MohanPublications Print Books Online store clik Here Devullu.com

పురందరదాసు_Purandaradasa_Granthanidhi Mohanpublications Bhakti Pustakalu

పురందరదాసు Purandaradasa purandaradasu ಪುರಂದರ ದಾಸ hampi kannda lord krishna lord krishna devote Carnatic music Shivamogga Karnataka bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


పురందరదాసు


మన అందరికీ పురందరదాసు కథ తెలిసిందే . అందులో సాధ్వీమతల్లి అయిన ఆయన ధర్మపత్ని సరస్వతమ్మ గూర్చి తెలిసిందే . పురందరదాసు అసలు పేరు శీనప్ప . కన్నడ సామ్రాజ్యములో పేరుబడసిన రత్నాల వ్యాపారి . ఆయన పిల్లికి బిక్షం వేసే రకం కాదు . మరి అయన ధర్మపత్ని మాత్రం అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు అందరికీ వారు వీరు అనిలేకుండా సకల మర్యాదలు చేసే మహా ఇల్లాలు . ఇదంతా గమనించిన శీనప్ప ప్రతీవాటినీ తన ఇంటిలో చెక్క పెట్టెలలో పెట్టించి తాళాలు వేసుకుని తాళాల గుత్తి తన దగ్గరే ఉంచుకునే వారు . ఒక సారి ఓ పేద బ్రాహ్మణుడు శీనప్ప ఇంటికి రాగా ప్రతీ రోజు రేపు రమ్మని తిప్పుకునేవాడు . అలా తిరిగీ తిరిగీ ఆ బ్రాహ్మణుడు అలసిపోయాడు గానీ విత్తం గానీ ఇంత ధాన్యం కానీ దానం చేయలేదు శీనప్ప . ఓ రోజు శీనప్ప ఇంట లేని నాడు ఆ బ్రాహ్మణుడు సరస్వతమ్మను దర్శించి తన పేదరికం బాపమని వేడుకున్నాడు . ఆమె ఇంట ఇపుడు ఏమీ ఆమె స్వాధీనములో లేదు . ఆ పేద బ్రాహ్మణుని పేదరికం చూసి జాలిపడి ఆమె తన ముక్కుకు ఉన్న రత్నం పొదిగిన ముక్కెర ఇచ్చి వేసి అమ్మి వేసి సొమ్ము తీసుకుని జీవించమంది . ఆ బ్రాహ్మణుడు అది అమ్మడానికి నేరుగా శీనప్ప కొలువై యున్న రత్నాల అంగడికి వెళ్లి అమ్మజూపాడు . ఆ ముక్కెర తానే స్వయంగా రత్నం పొదిగి చేయించింది , అత్యంత విలువైనది . అది చూసిన ఆయనకు నమ్మబుద్ధి కాక వెంటనే తన వద్ద ఉన్న నౌకరుని పంపి వెంటనే తన శ్రీమతి వద్ద యున్న రత్నం పొదిగిన ముక్కెర తీసుకురమ్మనమని చెప్పమని వ్రాసి పంపాడు . ఆమె ఆ పత్రం చదివి బెంబేలు పడిపోయి ఇంక తనకు ఇక దిక్కు తాను నిరంతరం కొలిచే పాండురంగడే అని తలచి విషం తీసుకోబోగా ఆపాత్రలో ధగ ధగ మెరిసే ముక్కెర కనబడింది దానిని తీసి శుభ్రం చేసి ఆమె ఆ ముక్కెరను నౌకరు చేత పంపింది . అది గాంచిన తరువాత శీనప్ప ఖరీదు కట్టి ఆ రత్నం పొదిగిన ముక్కెర కొని దానిని ఇంటికి తీసుకు పోయి అసలు విషయం విచారించగా అపుడు సంగతి తెల్సింది . ఆమె ఆ ముక్కెర ఆ బ్రాహ్మణునికి దానం చేసిన విషయం .. విష పాత్రలో ముక్కెర ఉండటం . అంతే అంతవరకూ కాకికి ఎంగిలి చేయి విదల్చని శీనప్పలో మార్పు వచ్చేసింది . మొత్తం తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ దాన ధర్మాలు వినియోగించారు . భక్తితో శ్రీరంగని మీద , వెంకటేశ్వర స్వామి వారి మీద కన్నడములో అనేక కీర్తనలు రచించారు . దాస సంగీతానికి ఆద్యుడు , కర్ణాటకా సంగీత పితామహుడు అయిన పురందర దాసులో మార్పు తెచ్చిన సంఘటన ఇదే . ఇటువంటి సాధ్వీమలలామలు పుట్టిన నేల ఈ భారతం .

- వీర నరసింహ రాజు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list