MohanPublications Print Books Online store clik Here Devullu.com

పరిణామం చిన్నది... పని పెద్దది!- Mustard, Photonyutriyent, ఆవాలు, ఫోటోన్యూట్రియెంట్‌

నిశ్చలత్వమే యోగం
ఆత్మీయం
ఈ భౌతిక ప్రపంచంలో మంచి జరిగినా, చెడు జరిగినా తాము దాన్ని ప్రశంసించకుండా, విమర్శించకుండా ఎవరైతే ఉంటారో, ఎటువంటి భావాన్నీ వెలిబుచ్చక కలత చెందక నిశ్చలంగా ఉంటారో అటువంటి వారినే యోగులంటారు. నిలకడగల జ్ఞాని లేదా యోగి తాబేలు వంటివాడు. ఏదైనా అవసరం కలిగినప్పుడు తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకునే సౌకర్యం ఏవిధంగా కలిగి ఉంటుందో, అదేవిధంగా తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడే సమగ్రమైన జ్ఞాని, యోగి.
సమదర్శనులు రమణమహర్షి వలె జనన మరణ స్థితులను జయించిన వారై ఉంటారు. అటువంటి సమదర్శనులయిన జ్ఞానుల చేత ఈ దేహం, సంసార బంధాలలో తగులుకోక జనన మరణ చక్రాన్ని జయించబడింది. అటువంటి వారు బ్రహ్మమువలె దోషం లేని వారయినందువల్ల బ్రహ్మములోనే ఉన్నవారు కాగలరు. అంటే అన్నింటిలోనూ సమదృష్టి గల మనస్సు, ఆత్మ సాక్షాత్కారం గల వారి çహృదయానికి ప్రతీకయే గాక సాక్షాత్తూ దేవుని వలె రాగద్వేషాలకు అతీతులం కాగలం. దోషరహితులమై ఆధ్యాత్మికానందాన్ని అనుభవించగలం.

పరిణామం చిన్నది... పని పెద్దది!
ఆవగింజ
గుడ్‌ఫుడ్‌
పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే వాటిని ఆవాలతో పోలుస్తూ ఆవగింజంత అంటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత. ఆవాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ఆవాల్లో ఉండే ఫోటోన్యూట్రియెంట్‌ గుణాలు, పీచుపదార్థాల కారణంగా అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది. ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్‌ ఎక్కువ. వాటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి.ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాలలో విటమిన్‌ బీ–కాంప్లెక్స్‌ ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి సమకూరడమే కాకుండా, జీవక్రియలు సమర్థంగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్, ల్యూటిన్‌ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలను తగ్గించి దీర్ఘకాలం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి. ఆవాల్లోని నియాసిన్‌ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్‌ పాళ్లు తగ్గుతాయి. రక్తనాళాల్లో పాచిలాగ పేరుకునే అథెరోస్కి›్లరోసిస్‌ వంటి కండిషన్లను ఆవాలు నివారిస్తాయి. ఆవాల్లోని విటమిన్‌–ఏ, ఐరన్, ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టు దట్టంగా పెరగడానికి తోడ్పడతాయి. ఆవాలు రక్తపోటును సమర్థంగా తగ్గిస్తాయి.

ధ్యానం... అంతరయానం!
ఆత్మీయం
అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే... అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆ మూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైన మార్గం. ధ్యానానికి , యోగానికి సాక్షాత్తూ ఆ పరమశివుడే ఆదిపురుషుడు.
ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం (తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. ఆ మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికే ధ్యానం చేయడం అవసరం. ధ్యానం అంటే నిర్మలమైన, నిశ్చలమైన నీలోకి నీవు చేసే ప్రయాణం.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list