MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఏ వయసులో ఏం ఎలా తినాలి-How to eat at what age?


ఏ వయసులో ఏం ఎలా తినాలి?
శక్తి ఖర్చయ్యే తీరు మన వయసు మీద ఆధారపడి ఉంటుంది. దాన్నిబట్టే మనం తినే ఆహారం, తీసుకునే పోషకాలు, చేసే వ్యాయామాల్లో మార్పులు చేస్తూ ఉండాలి. జీవితంలోని దశలవారీగా వారి వారి జీవనశైలిని బట్టి ఏ వయసు వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తినాలి? ఏది తినకూడదు? జంక్‌ ఫుడ్‌కు గుడ్‌బై కొట్టి, వయసును బట్టి తింటే.. ఆరోగ్యం సదా మీ వెంటే! మీ ఇంటే!!
పది నుంచి పదిహేను ఏళ్లు... ఇది పిల్లలు ఎదిగే వయసు. ఈ దశలో పిల్లల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల ఏడాది వయసు వేగంగా ఉండి, పదేళ్లు చేరుకునేవరకూ నెమ్మదిస్తుంది. పదో ఏట నుంచి తిరిగి వేగం పుంజుకుంటుంది. కాబట్టి ఈ వయసు నుంచి పిల్లలకు ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఈ దశలో పిల్లలకు బలవర్ధకమైన ఆహారం ఇస్తే మంచి ఎత్తు పెరుగుతారు, బలంగా తయారవుతారు. 
మున్ముందు ఆడపిల్లలు ఎదిగి గర్భం దాల్చినప్పుడు, పిల్లలకు పాలిచ్చే సమయానికి ఎలాంటి బలహీనతలూ, ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండాలంటే పదేళ్ల వయసు నుంచే మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి.
ఇప్పుడు పిల్లలు తినే ఆహారంలో ప్రొటీన్లు తక్కువ పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి ఆహారం తినటం వల్ల పిల్లల్లో వయసుకు తగిన పెరుగుదల ఉండదు. అధిక బరువు, హార్మోన్లలో మార్పుల లాంటి సమస్యలు పదేళ్ల వయసు నుంచే మొదలవుతాయి. కాబట్టి ఈ వయసు నుంచే సమతులాహారం ఇస్తూ ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే భవిష్యత్తులో హైపర్‌టెన్షన్‌, మధుమేహం, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే ఆ వయసు పిల్లల శరీర జీవక్రియలకు తగిన ఆహారం ఇవ్వగలిగితే హార్మోన్లు సక్రమంగా స్రవించి అనవసరమైన ఆహార వ్యసనాలు కూడా రాకుండా ఉంటాయి.
కొంతమంది పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్లు, చీజ్‌, ఉప్పు, మైదాతో చేసిన పదార్థాలను ఏరికోరి తింటూ ఉంటారు. వాళ్ల శరీర జీవక్రియలకు తగినన్ని పోషకాలు శరీరానికి అందకపోవటమే ఇలాంటి ఫుడ్‌ క్రేవింగ్స్‌కు (ఆహార వ్యసనాలు) కారణం. కాబట్టి ఈ వయసులో పిల్లలకు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్న సమతులాహారం ఇవ్వాలి.
ఇందుకోసం... ఈ కింది పదార్థాలు ఇవ్వాలి
గుడ్లు, ఆకుకూరలు, తాజా పళ్లు, కూరగాయలు
బాదం, వాల్‌నట్స్‌, వేరుసెనగలు
గోధుమలు, పెసలు, పాలు, వెన్న, పెరుగు
మాంసం, చేపలు, జున్ను
రాజ్మా, సెనగలు, బొబ్బర్లు
పిల్లలకు సాయంత్రం అల్పాహారంగా బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, ఉడకబెట్టిన సెనగలు, మొక్కజొన్నలాంటివి ఇస్తే జంక్‌ ఫుడ్స్‌ మీదకు మనసు మళ్లకుండా ఉంటుంది. పిల్లలు జంక్‌ఫుడ్‌కి అలవాటు పడిన తర్వాత వాళ్ల ఆహారంలో మార్పులు చేయటం కాకుండా అంతకంటే ముందే ఇలాంటి ఆహార నియమాలను వాళ్లకు అలవాటు చేయగలిగితే జంక్‌ ఫుడ్‌కి అలవాటు పడకుండా ఉంటారు.
15 నుంచి 25 ఏళ్ల వయసులో
బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, చాట్‌ బండ్లు....ఎక్కడ చూసినా ఎక్కువ శాతం టీనేజర్లే కనిపిస్తూ ఉంటారు. ఇంట్లో దొరకని కొత్త రుచులు ఆస్వాదించాలని ఆశపడటం ఈ వయసు పిల్లల్లో సహజమే! అయితే కేక్‌లు, బర్గర్లు, పిజ్జాలు, చాట్‌లు, మిల్క్‌షేక్స్‌, ఐస్‌క్రీమ్‌లు మొదలైన పదార్థాలు తినటం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరిపోతూ ఉంటాయి. వాటిని కరిగించటానికి సరిపడా వ్యాయామం కొరవడటంతో టీనేజీ పిల్లలు ఊబకాయుల్లా తయారవుతున్నారు.
జంక్‌ ఫుడ్‌కు టీనేజన్లు అలవాటు పడకుండా ఉండాలంటే ఇంట్లోనే కొత్త రుచుల్లో స్నాక్స్‌ తయారుచేయటం ప్రతి తల్లీ నేర్చుకోవాలి. తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్‌ వండే విధానాలను నేర్చుకుని పిల్లల మనసు గెలవగలిగితే బజార్లో దొరికే ఫాస్ట్‌ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు.
అలాగే మాంసాహారం వండేటప్పుడు ఎక్కువ నూనెలో వేయించకుండా కూరలా, ఆవిరి మీద ఉడికించి ఇవ్వాలి. మాంసాహారంతోపాటు కూరగాయలు కూడా ఇవ్వాలి.
ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే ప్రొటీన్‌ ఫుడ్‌ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది.
ఉదయం అల్పాహారంలో బ్రెడ్‌, శాండ్‌విచ్‌లకు బదులుగా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, పెసలతో చేసిన పొంగల్‌, పెసరట్టు, రాగి, క్యారట్‌ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి.
కేక్‌లు తయారు చేసేటప్పుడు వాటిలో డ్రై ఫ్రూట్స్‌, పళ్ల ముక్కలు ఎక్కువగా వాడాలి. బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి.
ఫ్రిజ్‌ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులుగా పళ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు ఉంచాలి.
మాంసాహారం బలవర్ధకం అని బిరియాని, బటర్‌ చికెన్‌లాంటి కొవ్వు, నూనెలు ఎక్కువగా ఉండేలా వండి వడ్డించకూడదు. ఆవిరి మీద ఉడికించి, తక్కువ నూనెలో వేయించి ఇవ్వాలి.
చక్కెర కలపని పళ్ల రసాలు, చెరుకు రసం, టమాటా రసం లాంటివి ఇవ్వాలి.
టీనేజర్లు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి.
ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని శ్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి.
కొంతమంది టీనేజర్లు...మరీ ముఖ్యంగా అమ్మాయిలు బరువు పెరిగిపోతామనే బెంగతో తగినంత ఆహారం తీసుకోకుండా పోషక లోపాలకు గురవుతూ ఉంటారు. ఇలాంటి టీనేజర్లను కనిపెట్టి తల్లులు పౌష్టికాహారం వల్ల భవిష్యత్తులో ఒరిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించాలి.
చిన్న వయసు నుంచే శరీరానికి పోషకాలు అందిస్తూ గర్భం దాల్చే సమయానికి శరీరాన్ని ఎలా సన్నద్ధం చేయాలో, అలా చేయకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో వివరించాలి.
కొంతమంది టీనేజర్లు ఉదయం అల్పాహారం తినకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది రాత్రి భోజనం మానేయటం లేదా ఆలస్యంగా తినటం చేస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్లన్నీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసేవే! కాబట్టి టీనేజర్లకు నియమిత సమయాల్లో ఆహారం తినటం ఎంత అవసరమో వివరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనే ఉదయం అల్పాహారం స్కిప్‌ చేయకుండా చూసుకోవాలి.
టీనేజర్లు ఎక్కువ సమయం కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లలో గడిపేస్తూ ఉంటారు. దాంతో శారీరక వ్యాయామం కూడా కొరవడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజుకి కనీసం గంటపాటైనా శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. మగపిల్లలు తాము తగినంత ఎత్తు పెరగట్లేదని, కండలు రావట్లేదని కంగారు పడుతూ వైద్యుల్ని కలుస్తూ ఉంటారు. ఈ సమస్యలకి కారణం పోషకాహార లోపమే! తగినంత క్యాల్షియం, ప్రొటీన్‌ తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఎత్తు పెరగటంతోపాటు, చక్కటి శరీర సౌష్టవం కూడా సొంతమవుతుంది.
అలాగే ఉదయం లేచిన వెంటనే సాధ్యమైనంత త్వరగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసేయాలి. అలా చేయకపోతే ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌ సమస్యలు మొదలవుతాయి. అలాగే రాత్రి భోజనం కూడా 8 గంటల్లోపే ముగించాలి. ఇలా చేస్తే పొత్తికడుపులో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
30 నుంచి 40 ఏళ్ల వయసులో
మధ్య వయస్కుల ఆహార అవసరాల్లో తేడాలుంటాయి. ఎక్కువశాతం మంది ఉద్యోగం, ఇల్లు...రెండు బాధ్యతలు సమంగా నిర్వహించాలి కాబట్టి ఆ బాధ్యతల వల్ల ఒత్తిడి వాళ్ల జీవితంలో ఒత్తిడి సర్వసాధారణమైపోతుంది.
ఒత్తిడి వల్ల హోర్మోన్లలో అవకతవకలు, అతి ఆకలి, ఆకలి మీద నియంత్రణ కోల్పోయి కనిపించిన ప్రతిదీ తినేయటం మొదలైన సమస్యలు ఈ వయసులోనే మొదలవుతాయి. 
ఇలాంటి ఆహారశైలి వల్ల ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ డి, ప్రొటీన్ల లోపం ఏర్పడి...30 ఏళ్లకే థైరాయిడ్‌ సమస్యలు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకు కాన్పుల వల్ల ఐరన్‌, క్యాల్షియం లోపాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఈ లోట్లను భర్తీ చేయటం కోసం అన్ని రకాల ఆకుకూరలు, తృణధాన్యాలు, మాంసం, గుడ్డులోని తెల్లసొన, చేపలు, నట్స్‌ తీసుకుంటూ ఉండాలి. ఎముకల పటుత్వం కోసం వెయిట్‌ ట్రైనింగ్‌ తప్పనిసరిగా చేయాలి.
అలాగే గర్భం వల్ల పెరిగిన శరీర బరువును ప్రసవం అయిన తర్వాత సంవత్సరంలోగా తగ్గించుకోవాలి.
యోగా, మెడిటేషన్‌ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఉద్యోగినులైతే సాయంత్రం వేళ ఆఫీసు నుంచి రాగానే తేలికపాటి స్నాక్స్‌ తినాలి. రాత్రివేళ కుటుంబ సభ్యులందరూ భోజనం చేసేవరకూ ఆగకుండా వీలైనంత త్వరగా భోజనం ముగించాలి.
మధ్య వయస్కుల్లో జీర్ణశక్తి కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి పూట ఆహారం త్వరగా తినేయాలి.
అలాగే రోజంతా ఎనర్జీ లెవెల్స్‌ సమతూకంలో ఉండటం కోసం ప్రతి రెండు గంటలకోసారి స్వల్ప పరిమాణాల్లో ఆహారం తినటం అలవాటు చేసుకోవాలి.
గుమ్మడి, పుచ్చ, అవిసె గింజలు కూడా ఆహారంలో చేర్చుకుంటే వాటిలోని ఒమేగా3 యాసిడ్స్‌ వల్ల బడలిక, అలసట, కీళ్ల నొప్పులు దరి చేరకుండా ఉంటాయి.

45 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వరకూ స్త్రీలలో మెనోపాజ్‌ దశలో హార్మోన్ల స్రావాలు తగ్గిపోతాయి కాబట్టి శరీరం కాల్షియంను శోషించుకునే శక్తి కోల్పోతుంది. ఫలితంగా ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. పురుషుల్లో కండరాలు పటుత్వం కోల్పోతాయి.
కొవ్వులు శరీరంలో నిల్వ ఉండిపోతాయి. కాబట్టి శరీరం శోషించుకోగల క్యాల్షియంను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం అవసరం. దీంతోపాటు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాల సప్లిమెంట్లను వైద్యుల సూచన మేరకు వాడాలి.
ఈ వయస్కుల్లో జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. మలబద్ధకం సమస్య వేధిస్తుంది. కాబట్టి తేలికగా అరిగే ఆహారం, పీచు పదార్థాలు తీసుకోవాలి.
బయటి ఆహారం పూర్తిగా మానేసి ఇంట్లో తయారైనవే తినాలి. సమతులాహారంతోపాటు శక్తినిచ్చే పళ్ల రసాలు, మజ్జిగ తీసుకోవాలి. ఉప్పు తగ్గించాలి.
రోజూ కనీసం 45 నిమిషాలపాటైనా నడవాలి.
ఉప్పు, కారాలు, మసాలాలు వీలైనంత తక్కువ వాడి వండిన పదార్థాలే తినాలి.
నమిలి తినటానికి గట్టిగా ఉన్న పదార్థాలు అరగటానికీ మొరాయిస్తాయి. కాబట్టి ఈ వయస్కులు మెత్తగా ఉండే పదార్థాలనే తినాలి.
రాత్రి పూట 6 నుంచి 7 గంటల లోపు భోజనం చేసి, పడుకునేముందు పాలు తాగటం లేదా పళ్లు తినటం చేయాలి.
రాత్రిపూట పండిన అరటిపండు తినటం ద్వారా మలబద్ధక సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు.
రాత్రి భోజనం చేసిన వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత పడుకోవాలి.
భోజనం చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.
ఈ వయస్కుల్లో కంటి చూపు, జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. బీటా కెరోటిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కాలిఫ్లవర్‌, క్యారెట్‌, చిలకడ దుంపలు, గుమ్మడికాయ మొదలైనవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
వాల్‌నట్స్‌, బాదం కూడా ఎక్కువగా తినాలి.
ఆ సమయంలో...
పూర్వం 15 ఏళ్ల వయసుకే ఆడపిల్లలకు పెళ్లి చేసేవాళ్లు కాబట్టి రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆ సమయంలో స్వీట్లు, నెయ్యి ఎక్కువగా తినిపించేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోయినా ఆ ఆహార సంప్రదాయం ఇప్పటికే అలాగే కొనసాగుతోంది.
నిజానికి రజస్వల అయినప్పుడే కాదు, ఏ వయసు పిల్లలకూ విపరీతంగా స్వీట్లు, నేతి పదార్థాలు పెట్టకూడదు. పైగా రజస్వల అయిన పిల్లలను ఇంటికే పరిమితం చేసేస్తారు. దాంతో పిల్లలు ఆ కొద్ది రోజుల్లో విపరీతంగా బరువు పెరగటంతోపాటు ఆ ఆహార శైలికి అలవాటు పడి అలాగే కొనసాగుతారు. అధిక బరువు వల్ల హర్మోన్లలో అవకతవకలు మొదలవుతాయి. ఇది ప్రమాదకరం.
రజస్వల సమయంలో హార్మోన్ల స్రావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి మిగతా పిల్లలతోపాటే ప్రొటీన్లు ఎక్కువగా ఇవ్వాలి.
రజస్వల సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉండి ఐరన్‌ లోపం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా ఇవ్వాలి.
ఎక్కువశాతం ఆడపిల్లలు 9, 10 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతున్నారు. ఇందుకు కారణం క్యాల్షియం, విటమిన్‌ డి లోపం. ఈ లోపాల వల్ల రక్తం గడ్డ కట్టడం ఆగుతుంది. దాంతో ఆగకుండా రుతుస్రావం అవటం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
ఈ లోపాలు రాకుండా ఉండాలంటే రోజుకి కనీసం అర లీటరు పాలు పిల్లల చేత తాగించాలి. వేరుసెనగ పప్పు, బెల్లం, ఖర్జూరాలు, పప్పులు, అటుకులు, రాగులు, నువ్వులతో తయారుచేసిన చిరుతిళ్లు తినిపించాలి.
ఆహారంలో పుదీనా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
శరీరాన్ని చల్లగా ఉంచటం కోసం బీటా కెరోటీన్‌ ఎక్కువగా నారింజ లాంటి పళ్లు ఎక్కువగా ఇవ్వాలి.
-డాక్టర్‌. ఆర్‌.డి.సుజాతా స్టీఫెన్‌,
చీఫ్‌ న్యూట్రిషనిస్ట్‌, యశోదా హాస్పిటల్స్‌, మలక్‌పేట, హైదరాబాద్‌



భయం లేదు!
బాహ్య వాతావరణం నుంచి శరీరంలోకి ప్రవేశించే వాటిని ఆగంతుజ రోగాలని, శరీరంలోనే వచ్చిన మార్పుల వల్ల కలిగే వాటిని నిజరోగాలని అంటారు. అయితే, స్వైన్‌ ప్లూ విషయంలో ఈ రెండు మూలాలు ఉంటాయి. ఈ ఫ్లూ బాహ్య వాతావరణం నుంచి శరీరంలోకి ప్రవే శించినా అది వ్యాపించడానికి, బలపడ టానికీ శరీర స్థితి కూడా కారణమే. వైరస్‌ ఎంత శక్తివంతమైనదైనా వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్న శరీరంలో దాని ప్రభావమేమీ ఉండదు. శరీరంలోనే దోషం ఉంటే వ్యాధి నిరోధక శక్తి లోపించి వైరస్‌ శరీరంలో నివాసం ఏర్పరుచుకోవడానికీ, వృద్ధి చెందడానికీ వైర్‌సకు సులువవుతుంది.
అందుకే మనిషి చేయవలసిందల్లా వ్యాధికారకాలను లోనికి ప్రవేశించకుండా ఒక అడ్డుగోడ నిర్మించుకోవడమే. ఆ అడ్డుగోడే వ్యాధి నిరోధక శక్తి. అప్పుడిక బయటినుంచి వచ్చే ఆగంతుజ రోగమేదీ శరీరంలో ఉండిపోయే నిజరోగంగా మారదు.
స్వైన్‌ ఫ్లూ అని తెలియగానే వైరస్‌ లోనికి ప్రవేశించకుండా మాస్క్‌లు ధ రిస్తున్నాం. అయితే ఇది కేవలం బాహ్యమైన కవచం మాత్రమే. అది అవసరమే అయినా అంతకన్నా ముఖ్యమైనది శరీరంలోపల మాస్క్‌ ధరించడం. అంటే జీవశక్తిని, వ్యాధినిరోధక శక్తినీ పెంచుకోవడమే. వ్యాధి నిరోధక దిశగా పనిచేసే క్రమంలో ఆయుర్వేదం రెండు రకాల చికిత్సలకు ప్రాధాన్యతనిస్తుంది. వాటిలో ఒకటి రోగహర చికిత్స. రెండవది దోషహర చికిత్స, మొదటిది వ్యాధి సోకిన తరువాత చేసే చికిత్స. రెండవది శరీరంలో వ్యాధికి గురయ్యే దోష గుణాలను తొలగించే చికిత్స.
ఎలాంటి మందులు ?
ప్రస్తుత స్థితిలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పుల వంటి లక్షణాలు ఏ కాస్త కనిపించినా చాలు అది ఫ్లూ యేమో అన్న అనుమానం కలగవచ్చు. కానీ, నిజంగానే ఫ్లూవ్యాధికి గురయ్యే వారి సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ నిజంగానే వ్యాధి గ్రస్తుల విషయంలో ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది. ఫ్లూవ్యాధికి సంబంధించినవిగా అనిపించే లక్షణాలు కనిపించగానే, వెంటనే క్రోసిన్‌, పారసిటమాల్‌ వంటి బలమైన మందులు తీసుకోకూడదు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తగ్గిపోయి వ్యాధి మాత్రం లోలోపల పెరుగుతూ పోవచ్చు. ఈ స్థితిలో అతి సూక్ష్మస్థాయిలో పనిచేసే మందులు మాత్రమే వాడాలి. మందులు వ్యాధి లక్షణాలను తగ్గించడంతో పాటు వ్యాధినిరోధకంగా పనిచేసేవిగా ఉండాలి. మందులేవీ తీసుకోకుండా కేవలం వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికే పరిమితం కావడం ఈ దశలో సరికాదు. అలా చేస్తే వ్యాధినిరోధక శక్తి రెండు రెట్లు పెరిగే సరికి వ్యాధి ఎనిమిది రెట్లు పెరుగుతుంది. అందుకే వ్యాధిని తగ్గించే మందులతో పాటు, వ్యాధినిరోధక శక్తిని పెంచే మందులు కూడా తీసుకోవాలి.
సులువైన తయారీ
వ్యాధి చికిత్సకూ, వ్యాధినిరోధకానికీ ఒక ఔషధ తయారీని ఇక్కడ చెప్పుకుందాం. దీన్ని ఎవరికి వారు అతి సునాయాసంగా తయారు చేసుకోవచ్చు. పెద్ద ఖర్చేమీ లేకుండా సిద్ధం చేసుకునే ఈ మిశ్రమాన్ని అన్ని వయసుల వారూ వాడుకోవచ్చు . పైగా బొత్తిగా దుష్ప్రభావాలు ఉండ వు. మిశ్రమం కోసం గుప్పెడు తమలపాకులు, గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు ఓమ ఆకులు, సగం గుప్పెడు వేపాకులు (మరీ లేతవిగానీ, మరీ ముదురువి కానీ కాకుండా ) మూడు వెల్లుల్లి పాయలు, అరస్పూను మిరియాలు తీసుకోవాలి. వీటిని దంచకుండా చేతితో తుంచాలి లేదా కత్తిరించాలి. మిరియాలను మాత్రల చిన్న చిన్న రవ్వలయ్యేలా దంచాలి. చివరగా పావు చెంచా అతి మధురం (యష్టిమధు)కూడా తీసుకుని అన్నింటినీ రెండు గ్లాసుల నీటిలో వేయాలి.
చిన్న మంటతో రెండు గ్లాసుల నీరు ఒక గ్లాసు అయ్యేంత వరకూ మరిగించాలి. ఆ తరువాత వడపోసి తీసిన కషాయాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని రోజుకు నాలుగు పూటలా తాగాలి. కషాయం కొంత చేదుగానూ, కాస్త ఘాటుగానూ ఉంటుంది కాబట్టి పిల్లల కోసమైతే తీపికోసం కొంచెం కండచెక్కర కలపాలి. పెద్దలకైతే ప్రతి పూటకూ అరచెంచా తేనె కలుపుకుని తాగవచ్చు. ఈ కషాయాన్ని వారం రోజుల పాటు తీసుకుంటే మంచిది. లేదంటే కనీసం మూడు రోజులు తాగినా చాలు. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలన్నీ పోవడంతో పాటు అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. ఇందులో వాడిన తులసి ఆకు, వేప ఆకు, వె ల్లుల్లి, యష్టిమధులల్లో వైర్‌సను హరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎన్నో పరిశోధనల్లో రుజువైన నిజం. అయితే, గర్భిణీ స్త్రీలు తాగే కషాయంలో మాత్రం యష్టిమదును వాడకూడదు. ఆ ఒక్క అంశాన్ని కలపకపోయినా అంత పెద్ద నష్టమేమీ ఉండదు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడం వీలు కాని వారికోసం ఆయుర్వేద ఔషధ దుకాణాల్లో కొన్ని మందులు లభిస్తాయి.
మహా సుదర్శన చూర్ణం
500 మి, గ్రా. మోతాదులో రోజుకు రెండు సార్లు పరగడుపున వేసుకోవాలి. అయితే ఇది బాగా చేదుగా ఉంటుంది. కాబట్టి ఈ చూర్ణాన్ని క్యాప్సుల్‌లో పెట్టుకుని వేసుకోవాలి.
మహా లక్ష్మీవిలాస రసం
శరీర ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చూర్ణం బాగా పనిచేస్తుంది. 125 మి. గ్రా. మోతాదులో తేనెతో కలిపి రోజూ రెండు పూటలా పరగడుపున వేసుకోవాలి.
త్రిభువన కీర్తి రసం
చిన్న పిల్లలకోసం ఇది మేలు. వారి వయసును బట్టి 65 నుంచి 125 మి గ్రాముల వరకు తేనెతో కలిపి రెండు పూటలా పరగడుపున ఇవ్వవచ్చు
కంటకారి లేహ్యం
శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను పరగడుపున తీసుకోవచ్చు.
చవన్‌ ప్రాశ్‌
శ్వాస సమస్యలతో పాటు, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను పరగడుపున తీసుకోవచ్చు. అయితే ఆ తరువాత వెంటనే గోరువెచ్చని ఆవుపాలు గానీ, లేదా గోరు వెచ్చని నీళ్లుగానీ తీసుకుంటే అది సులువుగా జీర్ణమవుతుంది. ఏ జబ్బూ లేకపోయినా రోజూ చవన్‌ప్రాశ్‌ తీసుకుంటూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేస్తే వైరస్‌ సంబంధిత సమస్యలనుంచి చాలా వరకు దూరంగా ఉండవచ్చు.
ద్రాక్షారిష్టం
నాలుగు చెంచాల ద్రావణాన్ని ఎనిమిది చెంచాల నీటితో కలిపి ఉదయమూ, సాయంత్రమూ భోజనం తరువాత తీసుకోవాలి. ఇవన్నీ వ్యాధి నిరోధకంగానూ, చికిత్సగానూ పనిచేస్తాయి.
వ్యాధి తీవ్రతలో
వ్యాధి సోకి సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఒక మిశ్రమాన్ని తయారుచేసి వాడుకోవచ్చు. వాటిలో స్వర్ణలఘు సూత శేఖరరసం మాత్రలను పొడి చేసి అందులో నింబాది చూర్ణం, తాలిసాది చూర్ణం, హరిద్రాకండ చూర్ణం కలుపుకుని రోజూ మూడు పూటలా 500 మి. గ్రాముల చొప్పున తేనెలో కలుపుకుని తీసుకోవాలి. శ్వాసకోశ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వులనూనెలో కర్పూరం కలిపి గొంతు నుంచి ఛాతీ దాకా మర్ధన చేయాలి. మందులు వేసుకోవడం కూడా కష్టంగా ఉన్నప్పుడు నాలుగు చుక్కల వే ప నూనె ముక్కులో వేయాలి. ఇది మంచి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది.
- డా . డి. ప్రశాంత్‌ కుమార్‌
ఆయుర్వేద వైద్య నిపుణులు

నివారణ ఉంది!.. చికిత్సా ఉంది!!
స్వైన్‌ ఫ్లూ
ఇది స్వైన్‌ ఫ్లూ సీజన్‌. ఈ వైరస్‌ బారిన పడకుండా ముఖానికి మాస్క్‌లు ధరించినవారు చాలామందే కనిపిస్తుంటారు. అయితే స్వైన్‌ ఫ్లూ పేరు వినగానే బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో, హోమియోపతిలో ఈ వైరస్‌కు తగిన మందులున్నాయంటున్నారు వైద్యులు.
దుల్లో ఫ్లూ జ్వరాన్ని తెచ్చి పెట్టే వైరస్‌ కావడం వల్ల, పందుల నుంచి మనుషులకు వ్యాపించడం వల్ల ఈ వైర్‌సను స్వైన్‌- ఫ్లూ వైరస్‌ అంటున్నారు. అయితే ఆ తర్వాత పరిణామంగా మనుషుల నుంచి మనుషులకు పాకడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రుతువు మారినప్పుడల్లా ఈ వైరస్‌ తలెత్తుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే విజృంభిస్తుంది.
స్వైన్‌ ప్లూ లక్షణాలు 3 దశల్లో....
మొదటి దశలో...
తీవ్రస్థాయిలో జలుబు, విపరీతంగా తుమ్ములు, ముక్కువెంట విపరీతంగా నీరు కారడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, స్వల్పంగా జ్వరం ఉంటాయి.
రెండవ దశలో
కొంచెం కొంచెంగా జ్వరం పెరుగుతూ ఉండడం, ఒంటి నొప్పులు తీవ్రం కావడం, దగ్గు పెరిగిపోవడం, స్వల్పంగా ఆయాసం ఉంటాయి.
మూడవ దశలో...
జలుబు తీవ్రమై, ఆయాసంతో గుక్క తిప్పుకోలేకపోవడం.
చాతీలో స్వల్పంతా నొప్పి, తీవ్రత పెరిగాక అపస్మారక స్థితిలోకి వెళ్లడం
ఈ లక్షణాలు ప్రధాన కనిపిస్తాయి.
స్వైన్‌- ప్లూ వైర్‌సతో వచ్చే ప్రధానమైన చిక్కు ఏమిటంటే, మ్యూటేషన్‌ కారణంగా దాని అంతర వ్యవస్థ ఏటేటా మారిపోతూ ఉంటుంది. అందుకే గత సంవత్సరం రూపొందించిన టీకాలు ఈ సంవత్సరం పనిచేయవు. అందుకే మళ్లీ కొత్త టీకాలు తయారు చేయడం అనివార్యమవుతుంది. మిగతా వైర్‌సల మాట ఎలా ఉన్నా, స్వైన్‌ ఫ్లూ వైరస్‌ (హెచ్‌- 1, ఎన్‌-1)లో మాత్రం చాలా వేగంగా మ్యూటేషన్‌ జరుగుతుంది. అయితే హోమియోలో వైర్‌సలో ఎప్పటికప్పుడు జరిగే మ్యూటేషన్‌తో సంబంధం లేకుండా శరీర వ్యవస్థనంతా ఆవ రించిన వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులు హోమియోపతిలో ఇవ్వబడతాయి. దీనివల్ల ఎటువంటి వైర్‌సనైనా ఎదుర్కొనే శక్తి శరీరంలో పెరుగుతుంది.
రక్షణ శక్తి తగ్గకుండా....
వైద్య చికిత్సలతో పాటు పోషక పదార్థాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే శరీర వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి అందుకకే ఆ లోపాలు లేకుండా చూసుకోవాలి.
నిద్ర తక్కువైనా, శారీరక, మానసిక ఒత్తిళ్లల ఎక్కువైనా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
తరుచూ యాంటీబయాటిక్స్‌ వేసుకునే వారిలో జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా దెబ్బ తింటుంది. దీనివల్ల జీర్ణవ్యవస క్షీ ణించి శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఇది కూడా వ్ధాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వైరస్‌ బారిన పడే పరిస్థితి పెరిగిపోతుంది.
అందుకే సైన్‌- ప్లూ వంటి వ్మాధుల బారిన పడకుండా ఉండడానికి పోషక పదార్థాల లోపాలు లేకుండా చూసుకోవడం ప్రధమ జాగ్రత్త అవుతుంది.
హోమియోలో...
మహమ్మారి వ్యాధులను నివారించడానికి హోమియోపతి అనుసరించే విధానాన్ని జీన్‌సఎపిడె మికస్‌ అంటారు. ఏదైనా ఒక వ్యాధి బారిన పడిన ఓ పదిమందిని తీసుకుని వారందరిలోనూ కనిపించే కొన్ని సాధారణ లక్షణాల ఆధారంగా దాన్ని రాకుండా నివారించే మందును నిర్ణయించడం ఈ విధాన లక్ష్యం. అయితే ఒక సారి నిర్ణయించిన మందు ఆ వ్యాధి ప్రతి ఏటా పనికి రాకుండా పోవచ్చు. కానీ, ఆ సారికి మాత్రం సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాలానుగుణంగా ఆ వైర స్‌లో వచ్చే మార్పులు, వాతావరణ పరిస్థితులు, కొత్త సంయోగాల (రీ-కాంబినేషన్స్‌) వంటి అనేక కారణాల వల్ల దాదాపు ప్రతిసారీ మందులు మార్చవలసి రావచ్చు.
నివారణగా.....
ఒకసారి ఏదైనా తీవ్రవ్యాధికి గురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి యాంటీబాడీస్‌ వృద్ధిచెంది. మళ్లీ అదే వ్యాధికి గురయ్యే అవకాశం దాదాపు ఉండదు. కానీ, రెండవ సారి ఆ వ్యాధి రాకపోయినా మొదటి సారి వచ్చిన తాలూకు ప్రభావాలు చాలా కాలం వేధిస్తూనే ఉంటాయి. అందుకే ఆ మొదటిసారి కూడా వ్యాధి శరీరంలోకి వ్యాధి చొరబడకుండా చూడటం చాలా ముఖ్యం. అలా వ్యాధి రాకుండా నిరోధించడలో ఇన్‌ఫ్లూఎంజిన్‌ -200 బాగా పనిచేస్తుంది. ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు వేసి ఆగిపోవాలి. 5 రోజుల తర్వాత ఆర్సెనిక్‌ ఆల్బ్‌ -200 మందును ఒక రోజు మూడు సార్లల వవేఏసిఇ ఆపేయాలి. ఒకవేళ వ్యాధి మహమ్మారిగా మారినప్పుడు వారం తర్వాత మరో డోసు వేస్తే సరిపోతుంది.
వైద్య చికిత్సగా....
రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగానే వైద్య చికిత్సలు ఉంటాయి. అందులో భాగంగా ఆర్సెనిక్‌ ఆల్బ్‌, జెల్సీనియం మందులు ఇస్తూ యుపటోరియం మందు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందును వ్యాధి తీవ్రతను బట్టి పొటెన్సీని 30 నుంచి 200 దాకకా పెంచవలసి ఉంటుంది. చివరగా, ట్యూబర్‌క్లీనమ్‌ ఒక డోసు ఇస్తే, శరీరంలో వ్యాఽధినిరోధక శక్తి పెరుగుతుంది. కాకపోతే ఈ మందులను హోమియో వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవడమే శ్రేయస్కరం.
ఎవరికి ముప్పు?
స్వైన్‌ఫ్లూ ఎవరికైనా రావచ్చు.. అయితే, పిల్లలు, వృద్ధులు, మహిళు ఈ వైరస్‌ బారిన పడ అవకాశాలు ఎక్కువ. స్త్రీలలో ప్రత్యేకించి గర్భినీ స్త్రీలు ఈ వైర్‌సకు గురయ్యే అవకాశాలు మరీ ఎక్కువ.
రెండేళ్ల లోపు చిన్న పిల్లలు, ఆస్తమా భాధితులు, సీఓపీడి, దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడే వారు కూడా చాలా త్వరితంగా ఈ వైర స్‌ బారన పడతారు.
గుండె జబ్బులు, కాలేయ, కిడ్నీ సమస్యలు గలవారు, జీవక్రియల సమస్యలతో ఉన్నవారు, మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా ఈ వైర్‌సకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
అన్నింటినీ మించి రోగ నిరోధక శక్తి తగ్గిన వారు స్వైన్‌ ఫ్లూ వైర్‌సక ఎక్కువగా గురవుతుంటారు.
- డాక్టర్‌ కె గోపాలకృష్ణ
హోమియో వైద్యనిపుణులు


పేను కొరుకుడును ఆపే నల్లజీడి
2 లీటర్ల కొబ్బరి నూనెలో గానీ, నువ్వుల నూనెలో గానీ 3 నల్లజీడి గింజల్ని కత్తిరించి వేసి, కొద్దిసేపు కాచి ఆ ముక్కలను తీసివేయాలి. ఆ తైలాన్ని రోజూ తలకు రాస్తే, తెల్లబడ్డ వెంట్రుకలు నలుపెక్కడమే కాకుండా వాటి కుదుర్లు గట్టిపడి వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి.
2 కిలోల ఆవు నెయ్యిలో 8 జీడి గింజల ముక్కలు వేసి, కాచి ఆ ముక్కల్ని తీసివేయాలి. ఆ నెయ్యిని రెండు స్పూన్‌ల మోతాదులో రోజూ సేవిస్తే, క్రిమి రోగాలు, సుఖ వ్యాధులు వాత దోషాలు తగ్గుతాయి. కాకపోతే వేడి శరీరం వాళ్లు ఈ జీడిని వాడకూడదు.
నల్ల జీడి కాండపు బెరడును నీడన ఎండించి, మెత్తటి చూర్ణం తయారు చేసుకోవాలి. 25 గ్రాముల ఈ చూర్ణాన్ని 100 మి. లీ కొబ్బరి నూనెలో కలిపి ఆ నూనెను లేపనంగా వేస్తే కాలిన గాయాలు మానిపోతాయి.
జీడి గింజల్లోని జీడిని తీసి, చూర్ణం చేసి, తేనెతో కలిపి రాస్తే, పేను కొరుకుడు తగ్గిపోయి, మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి.
జీడి చెక్కను మెత్తగా దంచి ఉడికించి, పైన కట్టుకడితే, వాపుతో కూడిన కీళ్లనొప్పులు తగ్గిపోతాయి.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list