి. నెట్ ఫ్యాబ్రిక్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు. ఉల్టా పల్లూని ట్రై చేయొచ్చు. అవసరమైతే చీరలకు కాంట్రాస్ట్‌గా బ్లౌజ్‌లను ఎంచుకుంటే మరింత బాగుంటారు. 

పొడవైన అమ్మాయిలు..
పొడుగున్న అమ్మాయిలు ఏ చీర కట్టినా అందంగానే కనిపిస్తారు. వారి లుక్కే అలా ఉంటుంది. వీళ్లకు హెవీ బార్డర్స్ బాగా నప్పుతాయి. బోల్డ్ ప్రింట్స్‌తో వెరైటీ కలర్స్ ఎంచుకుంటే మరింత బాగుంటారు. కొన్ని ఇంగ్లిష్ కలర్స్‌ని తీసుకోవడం వల్ల అందరి దృష్టి రంగు మీదకు వెళుతుంది. దానివల్ల మీరు మరీ పొడుగు ఉన్నారన్న భావన కలుగదు. 

వాల్యోపటస్ ఫిగర్..
నాజూకు నడుము, పైన, కింద భాగాలు కాస్త ఎక్కువ ఉన్న వాళ్లు ఈ కేటగిరీలోకి వస్తారు. వీళ్లు.. జార్జెట్, షిఫాన్, నెట్ ఫ్యాబ్రిక్ చీరలను ఎంచుకోవచ్చు. డార్క్ కలర్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. హెవీ ఎంబ్రాయిడరీ చీరల జోలికి వెళ్లొద్దు. సింపుల్‌గా ఉండే ఎంబ్రాయిడరీ, బీడ్ వర్క్ చీరలు మీకు బాగుంటాయి. చీర స్టిఫ్‌గా కాకుండా, జారేలా ఉండాలి. క్రిస్-క్రాస్ స్ట్రింగ్స్ ఉన్న బ్లౌజ్‌లు మీకు మరింత బాగుంటాయి
ఓవర్ వెయిట్..
కాటన్, స్టిఫ్‌గా ఉండే ఫ్యాబ్రిక్‌లు మీకు పెద్ద శత్రువులుగా చెప్పొచ్చు. షిఫాన్, సిల్క్ చీరలు మీ ఒంటికి సరిగ్గా సరిపోతాయి. అలాగే ముదురు రంగులను ఎంచుకుంటే మీరు మరీ లావున్నట్లుగా కనిపించరు. హ్యాండ్‌లూమ్ చీరలను కూడా కట్టుకోవచ్చు. ఫుల్ స్లీవ్స్, లాంగ్ లెంగ్త్ బ్లౌజ్‌లు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు చీర కట్టే విధానం కూడా సింపుల్‌గా ఉండేలా జాగ్రత్త పడండి. 

నాజూకు అమ్మాయిలకు..
మీరు సన్నగా ఉంటారా? అయితే మీరు కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలు ఎంచక్కా ఎంచుకోవచ్చు. ఇవి కాస్త మీరు లావుగా ఉన్నట్టు అందరినీ భ్రమింపచేస్తాయి. లైట్ కలర్స్, హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న చీరలను తీసుకోండి. ఇంకా చెప్పాలంటే.. బ్రొకేడ్, బీడ్ వర్క్ వచ్చిన చీరలు మరింత అందాన్ని తెస్తాయి. బ్యాక్‌లెస్, స్లీవ్‌లెస్, హాల్టర్ నెక్, ట్యూబ్ బ్లౌజ్‌లతో అందరి మతి పోగొట్టొచ్చు. 

పొట్టి అమ్మాయిలకు..
పొట్టిగా ఉన్నాం.. ఏవి సూటవుతాయనే బాధే లేదు. మీరు పెద్ద పెద్ద ప్రింట్స్, హెవీగా ఉండే బార్డర్స్ జోలికి వెళ్లక పోవడమే మంచిది. మీరు చిన్న బార్డర్‌లు ఉండేట్టుగా చూసుకోండి. అలాగే.. చీర మొత్తం కూడా చిన్న ప్రింట్స్ ఉన్నవి అయితేనే బెటర్. మీరు పొట్టిగా, లావుగా ఉన్నా ఇదే 

ఫ్యాషన్‌ని ఫాలో 
అవ్వండి. 
చిటికెలో ఇలా..
చీర కట్టుకోవాలని ఉన్నా అందరికీ సెలక్షన్ చేయడం రాదు. అదే కొత్తగా చీర కట్టడం మొదలుపెట్టిన వాళ్ల పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని కొన్ని చిట్కాలు ఇచ్చాం ఫాలో అయిపొండి.. 
-పైన ఉన్న వాటిని దృష్టిలో ఉంచుకొని.. మీ రంగుని బట్టి చీరను ఎంపిక చేసుకుంటే మరింత అందంగా మెరిసిపోతారు. 
-ఇక డిజైన్స్ విషయానికొస్తే రోజుకో కొత్త ప్యాటర్న్ వస్తున్నాయి. కాబట్టి అవుట్‌డేట్ అయ్యే ప్రమాదం ఉన్న వాటి జోలికి వెళ్లవద్దు. 

-చీరకు రెండు, మూడు రంగుల వెరైటీ బ్లౌజ్‌లు కుట్టించుకుంటే మల్టీ పర్పస్‌గా పనిచేస్తాయి. 

-సింపుల్ చీరలకు హెవీ బ్లౌజ్‌లు కుట్టించుకోవడం మరచిపోవద్దు. ఒకవేళ చీర హెవీగా ఉంటే మాత్రం సింపుల్ బ్లౌజ్‌ని ఎంచుకోవడం మంచిది. 

-చీరకు తగ్గ ఆభరణాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. బంగారం, వెండి ఆభరణాలే కాదు.. కాస్త ట్రెండీగా ఉండేందుకు ప్లాటినం, బ్లాక్ మెటల్ ఆభరణాలనూ సందర్భాన్ని బట్టి ధరిస్తే మంచిది. నిర్వహణ:                                    -సౌమ్య పలుస



marrege sare



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list