MohanPublications Print Books Online store clik Here Devullu.com

సుబ్రహ్మణ్యేశ్వరుడుని ఎలా పూజిస్తే సంతానం కలుగుతుంది..!! ఎప్పుడు పూజించాలి?_SubramanyaSwamy


సుబ్రహ్మణ్యేశ్వరుడుని ఎలా పూజిస్తే సంతానం కలుగుతుంది..!!
ఎప్పుడు పూజించాలి?
      సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు.
ఆదిదంపతుల పుత్రుడిగా కుమారస్వామి సర్పరూపంలో అవతరించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. సర్పరూపంలో ఆవిర్భవించిన కారణంగానే, సుబ్రహ్మణ్యస్వామిగా పూజలు అందుకుంటున్నాడని అంటారు. అందువల్లనే ఆయన కుమారస్వామిగా విగ్రహరూపంలోనే కాకుండా, లింగ రూపంలోను ... సర్ప రూపంలోను పూజాభిషేకాలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక స్వామి సుబ్రహ్మణ్యుడుగా ఆవిర్భవించిన క్షేత్రాలకు మహిళా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఈ రూపంలో స్వామివారు సంతానం లేనివారికి సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉండటమే అందుకు కారణం. సుబ్రహ్మణ్యస్వామి నుండి సంతాన భాగ్యం పొందాలంటే ఏం చేయాలి..?ఎలా ఆయన అనుగ్రహం పొందాలో తెలుసుకుందాం....
తారకాసురుడు మరణానికై ఉద్భవించిన దివ్య తేజోమయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన జన్మించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి గా వ్యవహరిస్తారు.
బ్రహ్మ నుండి 'శివసుతుని చేత ' మాత్రమే మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు,తారకాసురుడు మరణానికై ఉద్భవించిన దివ్య తేజోమయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన జన్మించిన రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి గా వ్యవహరిస్తారు.
తారకాసుర సంహార నేపథ్యం
తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిదే. మహా బలిష్టుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలచు కోవటం కన్పిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి అనగానే నెమలి వాహనం సుబ్రహ్మణ్యస్వామి అనగానే నెమలి వాహనంతో శక్తి ఆయుధాన్నిధరించి, మెడ మీదుగా భుజాలపై నుంచి వేలాడే పూలమాలతో దర్శనమిచ్చే ధర్మ స్వరూపం గుర్తుకు వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగానే కాదు పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగానే కాదు, అసురుల గుండెల్లో గుబులు పుట్టించిన వీరుడిగా కూడా ఆయనకి పేరుంది. ఈయనకు ఆరు ముఖాలు ఉంటాయి. ఈయనకు ఆరు ముఖాలు ఉంటాయి. ఆరువైపులా చూస్తూ పరిస్థితులను సమన్వయం చేసుకోగలడు. సుబ్రహ్మణ్యునికి కుమారస్వామి, మురుగన్, షణ్ముఖుడు, కార్తికేయ, స్కంద - అంటూ అనేక పేర్లు ఉన్నాయి.
స్వామిని పంచామృతాలతో అభిషేకించి, వివిధ పుష్పాలతో అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచారలతో పూజించి, ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
సంతానం
ఈ విధంగా స్వామిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందనీ ... అనారోగ్యాలు తొలగిపోతాయని ... విజయాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అనేక దోషాలు నశించి పోతాయనీ, పాపాలు పరిహరించబడతాయని స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఆ స్వామిని శక్తి కొద్దీ పూజించాలి ... భక్తి కొద్దీ సేవించాలి.

షష్టి ప్రత్యేకత
షష్టి రోజున ఉదయానే స్నానం చేసి (వీలైతే నదీ స్నానం) సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, దానధర్మాలు చేసినట్లయితే తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి.
సర్పదోషాలు 
సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రార్ధనలు చేసి పుట్టలో పాలు పోస్తారు. ఐదు ముఖాలున్న నాగదేవతను ఆరాధిస్తారు.
నాగదేవతల్లో ఒకటైన శంకపాలను పూజిస్తారు.
నాగదేవతల్లో ఒకటైన శంకపాలను పూజిస్తారు. ఇలా చేయడంవల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి. చర్మవ్యాధులు ఉంటే తగ్గుతాయి. పిల్లాపాపలతో సుఖసంతోషాలు అనుభవిస్తారు.

సంతానం లేనివారికి నమ్ముకున్న దైవం సంతానం లేని వారు ఆయనను నమ్ముకుంటే చాలు సకల శుభాలు లభిస్తాయని ప్రతీతి. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణమును వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణమును చూసిన వారికి వివాహములలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. అంతే కాక సుబ్రహ్మణ్య ప్రతిస్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది.
వంశవ్రుద్ది 
విశేషించి షష్టినాడు కుమారస్వామి ఆలయానికి పాలకావడి(పంచదారతో, పాలతో ఉండే కుండలు)ని అర్పించినవారికి వంశవ్రుద్ది కలుగుతుందని ప్రజల విశ్వాసం.
శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాధిస్తాడు.
ఒక చేతిలో మహాశక్తి ఆయుదాన్ని, ఒక చేతిలో ప్రకాశంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని నమస్కారలు అని శరణు వేడిన వారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాధిస్తాడు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list