MohanPublications Print Books Online store clik Here Devullu.com

వ్యాస పౌర్ణమి, Vayasa Pournami

వ్యాస పౌర్ణమి
Vayasa Pournami

గురు పూర్ణిమ (ఆషాడ పౌర్ణమి)


వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll

మహాభారత గ్రంధకర్త అయిన "వేదవ్యాస మహర్షి" జన్మించినది.......ఆషాడ పౌర్ణమినాడు.ఈ వ్యాసుడు, పరాశర ముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును "వ్యాసపౌర్ణమి" మరియు "గురుపౌర్ణమి" అని కూడా అంటారు.

మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరచాడు. (ఋగ్గ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం).

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో2 పాదాలతో, ఈ కయుగంలో 1 పాదంతో, నడుస్తుంది.

కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.


వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఒక ఉంటుంది. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు.

శ్రీమత్భాగవతం భగవానుని 21 అవతారాలని తెలుపుతూ,వేదవ్యాసుని 17 వ అవతారంగా చెబుతుంది.

వ్యాసుడు నల్లగా ఉండేవాడంట... అందుకని ఈయనను కృష్ణుడు అని అన్నారు. క్రిష్ణుడు అని అనేవారు. ఈయన నివాసము స్థానము హిమాలయములలో, సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం... కనుక కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు .

వేదాలని విభజించి, వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక---వేదవ్యాసుడు అని, పరాశర మహర్షి కుమారుడు గనుక ---పరాసరాత్మజుడు అని, బదరీక్షేత్రంలో నివసించేవాడు కనుక ---బాదరాయణుడు అని అంటారు.

సర్వభూతముల యందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట----ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.

మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృఋణము---అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు మనుష్య ఋణము కూడా ఉంటుందని వేదవ్యాసుడు తెలియచేప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.
మహాభారత రచన:--



మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి, అతని ఎదుట ప్రత్యక్షమయ్యి "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అదృశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేకఖుడివి కావాలి.... అని తెలుపగా..... గణేశుడు అనుమతించాడు. వేదవ్యాసుడు చెబుతూఉంటే.... గణాధీశుడు రచన సాగించాడు.

గురుశిష్య సాంప్రదాయం ఏనాటిదో ఐనా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను నాల్గింటిని తన నలుగురి శిష్యులకు బోధించి, భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు.

మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి, లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢశుద్ధ పౌర్ణమి (గురు పౌర్ణమి) నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి... పూజించాలి. ఆ గురువకు పాదపూజ చేసి. కానుకలు సమర్పించి, అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"


అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి. "గు" శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. "రు" శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, మనకు జ్ఞాన్నాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.

ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.

మన పిల్లలకు ఇతిహాస, పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల, అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.

"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

గురు సందేశము :



వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది
అస్మత్ గురుభ్యో నమ




++++++++++వ్యాస పౌర్ణమి +++++++
వ్యాసుడి విజ్ఞానం ఎవరినైనా సంభ్రమాశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించాడు. అవి విడదీయడానికి సాధ్యం కానట్లుగా కలిసిపోయాయి. వ్యాసుడు ఆ వేదాలను విభజించి, తిరిగి మనకు ప్రసాదించాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త.
భారత ఇతిహాసాన్ని రచించిన వ్యాసుడు, మన ప్రాచీన పవిత్ర గాథలకు మూలమైన పద్దెనిమిది పురాణాలను వెలువరించాడు. ఇవన్నీ చేయడం మానవమాత్రుడికి సాధ్యమా? అందుకే భక్తులు ఆయనను మహావిష్ణువుగా భావిస్తారు.
జగద్గురువుల్లో ప్రథముడు వ్యాసుడే. వ్యాస పూజ అంటే వేద పూజ, ఈశ్వర పూజ! దైవానుగ్రహం కావాలంటే, గురువు ఆశీస్సు లభించాలి. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి, వెలుగు చూపినవాడే గురువు. ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించిన జ్ఞాన సంపన్నులను గురువులుగా పరిగణించి, శిష్యులు వారికి పూజ చేస్తారు. వ్యాస పూర్ణిమనాడు మనం పూజించే ‘వ్యాసుడు’ ఫలానా వ్యక్తి అని ఒక్కర్ని గురించి చెప్పే ‘పదం’ కాదు. అది ‘పదవి’! అది సకల కళానిధి, మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడి పరంపరలో వచ్చిన, వస్తున్న, రానున్న గురువులందరికీ చెందుతుంది. అందువల్ల వ్యాసపూర్ణిమనాడు ఎవరి గురువులను వారు ఆరాధించుకోవచ్చు. కలియుగంలో ఈ పండుగను పాటించే సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతారు.
ఒకప్పుడు యతీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు పాటించిన ఈ పర్వదినం, ఇప్పుడు జన సామాన్యంలోకి వచ్చింది. నేపాలులో ఇది ముఖ్యమైన పండుగ. మన దేశంలోనూ అనేక విద్యాలయాల్లో గురుపూజ, వ్యాసపూజ జరుగుతాయి. శంకర పీఠాల్లో గురుపూర్ణిమ భక్తి ప్రపత్తులతో జరుగుతుంది.
ప్రస్తుతం 28వ మహాయుగంలోని కలియుగంలో జీవిస్తున్నాం. ప్రతి మహాయుగంలోనూ మహావిష్ణువు ‘వ్యాసుడు’గా అవతరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మొదటి వ్యాసుడు స్వాయంభువుడు; 27వ వ్యాసుడు జాతూకర్ణుడు. ఇప్పటి వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు.
మానవజాతికి మహోపదేశం చేసేవి వేదాలు. సోమరితనం పాపమని, కృషిచేసేవాడికే దైవం తోడ్పడతాడని, శ్రమలోనే సంపద ఉన్నదని, ఉత్సాహవంతుడికి విద్య లభిస్తుందని, మనసు ఎప్పుడూ శుభాన్ని కోరాలని, అన్ని ప్రాణుల్నీ స్నేహబుద్ధితో చూడాలని... వేదం పలుకుతున్నది. ధార్మిక సేవకు వేదం మూలమని మనుస్మృతి పేర్కొంది. ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికీ మనకు లభిస్తుండటానికి కారకుడు వ్యాసుడు!
మన పవిత్ర పారాయణ గ్రంథం భగవద్గీత. తిలక్‌, గాంధీలను కర్తవ్య దీక్షాదక్షుల్ని చేసిన భగవద్గీత మహాభారతంలోది. వేదసారాన్ని పిండి ‘పంచమవేద’మైన మహాభారతాన్ని అందించిన మహర్షి- వేదవ్యాసుడు. కొత్త పురాణం రచించినవారిని ‘వ్యాసుడు’ అనడం రివాజు. వేదబోధను సామాన్యుల వద్దకు చేర్చడానికి భారతాన్ని రచించి, మళ్ళీ భారత ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా ఆయన సరళ సుందరంగా సంక్షిప్తీకరించాడు. శంకరాచార్యుల భాష్యంతో భగవద్గీతా జ్ఞానం అందరికీ మరింత చేరువ అయింది.
సత్యవతీ పరాశరుల పుత్రుడైన వ్యాసుడు భారతాన్ని రచించడమే కాదు, ఆ మహేతిహాసంలో తానూ ఒక పాత్రగా పలు పర్యాయాలు దర్శనమిస్తాడు. భారత రచనతో సంతృప్తి చెందని వ్యాసుడు, భాగవతాన్నీ రచించి ధన్యుడయ్యాడు.
వేదం ప్రభువులా శాసించి చెబుతుంది. పురాణం మిత్రుడిలా కథారూపంలో ప్రబోధిస్తుంది. ఇటువంటి భారతీయ సాంస్కృతిక మూలస్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ వందనీయుడయ్యాడు. ఆయన జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ ఆద్యుడైన వ్యాసుడి పుట్టినరోజు పండుగను గురుపూజోత్సవంగా, కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమా వ్రతంగా ఆచరిస్తారు. శివభక్తులు శివ శయన వ్రతాన్ని పాటిస్తారు. ఆధ్యాత్మికవేత్తలకే పరిమితమైన ‘వ్యాసపూర్ణిమ’ నేడు సర్వజన హృదయాహ్లాదకరమైన ‘గురుపౌర్ణమి’గా వ్యాప్తి చెందడం శుభ పరిణామం!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు
++++++జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి++++++
వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం!
గురువు అంటే:
గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చే యువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.
వేదవ్యాసుని కథ:
వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ దెై్వపాయనుడే వ్యాసుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు.పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశసా్తల్రు పొందాడు.కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే! భాగవాతాన్ని రచించాడు.
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి దైలుడనే శిష్యునికి ఋగ్వేదాన్ని, వైశాంపాయనునికి యజుర్వే దాన్ని; జైమినికి సామవేదాన్ని; సుమంతునికి అధర్వణ వేదాన్ని తెలియజేసి వ్యాప్తి చేయించాడు. తాను వ్రాసిన పురాణాతిహాసాలు సుతునికి చెప్పి ప్రచారం చేయించాడు. పరమేశ్వరుని దయతో వ్యాసునికి పుత్రుడు జన్మించాడు. ఒక రోజు వ్యాసుడు తన ఆశ్రమంలో అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనబడింది. ఆమె అందానికి చలించిన వ్యాసుని వీర్యస్కలనం కాగా అందుండే శుకుడు జన్మించాడు. ఆ బాలునికి వ్యాసుడు దివ్యబోధలు చేసాడు. సృష్టి్ట క్రమం, యుగధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేసి జ్ఙానిగా మార్చాడు.
ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు.అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.
పూజా విధానం (వ్యాస పూజ / గురు పూజా విధానం)...
కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.
ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురు వుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట!వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి.ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.
వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.
శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః
అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!
ఆషాఢ పూర్ణిమ ప్రత్యేకతలు...
ఈ రోజు గురు పూర్ణిమతో పాటుగా కోకిలా వ్రతం, మహాషాఢి అని, వ్యాస పూజ, శివశయనోత్సవం, జితేంద్రరాయ జాతర. ఆ, కా, మా, వై పూర్ణిమలో మొదటిదైన ఆషాఢ పూర్ణిమ స్నానం... ఎన్నో వున్నాయి. కోకిలా వ్రతం విచిత్రంగా వుంటుంది, ఈనాడు సాయంకాలం నది స్నానం చేసి తెలకపిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి. నెల రోజులు పాటు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు చేసినా అందమైన భాగస్వామి దొరుకుతాడని అంటారు. కోకిల, తెలకపిండి ప్రధానంగా కావాలి. ఆషాఢంలో తెలకపిండి తీసుకోవాలి, కోకిల వలస వెళ్ళిపోతుంది. కోకిలాదేవి ద్రుపదుని భార్య..

ప్ర‌పంచానికే పున్న‌మి - గురుపౌర్ణ‌మి


హైంద‌వుల గాయ‌త్రి మంత్రం `ధియోయోనః ప్ర‌చోద‌యాత్` అని వేడుకుంటుంది. అంటే మా బుద్ధిని విక‌సింప‌చేయి అని అర్థం. జీవితంలోని ప్ర‌తి సంద‌ర్భంలోనూ, ప్ర‌తి ప్ర‌స్థానంలోనూ... ఏది మంచి, ఏది చెడు! ఏది ఉచితం, ఏది అనుచితం! అన్న నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి ఉంటుంది. మ‌నిషి తీసుకునే ఆయా నిర్ణ‌యాలు అత‌ని వ్య‌క్తిత్వాన్ని సూచిస్తాయి. కానీ స‌రైన న‌డ‌వ‌డిలో ఉండాల్సిన అటువంటి సంస్కారం అల‌వ‌డాలంటే గురువు సాయం త‌ప్ప‌నిస‌రి. అది విద్య‌ని నేర్పిన గురువులు కావ‌చ్చు. విద్య ప‌ర‌మార్థాన్ని బోధించే త‌త్వ‌వేత్త‌లు కావ‌చ్చు. నేర్చుకోవాల‌న్న త‌ప‌న ఉంటే, ఈ సృష్టిలోని చరాచ‌రాల‌న్నీ మ‌న‌కి గురువుగా నిలుస్తాయి. అందుక‌నే ద‌త్తాత్రేయుడు ఆకాశం నుంచి స‌ముద్రం దాకా త‌న‌కి 24 మంది గురువులు ఉన్నార‌ని చెప్పారు. గురువును మ‌నం సాక్షాత్తూ ప‌ర‌బ్ర‌హ్మ‌గా భావించి పూజిస్తాము. ఆ దేవుని సైతం ప‌రిచ‌యం చేసేది గురువే కాబ‌ట్టి క‌బీరు, దేవుని కంటే ముందుగా త‌న గురువుకే న‌మ‌స్క‌రిస్తాన‌ని చెబుతాడు.
విశిష్ట వ్య‌క్తిత్వం ఉన్న గురువుని త‌ల‌చుకునేందుకు ఒక విశిష్ట‌మైన రోజు కూడా ఉండాలి క‌దా... అదే గురుపౌర్ణ‌మి! వేద‌వ్యాసునిగా పిలువ‌బ‌డే కృష్ణద్వైపాయుని పుట్టిన‌రోజే ఈ గురుపౌర్ణ‌మి. హైంద‌వుల‌కి ఎంతో పూజ‌నీయ‌మైన‌ భారతం, భాగవతాల‌తో పాటు అష్టాదశపురాణాలు రచించిన‌వాడు వ్యాసుడు. అంతేకాదు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న వేద‌విజ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభ‌జించినవాడు. అందుకే ఆయ‌న‌కు వేద‌వ్యాసుడు అన్న పేరు వ‌చ్చింది. గురువుని ఆరాధించ‌డానికి ఇంత‌కంటే గొప్ప రోజు మ‌రేముంటుంది?
జీవితంలో అంద‌రూ అన్నీ తెలుసుకోలేరు. అనుభ‌వంతోనూ, ఆలోచ‌న‌తోనూ, అభ్యాసంతోనూ కొంద‌రు మ‌న‌కంటే జ్ఞాన‌వంతులై ఉంటారు. అలాంటి జ్ఞాన‌సంప‌న్నులే గురువులు. "అంతా నీలోనే ఉంది. నువ్వ‌వ‌రో ముందు తెలుసుకో! " అని చెప్ప‌డానికి కూడా ఒక గురువు కావాలి క‌దా! బ్ర‌తుక‌నే ప్ర‌యాణంలో ప్ర‌తి మ‌జిలీ గురించీ క్షుణ్నంగా తెలిసిన‌వాడే గురువు. అందుకే అన్నీ తెలిసిన దేవ‌త‌లైనా, అజ్ఞానానికి మారుపేరైన అసురులైనా గురువుని ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌లేదు. శిష్యుని వ్య‌క్తిత్వంలో సంస్కారం, గురువు బోధ‌లో సాధికార‌త ఉంటే ప్ర‌తి గురుశిష్య బంధ‌మూ లోకానికి ఓ కొత్త ఒర‌వ‌డిని ఇస్తుంది. అల‌నాటి రాముని తీర్చిదిద్దిన వ‌శిష్ఠుల నుంచీ, వివేకానందుని కార్యోన్ముఖుడిని చేసిన రామ‌కృష్ణుల వ‌ర‌కూ ప్ర‌తి గురువూ పూజ‌నీయులే! ఆది నుంచీ గురుపౌర్ణ‌మిని ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటున్న‌ప్ప‌టికీ... శ్రీపాద‌, శ్రీనృసింహ‌, అక్క‌ల్‌కోట‌, స్వామిస‌మ‌ర్థ‌, షిరిడీసాయిబాబా... త‌దిత‌ర అవ‌ధూత‌లు ద‌త్తాత్రేయుని అవ‌తారాలుగా పూజ‌లు అందుకోవ‌డంతో గురుపౌర్ణ‌మి నానాటికీ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటోంది.
గురువు అంటే మ‌న చెంత‌నే ఉండేవారు కాన‌వ‌స‌రం లేదు. మ‌న విధిని, సంస్కారాన్ని అనుస‌రించి నియ‌త గురువులు, అనియ‌త గురువులు అని రెండు ర‌కాలైన గురువులు మ‌న‌కి జ్ఞానాన్ని ప్ర‌సాదిస్తార‌ట‌. నియ‌త గురువులు అంటే మ‌న‌ల్ని ఉద్ధ‌రించేందుకు నియ‌మింప‌బ‌డిన‌వారు, అనియ‌త గురువులు అంటే స‌మ‌యానుకూలంగా మ‌న జీవితంలోకి ప్ర‌వేశించి, మ‌న‌కి మంచిదారిని చూపేవారు. ఆ ర‌కంగా జీవితంలో మంచి మార్గాన్ని సూచించే ప్ర‌తిఒక్క‌రూ అనియ‌త గురువులే! మాన‌వుడు ఉన్నంత‌వ‌ర‌కూ జ్ఞానం అవ‌శ్య‌క‌త ఉంటుంది. ప్ర‌పంచం ఉన్నంత‌వ‌ర‌కూ గురువు అవ‌స‌ర‌మూ ఉంటుంది. అందుక‌నే మ‌న పురాణాలు వేద‌వ్యాసునికి మ‌ర‌ణం లేదు అని చెబుతున్నాయి. నిజ‌మే క‌దా!


గురుదేవుడు దత్తాత్రేయుడు 
(Gurudev Dattatreya)



శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే, గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘గురువు' అంటే దత్తాత్రేయుడే! ఎందుకంటే ఆయనకున్న ఇరు పార్శ్వాల్లో రెండు రూపాలున్నాయి! అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు, దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. ఈరోజు గురుపూర్ణిమ కనుక విశిష్ట గురువు దత్తాత్రేయుని స్మరించుకుందాం.
దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’ అంటారు.



దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.
దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు. అందుకే దత్తాత్రేయుని
''జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం 
నిశ్రేయసప్ర దం వందే స్మర్త్రగామీ నమావతు''
అని ప్రార్ధించుకుంటాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.
మనసా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే. కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానించుకుందాం.
దత్తాత్రేయుడు విశ్వమంతా పరచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగివుంటాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. అంతేనా, మనిషిలోని అసలు మనిషిని వెలికితీయగల మహిమాన్వితుడు.
వివేకంతో, విచక్షణతో, ఆలోచనల్ని అంతర్ మధించి అసలైన జ్ఞానాన్ని అందింపుచ్చుకోవాలి. అది మన కర్తవ్యం. అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ – ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు. అందుకే సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు.















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list