MohanPublications Print Books Online store clik Here Devullu.com

నామకరణం_Namakaranam


నామకరణము
"
"ఆయుర్వర్చోభివృద్ధిశ్చ సిద్ధిర్వ్యపహృ తేస్తధా|
నామ కర్మఫలం త్వేతత్‌ సముద్దిష్టం మనీషిభిః''

అను రీతిని, ఆయుస్సు, వర్చస్సు, వ్యవహారసిద్ధి, గలుటకై ఈ నామకరణ సంస్కారము జరుపదగినదని పెద్దల నిర్ణయము.

""జననాత్‌ దశరాత్రే సంపత్స రేవా నామకరణం, అహన్య కాదశీ

నామకరణం|"అనురీతిని పదునొకండవరోజు నామకరణము జేయదగినది వసతిలేనిచో సంవత్సరంలోపుగ వసతి ననుసరించియు చేయదగును.

ఆడబిడ్డకు నామకరణం చేయునెడల ""ఈకారాన్తం స్త్రీణాం ఏవం కృతే నామ్నశుచి తత్కులంభవతి'' అనురీతిని ఈ కారాన్తముగ పేరుండులాగున నామకరణ మొనర్చినచో వంశమన్తయు పరిశుద్ధి యగునందురు.

""కుమారస్యాయుష్యాభివృద్ధ్యర్థం. సభాసకల సత్పురుషమథ్యే నామప్రకటన సిధ్యర్థం మాసనామ్నా నక్షత్రనామ్నా వ్యావహారికనామ్నా చసగ్గ్‌స్కరిష్యావహే'' యని సంకల్పము ఈరీతిని, ఆయుర్వృద్ధి కొరకును. సభలలో, పెద్దల సమక్షమున వ్యవహరించుటకును మాసనామము. నక్షత్రనామము, వ్యవహారనామములతో నామకరణము జరుపబడును.

చైత్రమాసమున జన్మించినచో కృష్ణుడు. వైశాఖమాసమున అనంతుడు, జ్యేష్ఠమాసమున అచ్యుతుడు. ఆషాఢమున చక్రీ శ్రావణమున వైకుంఠుడు, భాద్రపదమున జనార్దనుడు. ఇశ్వయుజమున ఉపేంద్రుడు, కార్తికమున యజ్ఞపురుషుడు, మార్గశీర్షమున వాసుదేవుడు, పుష్యమాసమున హరి, మాఘమాసమున గోవిందుడు, ఫాల్గునమున పుండరీకుడు అని మాస నామములు తొలుత పెట్టుకొనవలయును.

స్త్రీయైనచో చైత్రమాసమున జన్మించినవారికి భూదేవి, వైశాఖమున కల్యాణి జ్యెష్ఠమున సత్వభామా, ఆషాఢమాసమున పుణ్యవతీ, శ్రావణమాసమున రూపిణీ, భాద్రపదమున ఇందుమతీ, ఆశ్వయుజమున చంద్రావతీ, కార్తికమున లక్షీ్మ, మార్గశీర్షమున వాగ్దేవీ, పుష్యమాసమున పద్మావతీ, మాఘమున శ్రీదేవి, ఫాల్గున సావిత్రీ యని మాసనామములు తొలుత పెట్టుకొన దగియున్నది.

నక్షత్ర నామము పెట్టుకొనిన తదుపరి,

""ఆయుజాక్షరం కుమార్యాః, అవిషమాక్షరం కుమారస్య
ఆద్యన్తయోః శ్రీకారం లిఖిత్వా| వ్యవహారనామసమక్షరం
పుంసః అసమాక్షరం స్తియ్రః| అను ధర్మము ప్రకారము నామమునకు ఆద్యన్తములలో శ్రీకారము తోలుత వ్రాసి, అనంతరము సమవర్ణములుగల పేరు పురుషులకును, అసమాక్షరముగల పేరు స్త్రీలకును పెట్టుట శ్రేయస్కరము,

""కులదేవతా నక్షత్రసంబంధం పితా నామకుర్యాత్‌''

అనురీతిని. కులదేవత పేరుగాని, నక్షత్ర సంబంధమైన పేరుగాని తండ్రి పెట్టుకొనుట యుత్తమము.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list