MohanPublications Print Books Online store clik Here Devullu.com

అతివలకు భరోసా-Athivalaku Barosa

అతివలకు భరోసా!
‘అమ్మాయి ఆఫీసు నుంచి బయలుదేరిందో లేదో... ఇంటికి రావడానికి ఇంకెంత టైమ్‌ పడుతుందో?‘ఇంటికి వెళ్లగానే చెప్పమన్నాను... ఇంకా ఫోన్‌ చేయలేదేంటి?ఇంటి నుంచి బయటికెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి చేరుకునేంతవరకు కుటుంబ సభ్యుల ఆలోచన తీరిది. ఇలాంటి సందర్భాల్లో అటు తల్లిదండ్రులకు, ఇటు అమ్మాయిలకు భరోసాగా నిలిచే ఆప్స్‌ ఉన్నాయని తెలుసా? వీటి ద్వారా అత్యవసర సమయాల్లో అతివలు తమ స్నేహితులు, బంధువుల్ని అలర్ట్‌ చేయొచ్చు. వాటి వివరాలే ఇవి. 
ఇది తప్పనిసరి 
ఈ ఆప్స్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని మీ ప్రాథమిక వివరాలు.. అంటే మొబైల్‌ నెంబరు, మెయిల్‌ ఐడీ, చిరునామా నమోదు చేయాలి. దీంతోపాటు మీరు అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్‌ పంపాలనుకునే వాళ్ల మొబైల్‌ నెంబరు, మెయిల్‌ ఐడీ పొందుపరచాలి. ఆపద సమయంలో మీ ఫొటో తీయడానికి మొబైల్‌కు పర్మిషన్‌ కూడా ఇవ్వాలి. ఆండ్రాయిడ్‌ మార్స్‌మాలో, ఆపై వెర్షన్ల ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తున్న మొబైల్స్‌ అన్నింటికి ఈ పర్మిషన్‌ ప్రక్రియ తప్పనిసరి.
చేరుకున్నాక చెప్పేస్తుంది
‘ఇంటికి చేరుకున్నాక... కాల్‌ చేయ్‌’ ఏదైనా పార్టీ, వేడుక నుంచి మీరొక్కరే ఇంటికి వెళ్తుంటే మీ స్నేహితులు చెప్పే మాట ఇది. ఒకరిద్దరికైతే కాల్‌ చేసి చెప్తారు. మీకేమో పదుల సంఖ్యలో మిత్రులున్నారు. వారందరికీ మీ క్షేమ సమాచారం చెప్పాలంటే మీ మొబైల్‌లో bSafe - Personal Safety App ఉండాల్సిందే. ఈ ఆప్‌లో మీ స్నేహితులు, బంధువుల కాంటాక్ట్స్‌ని గార్డియన్స్‌గా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు నిర్ణీత ప్రాంతానికి (ఇల్లు, రూమ్‌, ఆఫీస్‌ లాంటివి) చేరుకున్నాక ఆటోమేటిక్‌గా మీ గార్డియన్స్‌కు మీ సమాచారం అందిపోతుంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఎవరైనా గార్డియన్స్‌ ఉన్నారా అనేది కూడా ఈ ఆప్‌ ద్వారా మ్యాప్‌ రూపంలో తెలుసుకోవచ్చు. 
* https:///goo.gl/Jx9z6B
ఆటోమేటిక్‌గా ఆన్‌...
మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకో కాల్‌ వస్తుంది. దాన్ని అటెండ్‌ చేస్తే మీ ఇబ్బందిని చెప్పుకోవచ్చు. అయితే కాల్‌ లిఫ్ట్‌ చేసే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు మీ కాల్‌ ఆటోమేటిక్‌గా ఆన్‌ అయితే సేఫ్‌ కదా. Rescuer Ð A Women Safety App ఆప్‌తో ఇది జరుగుతుంది. మీ మొబైల్‌ పవర్‌ బటన్‌ను వరుసగా ఐదు సార్లు క్లిక్‌ చేస్తే ఆప్‌ యాక్టివేట్‌ అయిపోతుంది. ఆ తర్వాత దానికి ఏ కాల్‌ వచ్చినా ఆటోమేటిక్‌ కాల్‌ ఆన్సర్‌ అయిపోతుంది. అప్పుడు మీ మాటలు అవతలి వ్యక్తికి వినిపిస్తాయి. 
* https:///goo.gl/m2242z
గొంతును పసిగడుతుంది
మీరు ఇబ్బందుల్లో ఉన్నారు... బ్యాగులో ఫోన్‌ ఉంది.. కానీ అది దూరంగా ఉంది. మరి మీ పరిస్థితిని మీ స్నేహితులకు చెప్పడం కష్టమే. Chilla : Anti Rape women app ఆప్‌తో ఇది పెద్ద విషయం కాదు. మీ గొంతును గుర్తించి ఈ ఆప్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఆ వెంటనే మీరున్న ప్రాంతం, మీ మాటల వాయిస్‌ రికార్డు మీ స్నేహితులకు పంపించేస్తుంది. లేదంటే పవర్‌ బటన్‌ వరుసగా ఐదు సార్లు క్లిక్‌ చేయడం ద్వారా కూడా ఈ ఆప్‌ను యాక్టివేట్‌ చేయొచ్చు. 
* https:///goo.gl/1JvKfH
స్క్రీన్‌ మీద టచ్‌ చేస్తే...
మీ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ మీద టచ్‌ చేస్తే... మీరు ఎక్కడున్నారనేది మీ కుటుంబ సభ్యులకు తెలిస్తే బాగుంటుంది కదా? ప్రమాదవశాత్తు మీరు గుర్తు తెలియని ప్రాంతంలో చిక్కుకుంటే ఈ ఆప్షన్‌ ఉపయుక్తంగా ఉంటుంది. Feel Safe ఆప్‌తో ఈ పని చేయొచ్చు. మీకెప్పుడైనా ఇబ్బందులు ఎదురైతే ఆప్‌ను ఓపెన్‌ చేసి స్క్రీన్‌ మీద టచ్‌ చేయాలి. వెంటనే మీరు ముందుగా నమోదు చేసిన మొబైల్‌ నెంబరు, మెయిల్‌ ఐడీకి సందేశం వెళ్లిపోతుంది. అందులో మీరున్న ప్రాంతం, దాని అక్షాంశ, రేఖాంశాల వివరాలు (మ్యాప్‌లోని ప్రాంతం తెలిపే వివరాలు) ఉంటాయి. దాంతో మీరెక్కడున్నారనేది సులభంగా తెలుసుకోవచ్చు. 
* https:///goo.gl/f5Bgvk
మూడు రకాలుగా...
‘నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను’, ‘నేను ఇక్కడ ఉన్నాను... ఎందుకైనా మంచిదని నీకు చెబుతున్నాను’, ‘ఇక్కడ నేను ఇబ్బందుల్లో ఉన్నాను. నన్ను రక్షించండి’... మహిళలు తమ క్షేమ సమాచారాన్ని దగ్గరవాళ్లకు అందించడంలో ఇలా కొన్ని రకాలుంటాయి. అలా రకరకాల అవసరాలకు పనికొచ్చే ఆప్‌ Women Safety. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే మీకు ఎరుపు, ఆకుపచ్చ, నారింజ రంగులో మూడు డబ్బాలు కనిపిస్తాయి. ఎరుపు రంగు వృత్తం ‘పానిక్‌ అలెర్ట్‌’. దీన్ని టచ్‌ చేస్తే... 30 సెకన్లపాటు సైరన్‌ శబ్దం వినిపిస్తుంది. దీని వల్ల మీరు ఇబ్బందిలో ఉన్నట్లు మీ చుటుపక్కల వాళ్లకు తెలుస్తుంది. దీంతోపాటు మీరు నమోదు చేసుకున్న మీ స్నేహితులకు మెసేజ్‌, మెయిల్‌ ద్వారా సందేశం వెళ్తుంది. అదే ఆకుపచ్చ రంగు వృత్తం క్లిక్‌ చేస్తే మీరున్న ప్రాంతం, అక్కడి ఫొటో వివరాలు సందేశం రూపంలో వెళ్తాయి. నారింజ రంగు బాక్స్‌ క్లిక్‌ చేస్తే కేవలం ప్రదేశం వివరాలు వెళ్తాయి. 
* https:///goo.gl/Q922Ft
దారి మారితే... చెప్పేస్తుంది
ఆఫీసు నుంచి క్యాబ్‌లో ఇంటికొస్తున్నప్పుడు దారిలో కునుకు పట్టేసింది. మధ్యలో కళ్లు తెరిచి చూస్తే ఏదో తెలియని ప్రదేశం. ఉద్యోగినులకు ఇలాంటి అనుభవాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అయితే redEye Women Safety ఆప్‌లో మీరు ఇంటికి వెళ్లాల్సిన దారిని సెట్‌ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా ఏర్పాటు చేసుకున్న దారిలో కాకుండా మీ వాహనం దిశ మారితే ఈ ఆప్‌ ఆ విషయాన్ని మీ స్నేహితులు/బంధువులకు తెలియజేస్తుంది. వెంటనే మీకు కూడా సందేశం వస్తుంది. దీంతోపాటు మీ మొబైల్‌ను స్విచ్ఛాఫ్‌ చేయకుండా ఈ ఆప్‌ అడ్డుకుంటుంది. 
* https:///goo.gl/N8BVao
ఎక్కడున్నారో చెబితే
‘ఇంటికి బయలుదేరా అని చెప్పి చాలా టైమ్‌ అయ్యింది... ఇంకా రాలేదేంటి’ ఇంట్లో అమ్మానాన్న నుంచి ఇలాంటి ప్రశ్న తరచుగా వస్తుంటుంది. అలాంటప్పుడు మీరు ఎక్కడున్నారనే విషయం వాళ్లకు ఆటోమేటిక్‌గా తెలిస్తే ఇబ్బంది ఉండదు కదా. అప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో మీ కదలికల్ని అవతలి వ్యక్తి తెలుసుకోవచ్చు. Google Trusted Contact ఆప్‌తో ఈ పని చేయొచ్చు. ఇందులో తొలుత ట్రస్ట్‌డ్‌ కాంటాక్ట్స్‌ను ఎంచుకోవాలి. మీరెప్పుడైనా ఇబ్బందుల్లో పడితే షేర్‌ బటన్‌ క్లిక్‌ చేయగానే ఆ కాంటాక్ట్స్‌కు మీ లొకేషన్‌ వివరాలు షేర్‌ అవుతాయి. మళ్లీ మీరు దాన్ని ఆఫ్‌ చేస్తేనే ఆగుతుంది. దీంతోపాటు ఈ ఆప్‌ ద్వారా మీ లొకేషన్‌ వివరాలు కావాలి అని ఇతరులకు రిక్వెస్ట్‌ కూడా పెట్టొచ్చు. 
* https:///goo.gl/wpPbq3
15 నిమిషాలకొకసారి
ఆఫీసు నుంచి ఇంటికొస్తున్నప్పుడు వంట్లో ఏదో నలతగా అనిపించింది. దగ్గరలో ఏమైనా ఆసుపత్రులున్నాయా అని చూశారు, కానీ ఏమీ తెలియలేదు. దీని కోసం ఓ ఆప్‌ అందుబాటులో ఉంది. V-Safe ఆప్‌తో మీ పరిసరాల్లో ఉన్న ఆసుపత్రులు, పోలీస్‌ స్టేషన్ల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు మీరు ప్రయాణిస్తున్న దారిని ప్రతి 15 నిమిషాలకొకసారి స్నేహితులతో షేర్‌ చేసుకోవచ్చు. ఇంటికి ఎంత టైమ్‌లో చేరుకుంటారు అనేది చూచాయగా చెప్పేయొచ్చు. మొబైల్‌ పవర్‌ బటన్‌ను వరుసగా మూడు సార్లు నొక్కితే సైరన్‌ మోగుతుంది. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. 
* https:///goo.gl/PsgM1g


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list