MohanPublications Print Books Online store clik Here Devullu.com

నారీ ఫలం_Narifalam


నారీ ఫలం

కాలానికి తగ్గట్లుగా.. పండ్ల ఆకారాలు మారుతున్నాయి. జపాన్‌లో వివిధ రకాల పండ్లను భిన్న ఆకృతుల్లో పండించి ఔరా! అనిపిస్తున్నారు. ఓ పండు పేరు చెప్పగానే.. టక్కున మన మదిలో ఓ రూపం మెదులుతుంది. కానీ ఆ రోజులు పోయాయిప్పుడు. పుచ్చకాయ, యాపిల్‌, నారింజల పండ్ల రూపాల్ని మార్చేశారు. గుండ్రంగా కాకుండా వీటిని చతురస్రాకారంలో పండిస్తున్నారు. కానీ అచ్చు మనిషిని పోలిన పండును చూశారా? అది కూడా ఓ అమ్మాయి ఆకారంలో ఉంటుందంటే నమ్ముతారా?
కొన్ని కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. మరికొన్ని కథలు ఊహకు కూడా అందనట్లుగా ఉంటాయి. థాయ్‌లాండ్‌లో ఒకప్పుడు లభించిన ఓ పండు గురించి స్థానికులు చెప్పే కథ మాత్రం జరిగినట్టే అనిపిస్తుంది. కానీ అది నిజమో కాదో కచ్చితంగా చెప్పలేం. ఆ కథ ఓ విచిత్ర పండు గురించి. అది అచ్చంగా యువతి రూపంలో ఉంటుంది. ఈ అరుదైన పండును ‘బియర్‌ గ్రీన్‌ ఫ్రూట్‌’గా పిలుస్తారు. ఈ ఫలానికి పురాణ విశిష్టత కూడా ఉంది. బౌద్ధ పురాణం ప్రకారం వీటిని ‘నారిఫొన్‌’ ఫలాలని అంటారు. బౌద్ధులు ఈ చెట్టును ఎంతో పవిత్రంగా పూజించేవారట. ఇవి పూర్వకాలంలో హిమఫన్‌ అడవుల్లో లభించేవని స్థానికులంటారు.
ఫలవంతమైన కథ
పూర్వం బౌద్ధుల దేవుడైన ఇంద్ర, ఆయన భార్య వెస్సంతర, వాళ్ల ఇద్దరు కుమారులు.. అంతా కలిసి హిమఫన్‌ అడవుల్లో ఉండేవారట. ఓ రోజు వెస్సంతర తినడానికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చేందుకు అడవిలోకి వెళుతుంది. ఆ సమయంలో ఆమెను చూసి కొందరు మునులు ఆమెపై మనసు పడి, వెంబడించారట. అది ఇంద్ర గమనించాడు. అప్పుడు వారి దృష్టిని మరల్చడానికి అచ్చు తన భార్యను పోలినట్టుగా ఉండే ఫలాలు గల ‘నారిఫొన్‌’ వృక్షాలను సృష్టించాడట. ఆ పండ్లను చూసిన ఆ మునులు వాటికి ఆకర్షితులయ్యారు. వెంటనే వాటిని కోసుకుని తిన్నారు. అలా తింటూ వెస్సంతర గురించి మరిచిపోయారట. అవి తిన్న మునులు నాలుగు నెలలపాటు నిద్రలోనే ఉండిపోయారు. కొన్నాళ్లక నిద్రలేచిన వారికి, తమకున్న శక్తులన్నీ కోల్పోయినట్లు స్థానికుల
చెబుతుంటారు.
ఉన్నాయా? లేవా?
ఇంద్ర, వెస్సంతరలు మరణించాక ఆ అడవిలోని నారిఫొన్‌ వృక్షాలు కనిపించకుండా పోయాయని అక్కడి ప్రజలు అంటారు. బ్యాంకాక్‌లోని ‘సింగ్‌బురి’ బౌద్ధ ఆలయ సమీపంలో ఇలాంటి చెట్లు ఉన్నాయని మరికొందరి వాదన. అంతేకాదు ఆ ఆలయంలోని ఓ చిన్న పెట్టెలో భద్రంగా దాచిపెట్టిన రెండు దేహాలు.. ఈ పండ్లను పోలి ఉండటం విశేషం. ఈ పండ్లు ఉన్నాయని నమ్మేవాళ్లతో పాటు, అసలు అలాంటివి లేనేలేవని ఇదంతా ఓ కట్టుకథని కొట్టిపారేసే వాళ్లూ ఉన్నారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list