MohanPublications Print Books Online store clik Here Devullu.com

గరం గరం కబాబ్స్‌-Garam Garam Kababs


గరం గరం కబాబ్స్‌

చల్లబడిన వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే పకోడీ, బజ్జీల్లాంటివి కాకుండా ఈసారి కమ్మని కబాబ్స్‌ ట్రై చేయండి. చికెన్‌, మటన్‌లతో తేలికగా తయారుచేయగలిగే కబాబ్స్‌ వండేసి కొత్త రుచుల్ని ఆస్వాదించండి. ఈ రంజాన్‌ మాసంలో ‘ఇఫ్తార్‌’ కి ఇదో స్పెషల్‌.
మటన్‌ షష్లిక్‌ కబాబ్‌
(తయారీ సమయం - 45 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్‌ మటన్‌ - 500 గ్రా
వెల్లుల్లి పేస్ట్‌ - 1 టే.స్పూను
అల్లం పేస్ట్‌ - 1 టే.స్పూను
పెరుగు - 1 కప్పు
పచ్చి బొప్పాయి కోరు - 2 టే.స్పూన్లు
కారం - తగినంత
గరం మసాలా - 1 టీస్పూను
ధనియాల పొడి - 1 టే.స్పూను
ఉప్పు - 1 టీస్పూను
కాప్సికమ్‌ - 2
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 4
నూనె, చాట్‌ మసాలా - కొద్దిగా

తయారీ విధానం:
మటన్‌ ముక్కలను ఫోర్క్‌తో గుచ్చి అల్లం, వెల్లుల్లి, పెరుగు, బొప్పాయి గుజ్జు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు చేర్చి రాత్రంతా నానబెట్టి ఉంచాలి.
కాప్సికమ్‌, ఉల్లిపాయలు, టమాటాలు కట్‌ చేసుకుని ఉంచుకోవాలి.
టమాటా, ఉల్లిపాయ ముక్క, కాప్సికమ్‌....వరుసలో స్కీవర్‌కు గుచ్చుకుని తర్వాత మటన్‌ ముక్క గుచ్చాలి. ఇలా వరసగా గుచ్చుకుంటూ అన్నిటినీ తయారు చేసి పెట్టుకోవాలి.
వీటి మీద బ్రష్‌తో నూనె, చాట్‌ మసాలా పూయాలి.
గ్రిల్‌ మీద మటన్‌ ముక్కల అంచులు గోధుమ రంగుకు కాలేవరకూ కాల్చుకోవాలి.
మళ్లీ బ్రష్‌తో నూనె పూసి మరో రెండు నిమిషాలు కాల్చి వేడిగా సర్వ్‌ చేయాలి.
చికెన్‌ షామి కబాబ్‌

(తయారీ సమయం - 1 గంట)
కావలసిన పదార్థాలు:
శనగపప్పు - 1 కప్పు
చికెన్‌ తొడ ముక్కలు(బోన్‌లెస్‌) - అర కిలో
ఉప్పు - తగినంత
కారం - 1 టే.స్పూను
గుడ్లు - 6
ఎండుమిర్చి - 7
జీలకర్ర - 2 టీస్పూన్లు
ధనియాలు - 2 టీస్పూన్లు
లవంగాలు - 7
మిరియాలు - 10
దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
కొత్తిమీర - 1 కట్ట
పుదీనా - అర కట్ట
పచ్చిమిరిపకాయలు - 6
వెల్లుల్లి - 10
అల్లం తరుగు - 1 టే.స్పూను
నూనె - వేపుడుకు సరిపడా
తయారీ విధానం: 
శనగపప్పు, చికెన్‌ ముక్కలు, మసాలాలు అన్నీ కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
చికెన్‌ మెత్తగా ఉడికాక వడగట్టి పక్కనుంచాలి.
చికెన్‌కు గుడ్లు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు చేర్చి బాగా కలపాలి.
మెత్తగా మెదిపి ముద్దలా తయారుచేయాలి.
ఈ ముద్దను ఉండలుగా చేసుకుని మిగతా గుడ్ల మిశ్రమంలో ముంచి నూనె పోస్లూ రెండు వైపులా కాల్చుకోవాలి.
పుదీనా, చింతపండు చట్నీతో వేడిగా వడ్డించాలి.
చికెన్‌ మలాయి కబాబ్‌
(తయారీ సమయం - 1 గంట)
కావలసిన పదార్థాలు:
చిన్న చికెన్‌ ముక్కలు - 14
పుల్లని పెరుగు - 1 కప్పు
అల్లం పేస్ట్‌ - 1 టీస్పూను
వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీస్పూను
జాజికాయ పొడి - చిటికెడు
యాలకుల పొడి - 1 టీస్పూను
మిరియాల పొడి - అర టీస్పూను
నిమ్మరసం - 1 టే.స్పూన్లు
క్రీమ్‌ చీజ్‌ - 1 కప్పు
మోజరెల్లా చీజ్‌ - 2 టే.స్పూన్లు
కార్న్‌ఫ్లోర్‌ - 1 టే.స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ విధానం:
ఓవెన్‌ను 180 డిగ్రీలకు ప్రిహీట్‌ చేసుకుని గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి ఓవెన్‌లో ఉంచాలి. ఓవెన్‌కు బదులుగా చికెన్‌ ముక్కలకు నీరు చేర్చి పొయ్యి మీద కూడా మెత్తగా ఉడికించొచ్చు.
ఓ గిన్నెలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, జాజి కాయ పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, క్రీమ్‌ చీజ్‌, మోజరెల్లా చీజ్‌, కార్న్‌ఫ్లోర్‌ వేసి బాగా కలపాలి.
దీనికి చికెన్‌ ముక్కలు వేసి బాగా కలపాలి.
పుల్లని పెరుగు చేర్చి ఒక గంటపాటు చికెన్‌ నానబెట్టాలి.
తర్వాత చికెన్‌ ముక్కల్ని స్కీవర్‌కు గుచ్చి బేకింగ్‌ ట్రే మీద వరుసగా ఉంచాలి.
ఈ ముక్కల మీద మిగిలిన పెరుగు మిశ్రమం, నూనె పూయాలి.
ఈ ట్రేను ప్రీహీటెడ్‌ ఓవెన్‌లో 20 నిమిషాలపాటు బంగారు రంగులో కాలేవరకూ ఉంచి తీయాలి.
ఓవెన్‌కు బదులుగా నిప్పుల కుంపటి మీద అమర్చిన గ్రిల్‌ మీద కూడా చికెన్‌ ముక్కల్ని కాల్చుకోవచ్చు.
అన్ని వైపులా ముక్కలు కాలిన తర్వాత కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేయాలి.
కగ్జీ కబాబ్‌
(తయారీ సమయం - 1 గంట)
కావలసిన పదార్థాలు:
అల్లం పేస్ట్‌ - 2 టే.స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్‌ - 2 టే.స్పూన్లు
కారం - 2 టే.స్పూన్లు
పెరుగు - 2 కప్పులు
డబుల్‌ క్రీమ్‌ - 1 కప్పు
నిమ్మరసం - పావు కప్పు
చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ - 10
నూనె - 3 టే.స్పూన్లు
నెయ్యి - 2 టేస్పూన్లు
కందిపప్పు - 2 కప్పులు
గరం మసాలా - 100 గ్రా (జీలకర్ర, లవంగాలు, జాజికాయ, జాపత్రి, స్టార్‌ అనిస్‌, సోంపు, యాలకులు)
గుడ్లు - 2
ఎర్రని ఫుడ్‌ కలర్‌ - 1 టీస్పూను
ఎల్లో ఫుడ్‌ కలర్‌ - 1 టీస్పూను
నువ్వులు - 2 టే.స్పూన్లు
పుదీనా - 1 కట్ట
పచ్చిమిర్చి - 10
బంగాళాదుంపలు - 1 కిలో
ఉల్లి కాడలు - 4
అప్పడాలు - 4
ఉల్లిపాయలు - 100 గ్రా
చికెన్‌ కీమా - అర కిలో
తయారీ విధానం:
కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.
చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ శుభ్రం చేసి మధ్యలో ఖాళీ ఏర్పరుచుకోవాలి.
వీటిని గరం మసాలా దినుసులు, రెండు గుడ్లు, పచ్చిమిర్చితో కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి.
పాన్‌లో నూనె పోసి కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి.
దీనికి చికెన్‌ కీమా, కందిపప్పు ముద్ద, చేర్చి తాలింపు వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చికెన్‌ డ్రమ్‌స్టిక్‌లో ముందుగా చేసి పెట్టుకున్న ఖాళీల్లో నింపాలి.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, పెరుగు, క్రీమ్‌, నిమ్మరసంలతో టిక్కా మారినేషన్‌ తయారు చేసుకుని దీన్లో డ్రమ్‌స్టిక్స్‌ నానబెట్టాలి.
అర గంట తర్వాత స్వీవర్‌తో గుచ్చి గ్రిల్‌ మీద ఎర్రగా కాల్చుకోవాలి.
పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, నువ్వులతో చట్నీ చేసి పక్కన పెట్టుకోవాలి.
బంగాళాదుంపలు ఉడికించి ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి.
ఒక ప్లేట్‌లో బంగాళాదుంప ముద్ద వేసి మధ్యలో ఖాళీ ఉండేలా పరిచి ఆ ప్రదేశంలో ఉడికించిన పప్పు, నెయ్యి వేయాలి.
దాని మీద రెండు, మూడు చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ ఉంచి పక్కన చట్నీ వేయాలి.
అప్పడాలు చిదిమి చల్లి సర్వ్‌ చేయాలి.
హలీమ్‌ కబాబ్‌
(తయారీ సమయం - 2 గంటలు)
కావలసిన పదార్థాలు:
గోధుమ రవ్వ - అర కప్పు
మినప్పప్పు - అర కప్పు
కందిపప్పు - అర కప్పు
పెసర పప్పు - అర కప్పు
మటన్‌ చాప్స్‌ - కిలో
తరిగిన వెల్లుల్లి - 10
అల్లం తరుగు - 2 టీస్పూన్లు
నెయ్యి - 2 టే.స్పూన్లు
ధనియాల పొడి - 1 టే.స్పూను
జీలకర్ర పొడి - 1 టే.స్పూను
చాట్‌ మసాలా - 1 టే.స్పూను
కారం - 1 టే.స్పూను
కుంకుమ పువ్వు - పావు టీస్పూను
పసుపు - 1 టే.స్పూను
కొత్తిమీర తరుగు - 1 కప్పు
పుదీనా తరుగు - 1 కప్పు
పచ్చిమిర్చి - 4
శనగపప్పు - 1 కప్పు
తయారీ విధానం:
శనగపప్పు తప్ప అన్ని పప్పులు శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.
ఉదయం మళ్లీ కడిగి వెడల్పాటి గిన్నెలో వేసుకుని దాన్లో మటన్‌ చాప్స్‌, వెల్లుల్లి, అల్లం, ఒకటిన్నర లీటర్ల నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాలి.
నీరు తెర్లాక మంట తగ్గించి మటన్‌ మెత్తగా తయారయ్యేవరకూ ఉడికించాలి.
తర్వాత గరిటెతో మటన్‌ చాప్స్‌ వేరే ప్లేట్‌లోకి తీసి చల్లారాక ఎముకలు తీసేయాలి.
శనగపప్పుని నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఈ మాంసాన్ని మెత్తగా మెదిపి శనగపప్పుతో కలిపి పక్కనుంచాలి.
బాండీలో నూనె పోసి గరం మసాలా దినుసులు, కుంకుమ పువ్వు వేసి సువాసన వచ్చేదాకా వేయించాలి.
తర్వాత దీనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని, మటన్‌ను చేర్చి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి.
10 నిమిషాలకు మిశ్రమం చిక్కబడిన తర్వాత మెత్తని పేస్ట్‌లా మెదిపి చేతికి నూనె రాసుకుని 50 గ్రాముల ఉండలుగా చుట్టాలి.
ఈ ఉండలను చదునుగా చేసి పెనం మీద రెండు వైపులా కాల్చుకుని వేడిగా సర్వ్‌ చేయాలి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list