MohanPublications Print Books Online store clik Here Devullu.com

రాఖీ_Rakhi



అనుబంధానికో అందమైన రాఖీ..!


మారిన జీవనశైలిలో భాగంగా పలకరింపుల్లో తేడాలు వచ్చి ఉండొచ్చు, ఒకరినొకరు నేరుగా చూసుకోలేనంత దూరాలూ పెరిగి ఉండొచ్చు. కానీ ఆప్యాయతానురాగాల్లో మాత్రం కొంచెం కూడా తేడా లేదు. అవునుమరి, అది రక్తసంబంధం... అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధం. ఆ అనుబంధాన్ని మరింత గాఢంగా ముడివేస్తూ ఏడాదికోమారు శ్రావణమాసంలో జరుపుకునే అపురూపమైన వేడుకే రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్‌. ఆ రోజున చంద్రుడికో నూలుపోగులా అన్నదమ్ముల శ్రేయస్సును కోరుకుంటూ వాళ్ల ప్రేమ తమకు చిరకాలం ఉండేలా ఆకాంక్షిస్తూ రక్షరేకును చుట్టిన పసుపు, ఎరుపు దారాలను వాళ్ల చేతికి అక్కాచెల్లెళ్లు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఆ దారాలే నేడు అనేక వెరైటీల్లో దొరుకుతూ కట్టేవారి, కట్టించుకునేవారి మనసును దోచుకుంటున్నాయి.
వజ్రాల రాఖీలు! 
భవిష్య పురాణం ప్రకారం- బాలి అనే రాక్షసరాజును సంహరించేందుకు విష్ణుమూర్తి సలహామేరకు శచీదేవి పూజించిన ఓ నూలుదారాన్ని భర్త చేతికి కట్టి పంపించిందనీ, ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి రావడంతో కదనరంగానికి వెళ్లేముందు తమ భర్తలకీ అన్నలకీ మహిళలు పవిత్ర దారాన్ని రక్షాబంధనంలా కట్టడం వాడుకలోకి వచ్చిందనీ, అదే సోదరసోదరీప్రేమకు ప్రతీకగా మారిందనేది పురాణ కథనం. కైకేయ(పౌరవ)సామ్రాజ్యాన్ని పాలించిన పురుషోత్తమచక్రవర్తికి అలెగ్జాండర్‌ భార్య రొక్సానా ఓ పవిత్ర దారాన్ని పంపించి, తనను సోదరిలా భావించి, తన భర్తను చంపవద్దని కోరిందట. అది కట్టుకున్న కారణంగానే ఆ చక్రవర్తి, యుద్ధంలో అలెగ్జాండర్‌ను అవకాశం వచ్చినా చంపలేదన్నది చారిత్రక కథనం. అందుకే రక్తసంబంధీకులనే కాదు, పరాయి స్త్రీ, పురుషులమధ్య ఉండే సోదరసోదరీ ప్రేమను సూచిస్తూ ఈ వేడుకను చేసుకుంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తోటిఉద్యోగులు, విద్యార్థులు... ఇలా తమకు రక్షగా నిలిచే వాళ్లందరికీ అమ్మాయిలు రాఖీలు కట్టడం అలా పుట్టుకొచ్చినదే. దాంతో ఒకప్పుడు తమ అన్నదమ్ములకోసం స్వయంగా చేసుకునే ఆ రక్ష రేకులు, నేడు బంగారం, వెండి, వజ్రాలు, నవరత్నాలతో చేసిన అందమైన ఆభరణాల రూపంలో కనువిందు చేస్తున్నాయి. కొన్ని నగల దుకాణాలయితే, ఆ రోజు కోసం ఒక్కోటీ యాభై లక్షల రూపాయల విలువచేసే ఖరీదైన వజ్రాల రాఖీలను సైతం రూపొందిస్తున్నాయి. అంతేకాదు, బ్రొ, భాయ్‌... వంటి పదాలను చెక్కిన బంగారు రాఖీలూ, తెల్లరాళ్లను పొదిగిన వెండి బంధనాలూ నవరత్నాల లాకెట్లతో చేసిన ఆభరణాల్లాంటి రాఖీలు ఈతరాన్ని అలరిస్తున్నాయి. అంత ధరలు పెట్టలేనివాళ్లకోసం సహజాతి రత్నాలను పొదిగి వెండి, బంగారు పూత పూసినవీ చేస్తున్నారు. ఇక, జర్దోజి, దారం ఎంబ్రాయిడరీలూ రాళ్లూ రుద్రాక్షలూ క¹లిపి రూపొందించే డిజైనర్‌ రాఖీలు టీనేజర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

చిన్నారి రక్ష! 
ఇవన్నీ ఒక ఎత్తయితే, పిల్లలకోసమే ప్రత్యేకంగా బ్యాట్‌మన్‌, స్పైడర్‌మ్యాన్‌, పోకెమాన్‌, మిక్కీ, మిన్నీమౌస్‌ల్లాంటి కార్టూన్‌ క్యారెక్టర్లూ; ఛోటాభీమ్‌, హనుమాన్‌, శ్రీకృష్ణ... వంటి పౌరాణిక పాత్రల రాఖీలూ వస్తున్నాయి. చిట్టిచెల్లెళ్లు కట్టే ఆ రాఖీలను పదేపదే చూసుకుంటూ మురిసిపోతున్నారు ఆ చిన్నారి అన్నలూ తమ్ముళ్లూనూ. తండ్రి తరవాత తండ్రిలా ఆలనాపాలనా పట్టించుకునే అన్నకి కట్టి, అమ్మ తరవాత అమ్మలా తమ బాగోగుల్ని చూసుకునే వదినమ్మకి కట్టకపోతే ఏం బాగుంటుందన్నట్లు ఈమధ్య అన్నావదినలిద్దరికీ రాఖీ కట్టడం ఆనవాయితీ అయింది. భయ్యాభాభీ సెట్స్‌ పేరుతో వస్తోన్న ఈ రాఖీలు ఆన్‌లైన్‌లో తెగ సందడి చేస్తున్నాయి. ఈ రెండింటికీ మరో రెండు చిట్టి రాఖీలను జోడించిన కుటుంబ రక్షాబంధన్‌ సెట్లూ దొరుకుతున్నాయి. అయితే రాఖీల్లో ఎన్ని రకాల డిజైన్లు వస్తున్నా ఇప్పటికీ పూల డిజైన్లదే హవా. సిల్కుదారాలతో అల్లిన కృత్రిమపూలూ బంగారుపూలూ చొప్పించి చేతినిండుగా అందంగా కనిపించేలా రాఖీలు తయారుచేస్తున్నారు. ఆయా వ్యక్తుల పేర్లూ, ఫొటోలతో రూపొందించిన పర్సనలైజ్డ్‌ రాఖీలూ వస్తున్నాయి. అన్నదమ్ముల ఫొటోలతోనూ, తమ అన్యోన్యతను సూచించే ఫొటోలతోనూ రాఖీలు చేయిస్తున్నారు. చూశారుగా... తమకు జీవితాంతం రక్షగా నిలిచే అన్నదమ్ముల శ్రేయస్సును కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ, ఏటా శ్రావణపౌర్ణమినాడు వాళ్ల ముంజేతికి అక్కచెల్లెళ్లు ఎంతో ఆప్యాయంగా కట్టే ఆ రక్షాబంధనాల్లో ఎన్ని రకాలు వస్తున్నాయో. అందరికీ రాఖీ శుభాకాంక్షలతో..!







రాఖీ పూర్ణిమ 

అనురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం- రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో, రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమివేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమనాడు, ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లివిరుస్తాయి. సామరస్య సంతోషాలు సోదర సోదరీమణుల మధ్య వ్యక్తమవుతాయి. ఉత్తర భారతంలో విశేష వ్యాప్తి చెందిన ఈ సంబరం, కాలక్రమంలో దేశమంతటా విస్తరించింది.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతలకు ఓ అందమైన ఆవిష్కరణ- రక్షాబంధనం. సోదరుడి ఆరోగ్యం, శ్రేయస్సు, సంతోషాన్ని ఆకాంక్షిస్తూ- సోదరి పవిత్ర హృదయంతో అతడి చేతికి రక్షా కంకణాన్ని ధరింపజేస్తుంది. నుదుట తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, మధుర పదార్థాన్ని సోదరుడికి సోదరి తినిపిస్తుంది. అమ్మ కనబరచే ఆదరణ, నాన్న కలిగించే భద్రతను ప్రస్ఫుటం చేస్తూ- సోదరి తన అనురాగాన్ని సోదరుడి పట్ల ప్రకటిస్తుంది. ‘నేను ధరింపజేసే ఈ రక్ష- నీ భావి జీవితమంతటా సర్వదా అండగా ఉంటుంది’ అనే భావనను వ్యక్తీకరిస్తుంది. సోదరుడి కుడిచేతికి సోదరి ‘మంగళ రక్షాబంధనం’ చేయాలని ‘వ్రతోత్సవ చంద్రిక’ గ్రంథం చెబుతోంది.
రక్షాబంధనం ఉత్సవానికి అనేక పేర్లున్నాయి. రక్షికా పున్నమి, నారికేళ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి- ఇలా అనేక రీతుల్లో ఈ సందడి వ్యవహారంలో ఉంది. దీన్ని ‘ధర్మబద్ధమైన వేడుక’గా పురాణాలు నిర్వచించాయి. పాండవులకు జయం సిద్ధించడానికి శ్రీకృష్ణుడు ఓ సూచన చేస్తాడు. ఆ మేరకు ధర్మరాజు తన సోదరులకు మంత్రపూర్వకంగా రక్షాబంధన మహోత్సవం నిర్వహించాడని ‘మహాభారతం’ చెబుతుంది. సోదరీమణులతో రక్షాబంధనం ధరింపజేసుకున్నవారికి యమకింకరుల భయం ఎన్నటికీ ఉండదని-యముడు తనసోదరి యమునకు చెప్పినట్లు ‘భవిష్యోత్తర పురాణం’ పేర్కొంది. దానశీలుడైన బలి చక్రవర్తికి శ్రీమహావిష్ణువు తన శక్తిని ఓ కంకణంలో నిక్షిప్తం చేయడం ద్వారా ‘రక్ష’గాఅందజేశాడని ‘విష్ణుపురాణం’ విశదపరచింది. శత్రుభయం లేకుండా తన సుపుత్రుడు అఖండ పాలనసాగించాలని ఆకాంక్షిస్తూ, భరతుడికి తల్లి శకుంతల రక్ష కట్టిందని పురాణ కథనం.
‘రాకా’ అంటే- నిండుదనం, పున్నమి అనే అర్థాలున్నాయి. రాకా చంద్రుడు అంటే, పున్నమి చంద్రుడు. ఈ పున్నమినాడు ధరించే రక్ష ‘రాఖీ’గా స్థిరపడింది. ‘రాఖీ’ అంటే, రక్షిక. అది సంవత్సర పర్యంతం సోదరుడికి రక్షగా నిలిచే మహత్తర కవచమని ‘ధర్మసింధు’ ప్రస్తావించింది. చారిత్రకంగానూ రక్షాబంధనం ఎంతో ప్రశస్తి చెందింది. రాజపుత్రుల యువరాణి కర్ణావతి- మొగలాయీ పాలకుడు హుమాయూన్‌కి రక్షను ధరింపజేసి, శత్రువుల నుంచి రక్షణ పొందిందంటారు. పురుషోత్తమ చక్రవర్తికి రాఖీ కట్టిన అలెగ్జాండర్‌ ప్రేయసి రుక్సానా, ఆయనకు ప్రాణభిక్ష కోరిందని చెబుతారు. ఛత్రపతి శివాజీ ఏటా పూర్ణిమనాడు తుల్జా భవానీ సమక్షంలో రక్షాబంధనం చేసుకుని, ధర్మనిబద్ధతకు పునరంకితమయ్యేవాడని చరిత్ర చెబుతోంది.
మరాఠా పాలకుడు పీష్వా బాజీరావు కాలంలో, ఈ పున్నమిని సమైక్యతా దినోత్సవంగా నిర్వహించేవారంటారు. రాఖీ పండుగ ద్వారా స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘లోకమాన్య’ తిలక్‌- భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్ష రగిలించారు. ‘విశ్వకవి’ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రక్షాబంధన్‌ సందర్భాన్ని సామాజిక ఐక్యతా వారధిగా వినియోగించుకున్నారు. విభిన్న వర్గాల్ని ఏకీకృతం చేసిన ఆ కవీంద్రుడు, రక్షాబంధనాన్ని ఓ సంరంభంగా నిర్వహించారు. ఇలా రక్షాబంధన ఉత్సవం ఓ పర్వదినంగానే కాక- జాతీయ సమగ్రతకు, సామరస్యానికి ఉపకరించింది.
జైనులు ఈ పర్వాన్ని ‘రక్షక్‌ దివస్‌’గా నిర్వహిస్తారు. కొబ్బరికాయల్ని సముద్రజలాల్లో వదిలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తారు. శ్రావణ పూర్ణిమను ‘సంతోషిమాత జన్మదినోత్సవం’గానూ పరిగణిస్తారు. జ్ఞానానికి అధిష్ఠానదైవంగా భావించే హయగ్రీవ జయంతి నేడే! సంస్కృత భాషాదినోత్సవంగానూ ఈ పున్నమి ఖ్యాతి సంతరించుకుంది. ఇలా పలు విశేషాంశాల సమాహారంగా శ్రావణ పూర్ణిమ వర్ధిల్లుతోంది!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌



సర్వరక్షా బంధనం

శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానవిధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.

అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి కట్టదలిచామో వారి ముంజేతికి కడుతూ– ఆ రక్షిక మీద అక్షతలని వేసి, రక్షాబంధనాన్ని కట్టాలి. రక్షాబంధనం కట్టించుకున్న వారు వీరికి అన్ని విధాలా అండగా నిలబడాలి. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకి కట్టుబడి అండగా నిలవాలి. తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడాలని, భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వస్తారు ఆడపడచులు. తమ సోదరుల చేతికి రక్షాబంధనం కట్టి, వారికి తీపి తినిపిస్తారు. అప్పుడు ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయ . అయితే రక్షాబంధనాలను వెండివి, బంగారువి లేదా విలువైనవి కట్టాలని లేదు. సంప్రదాయ రక్షాబంధనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో సరిపెట్టకూడదు. దాని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది.

రతనాల రాఖీలు
అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు నడుమ ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌ పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ ఇది. అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లు రాఖీ కడతారు. రాఖీలు కట్టిన అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములు కానుకలు ఇచ్చి సంతోషపెడతారు. రాఖీ పండుగ గురించి ఇదంతా అందరికీ తెలిసిన ముచ్చటే. ఈ పండుగకు సంబంధించి చాలా పురాణగాథలు ఉన్నాయి. అంతేకాదు, చరిత్రలోనూ రక్షాబంధనానికి ప్రాధాన్యమిచ్చే ఉదంతాలు ఉన్నాయి. ఏటా శ్రావణ పున్నమి నాడు వచ్చే ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిలో వేడుకలు చేసుకుంటారు. రాఖీ పండుగ గురించి, రాఖీల గురించి అవీ... ఇవీ...

చరిత్రలో రాఖీ
భారత్‌ మీద క్రీస్తుపూర్వం 326లో దండెత్తిన అలెగ్జాండర్‌ భార్య రొక్సానా భారతీయ రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టి, తన భర్తకు హాని తలపెట్టవద్దని కోరిందట. అందువల్ల యుద్ధరంగంలో చేతికి చిక్కిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు ప్రాణాలతో విడిచిపెట్టేశాడట.

మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తుశకం 1535లో చిత్తోర్‌ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయం పొందిందట. భర్త మరణించగా చిత్తోర్‌ రాజ్యపాలన బాధ్యతలు చేపట్టిన రాణి కర్నావతికి గుజరాత్‌ సుల్తాన్‌ బహదూర్‌ షా నుంచి బెడదగా ఉండేది. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె హుమయూన్‌కు రాఖీ పంపిందని, హుమయూన్‌ ఆమెను సోదరిగా అంగీకరించి అభయం ఇచ్చాడనే కథనం ప్రచారంలో ఉంది.

అతి పొడవాటి రాఖీ
దడ పుట్టించే ధరల్లోనే కాదు, సైజులోని భారీతనంలోనూ రాఖీలు రికార్డులకెక్కుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో 2011 ఆగస్టు 2న జి.బాలకృష్ణ అనే యువకుడు ప్రపంచంలోనే అతి పొడవాటి రాఖీని ప్రదర్శించాడు. దీని పొడవు ఏకంగా 666 అడుగులు. వెడల్పు 4 అడుగులు. దీని తయారీకి ఆయన థర్మోకోల్, కాగితాలు, బ్యానర్‌ వస్త్రాలు, వాటర్‌ కలర్స్, గుండుసూదులు వినియోగిచాడు.

అతి పెద్ద రాఖీ
బెంగళూరులోని బ్రహ్మకుమారిలు 2013 ఆగస్టు 17న ప్రపంచంలోనే అతి భారీ అలంకరణ రాఖీని ప్రదర్శించారు. దీని తయారీకి దాదాపు 150 మంది హస్తకళా నిపుణులు నెల్లాళ్లు శ్రమించారు. దీని ఎత్తు 40 అడుగులు, వెడల్పు 400 అడుగులు. ఈ అతి పెద్ద రాఖీ తయారీకి ఉక్కు గజాలు, స్టైరోఫోమ్, పట్టు వస్త్రం, రిబ్బన్లు, లేసులు, వెదురు చాపలు, తాడు, ఇతర అలంకరణ వస్తువులను ఉపయోగించారు.

అతి భారీ రాఖీ
భువనేశ్వర్‌లోని ఉత్కళ్‌ యూనివర్సిటీ విద్యార్థులు బిశ్వకర్మ పండా, యన్నితా ప్రియదర్శిని 2015 ఆగస్టు 29న అతి భారీ రాఖీని ప్రదర్శించారు. ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథస్వామికి అంకితం చేస్తూ రూపొందించిన ఈ రాఖీ పొడవు 500 అడుగులు, వ్యాసం 50 అడుగులు. దీని తయారీకి 300 కిలోల ధాన్యం, 40 కిలోల బియ్యం, రంగులు, ఇతర పదార్థాలు ఉపయోగించారు.

సిక్కు రాజ్యపాలకుడు రాజా రంజిత్‌ సింగ్‌ భార్య మహారాణి జిందన్‌ కౌర్‌ పద్దెనిమిదో శతాబ్దిలో నేపాల్‌ రాజుకు రాఖీ పంపింది. ఆమెను సోదరిగా అంగీకరించిన నేపాల్‌ రాజు ఆ సోదర భావంతోనే బ్రిటిష్‌ సైన్యాలు పంజాబ్‌ను ఆక్రమించుకున్నప్పుడు రాజా రంజిత్‌ సింగ్‌ దంపతులకు తన రాజ్యంలో ఆశ్రయం కల్పించాడు.

బ్రిటిష్‌ పాలకులు 1905లో బెంగాల్‌ను రెండుగా విభజించారు. ఈ విభజన హిందూ ముస్లింలలో వైషమ్యాలకు దారి తీసింది. ఉభయ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి, సోదర భావాన్ని పెంపొందించడానికి రక్షాబంధన్‌ ఒక్కటే తగిన వేడుక అని రవీంద్రనాథ్‌ టాగోర్‌ భావించారు. హిందువులకు ముస్లింలు, ముస్లింలకు హిందువులు రాఖీలు కట్టుకోవడం ద్వారా ఉభయుల మధ్య సౌభ్రాతృత్వం నెలకొంటుందని ఆయన ఆకాంక్షించారు. అప్పట్లో ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన రక్షాబంధన్‌ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లింలు పాల్గొన్నారు.

వివిధ ప్రాంతాల్లో వేడుకలు
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగ రోజున రాఖీలు కట్టుకోవడంతో పాటు, రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనినే వారు ‘ఝులన్‌ పూర్ణిమ’ (ఊయల పున్నమి) అని వ్యవహరిస్తారు. ఒడిశాలో కొన్ని చోట్ల ‘గుమ్మా పున్నమి’గా వ్యవహరిస్తారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, వాటికి రెండువైపులా పొడవైన వెదురుబొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్ది మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టెకొట్టడంలాగానే ఉంటుంది.

మహారాష్ట్రలో ఇదే రోజున ‘నారాలీ పూర్ణిమ’ (కొబ్బరి పున్నమి) వేడుకలు జరుపుకొంటారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు... కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచిపెట్టి, వరుణ దేవుడికి పూజలు జరుపుతారు. జమ్ముకశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరుబయటకు వచ్చి గాలిపటాలను ఎగరేస్తారు. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో ఈ వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. ఎక్కడ ఆకాశం వైపు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి.



నేపాల్‌లో ఇదేరోజున జనై పూర్ణిమగా జరుపుకొంటారు. అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడామగా పిల్లా పెద్దా అందరికీ అక్కడి పూజారులు పవిత్రరక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తికొద్ది కానుకలు సమర్పించుకుంటారు.


అల్లరి.. ఆనందం.. అనుబంధం

అవసరాల్లో, ఆనందంలో.. ఎప్పుడూ చేయి వీడని స్నేహితులారా! మీ కోసం మళ్లీ వచ్చేసింది.. ఓ పుట్టినరోజు! ఒక పండుగ రోజు! ఏ భేద భావం లేని మనసైన మిత్రుల ‘మైత్రీ దినోత్సవం’... ఫ్రెండ్‌షిప్‌ డే!

బాధ ముంచుకొస్తుంది.. కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తుంటాయి. అంతలోనే ఓ ఆత్మీయ స్పర్శ భుజంపై మెల్లిగా తడుతుంది. ప్రేమతో మాట్లాడే ఆ నాలుగు మాటలతో.. బాధ సగం తగ్గిపోతుంది.

లంచ్‌ బెల్‌ మోగుతుంది. చెట్ల కింద అందరూ కూర్చొంటారు. గబగబా లంచ్‌బాక్సులు
తెరుస్తారు. వాళ్లకు దూరంగా ఓ పిల్లోడు బాధపడుతూ, ఒంటరిగా కూర్చొంటాడు. అటుగా చూసినా ఓ ఇద్దరు.. ఆ పిల్లోడిని గుంపులోకి తీసుకొస్తారు. ప్రేమగా గోరుముద్దలు పెడతారు. అంతే ఎక్కడలేని సంతోషం ఆ చిన్నోడి పెదాలపై వచ్చి చేరుతుంది.

జీవితం ఎటు పోతోందో తెలియదు. ‘ఏం చేయాలనుకుంటున్నావు?’ అని నాన్న రోజూ తిడుతుంటాడు. ‘కెరీర్‌ సెట్‌ చేసుకో రా’ అని అమ్మ మెల్లగా మందలిస్తుంది. ఆత్మీయులు ‘నెక్స్ట్‌ ఏంటీ?’ అని అడుగుతుంటారు. సరిగా అప్పుడే ఓ చేయి.. ఆ వ్యక్తిని పట్టుకుని.. ‘ఇదే నీ దారి! ఇదే నీ జీవితం! కష్టపడు, ఇష్టపడు.. సాధించు’ అంటూ దిశానిర్దేశం చేస్తుంది.

జీవితంలో మిత్రులనూ, శత్రువులనూ గుర్తించడం నేర్చుకోవాలి. లేదంటే.. సమస్యల్లో చిక్కుకోవాల్సిందే. కొందరు పైకి గంభీరంగా కనిపించినా అవసరానికి ఆదుకుంటారు. ఇంకొందరు వెన్నంటే ఉంటారు, రాసుకు పూసుకు తిరుగుతారు. కానీ అవసరం వస్తే.. తప్పించుకు తిరుగుతారు. మరికొందరు.. ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి, వారిని విడదీయాలని చూస్తుంటారు. అందుకే ‘స్నేహితులు తమ మధ్య అపార్థాలు రాకుండా చూసుకుంటూనే.. శత్రువుల వల్ల అనర్థాలు కలగకుండా జాగ్రత్త పడాలి’.

‘‘కలసిమెలసి ఉండగలగడం, ఒకరి కోసం ఒకరు పోరాడగలగడం, అవసరమైనపుడు తీరిక లేదనో, అలసిపోయాననో అనకుండా, ఆపదలో ఆదుకోవడం - స్నేహంలో ముఖ్య లక్షణాలు.’’

ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ భార్య నానే అన్నన్‌ 1998లో ‘ఫ్రెండిషిప్‌ డే’గౌరవార్థం ‘విన్నీ ద పూ’ అనే కార్టూన్‌ క్యారెక్టర్‌ని ప్రపంచపు స్నేహదూతగా (ఫ్రెండ్‌షిప్‌ డే అంబాసిడర్‌)గా ప్రకటించారు.

2011లో ఐక్యరాజ్య సమితి జూలై 30వ తేదీని ‘అంతర్జాతీయ మైత్రీ దినోత్సవంగా అధికారకంగా ప్రకటించింది. అయినా, మన దేశంతో పాటు, మరికొన్ని దేశాలు మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్‌ డే’గా జరుపుకొంటున్నాయి.

‘స్నేహితుల దినోత్సవం’ పుట్టింది అమెరికాలో.. 1935లో అయినా.. స్నేహం పుట్టుక మాత్రం మనిషి పుట్టుకంత ప్రాచీనమైంది.

‘స్నేహమంటే పాత పరిచయం కాదు. ఎప్పుడూ వీడని అనుబంధం.’

‘‘నేను మారినపుడు మారిపోతూ, నేను తలూపినపుడు తనూ తలూపుతూ ఉండే స్నేహితుడు నాకు అవసరం లేదు. నా నీడ ఆ పనిని ఇంకా మెరుగ్గా చేస్తుంది’’
- ఫ్లుటార్క్‌, గ్రీకు తత్త్వవేత్త

‘‘నా వెనక నడవకు - నేను నీకు దారి చూపించలేకపోవచ్చు. నా ముందు నడవకు నేను నిన్ను అనుసరించకపోవచ్చు. నా జతగా నడు, నా స్నేహితుడిగా ఉండిపో’’
- ఆల్బర్ట్‌ కేమస్‌, రచయిత, తత్త్వవేత్త

‘‘నీ తప్పును, నీ తెలివితక్కువ పనులను నీ ముందుంచేవాడే నిజమైన స్నేహితుడు.’’
- బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌

‘‘నీవుంటే వేరేకనులెందుకు నీకంటే వేరే బతుకెందుకు నీ బాటలోని అడుగులు నావి నా పాటలోని మాటలు నీవి’’
- సి. నారాయణరెడ్డి


అనుబంధానికి రక్ష

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. తమకు జీవితంలో అన్ని సందర్భాల్లోనూ తోడుండమని కోరుతూ సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టడమే ఈ పండుగ. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణిమ రోజున ఈ పండుగను దేశమంతా ఘనంగా జరుపుకొంటారు. దీన్ని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుపుకొటున్నట్లు మన పురాణాలు చెబుతన్నాయి. రక్షాబంధన్‌ వెనుక ఉన్న పురాణగాథలు, చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం..

శ్రీకృష్ణుడు–ద్రౌపదిల బంధం...
తన సోదరి అయిన ద్రౌపది విషయంలో శ్రీ కృష్ణుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాడో తెలుసుకుంటే మన సంస్కృతిలో అన్నాచెల్లెల్ల మధ్య బంధం ఎంత దృఢమైనదో అర్థమవుతుంది. కృష్ణుడు శిశుపాలుడిని సుదర్శన చక్రం ప్రయోగించి వధించాడు. ఈ సమయంలో కృష్ణుడి చూపుడు వేలుకు గాయమై, రక్తం ధారగా కారుతుంది. దీంతో ద్రౌపది తన చీర అంచు కొద్దిగా చించి, అన్నయ్య కృష్ణుడికి కట్టుకట్టి రక్తం కారడం ఆగిపోయేలా చేస్తుంది. దీంతో సంతోషించిన కృష్ణుడు, తన చెల్లికి ఎల్లవేళలా అండగా ఉంటానని అభయమిస్తాడు. చెప్పినట్లుగానే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీ కృష్ణుడు ఆమెకు చీరలు అందించి అండగా నిలిచాడు.

పురుషోత్తముడి కథ..
జగజ్జేతగా మారాలనే తలంపుతో గ్రీకు రాజు అలెగ్జాండర్‌ అనేక దేశాల మీద దండెత్తుతూ ఉంటాడు. ఈ క్రమంలో క్రీస్తూపూర్వం 326లో మనదేశంపైకి కూడా దండెత్తేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చీనాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపైకి దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే ఈ తరుణంలో అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ యుద్ధం విరమించుకుంటాడు.

కర్నావతి చరిత్ర..
మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తుశకం 1535లో చిత్తోర్‌ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయం పొందిందట. భర్త మరణించడంతో చిత్తోర్‌ రాజ్యపాలన బాధ్యతలు చేపట్టిన రాణి కర్నావతికి, గుజరాత్‌ రాజు అయిన సుల్తాన్‌ బహదూర్‌ షా నుంచి హాని ఉండేది. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె హుమయూన్‌కు రాఖీ పంపిందని, హుమయూన్‌ ఆమెను సోదరిగా అంగీకరించి కర్నావతి రక్షణకు అభయం ఇచ్చాడనే కథనం ప్రచారంలో ఉంది.

పండుగ విశిష్టత..
రాఖీ పండుగ వెనుక చారిత్రక నేపథ్యాలు ఏవైనా ఇది సోదరసోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలనే సందేశాన్ని రాఖీ పండుగ అందిస్తోంది. ఒకప్పుడు ఈ వేడుకను ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా నేర్చుకునేవారు. కానీ ప్రస్తుతం ఇది దేశవ్యాప్తమైంది. ఈ పండుగ రోజున మహిళలు ఎక్కడ ఉన్నా తమ సోదరుల దగ్గరికి వెళ్లి రాఖీ కడుతుంటారు. రాఖీలు కట్టి, తమ సోదరులకు స్వీట్లు తినిపించడం ఆనవాయితీ. సోదరులు కూడా తమ అక్కాచెల్లెళ్లకు మంచి కానుకలు అందజేస్తారు. పండుగ సందర్భంగా మార్కెట్లు రాఖీ విక్రయాలతో కళకళలాడుతుంటాయి. భిన్నమైన రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి.

వేర్వేరు ప్రాంతాల్లో..
పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగ రోజున రాఖీలు కట్టుకోవడంతో పాటు, రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనినే వారు ‘ఝులన్‌ పూర్ణిమ’ (ఊయల పున్నమి) అని వ్యవహరిస్తారు. ఒడిశాలో కొన్ని చోట్ల ‘గుమ్మా పున్నమి’గా వ్యవహరిస్తారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, వాటికి రెండువైపులా పొడవైన వెదురుబొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్ది మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టెకొట్టడంలాగానే ఉంటుంది. మహారాష్ట్రలో ఇదే రోజున ‘నారాలీ పూర్ణిమ’ (కొబ్బరి పున్నమి) వేడుకలు జరుపుకొంటారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు... కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచిపెట్టి, వరుణ దేవుడికి పూజలు జరుపుతారు. జమ్ముకశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరుబయటకు వచ్చి గాలిపటాలను ఎగరేస్తారు. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో ఈ వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. ఎక్కడ ఆకాశం వైపు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. నేపాల్‌లో ఇదేరోజున జనై పూర్ణిమగా జరుపుకొంటారు. అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడామగా పిల్లా పెద్దా అందరికీ అక్కడి పూజారులు పవిత్రరక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తికొద్ది కానుకలు సమర్పించుకుంటారు.
                                                                                            

                        

ప్రపంచాన్ని ఏకం చేసే రాఖీ పండుగ!


కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు... రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అన్న అండని మగవారు అందిస్తారు.
పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చిపడుతోంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్యపురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచీ కృష్ణుని వరకూ ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో...
- భారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో, ఆయన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీరకొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి రక్షగా చుట్టింది.
`నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి, నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో!’ అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు. తరువాతి కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండుసభలో అవమానించాలని అనుకుంటే, దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు.


- ఒకసారి ఇంద్రుని రాజ్యమైన అమరావతిని, బలిచక్రవర్తి సొంతం చేసుకున్నాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి, తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు, బలి మీదకు యుద్ధానికి బయల్దేరాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ... ఇంద్రుని భార్య శచీదేవి, విష్ణుమూర్తిని వేడుకొంది. అంతట విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఆమెకు అందించాడు. శచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడని వేరే చెప్పాలా! తర్వాతకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు, భార్యలు వీరతిలకాన్ని అద్ది, రక్షను కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని అంటారు.
- లోకమంతా రక్షాబంధనాన్ని జరుపుకొంటోంది. కానీ వినాయకుని కుమారులకు రక్షాబంధనాన్ని కట్టేందుకు అక్కాచెల్లెల్లు ఎవరూ లేకపోయారు. దాంతో వారి వేదనను గమనించిన వినాయకుడు, ‘సంతోషిమాత’ అనే దేవతను సృష్టించాడట. ఈ రోజున రాఖీని జరుపుకొనే సోదరీసోదరులను ఆ మాత చల్లగా చూస్తుందని చెబుతారు.


పురాణాలు, ప్రాచీన గ్రంథాలలోనే కాదు.... రాఖీ సంప్రదాయం మన చరిత్రలో అణువణువునా కనిపిస్తుంది. అలగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు, అతడిని పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతం అవుతాడనే భయంతో, అలగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష వేడుకుంటూ రాఖీని పంపిందట. మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్కి రాఖీని పంపిందని చరిత్ర చెబుతోంది. ఇక రవీంద్రనాథ్ టాగూర్ సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు, రక్షాబంధనాన్ని ప్రోత్సహించారట.
శ్రావణపౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు... ఇతరత్రా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ఉన్నవారు, ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞానస్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించిందీ ఈ రోజునే. అంచేత హయగ్రీవ జయంతినీ జరుపుకొంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో ఝూలన్ పౌర్ణమి పేరుతో, ఈ రోజున రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊరేగిస్తారు. మరి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో ‘కజరి పౌర్ణమి’ పేరుతో గోధుమ నాట్లు వేస్తారు. ఇక సముద్రతీరంలో ఉండేవారు ‘నరాళీ పౌర్ణమి’ పేరుతో సముద్రదేవునికి కొబ్బరికాయలను సమర్పిస్తారు.


శ్రావణ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నా, రక్షాబంధనానికే తొలి ప్రధాన్యత. రాష్ట్రం ఏదైనా, లోకంలో ఎక్కడున్నా.... ఆఖరికి భగవంతుని నమ్మినా నమ్మకున్నా, రాఖీ పండుగ చేసుకుంటే బాగుండు అనుకోని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో! రాఖీ రోజు ఆడామగా అంతా ఉదయాన్నే లేచి తలార స్నానం చేస్తారు. ఆపై సోదరికి ఎదురుగా కూర్చుని రాఖీ కట్టించుకుంటారు. ఈ రాఖీని కట్టేటప్పుడు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||` అన్న మంత్రాన్ని చదివితే మంచిదని చెబుతారు. రాఖీ కట్టిన తర్వాత తన సోదరుని సకల విజయాలూ కలగాలని ఆశిస్తూ, అతనికి హారతి ఇచ్చి, నుదుట తిలకాన్ని దిద్ది, తీపిని తినిపిస్తారు. ఇందుకు బదులుగా సోదరులు మనస్ఫూర్తిగా బహుమతులను అందిస్తారు.







No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list