MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయ మహత్యం || #SriRamaNavami

 Vontimitta bhaktipustakalu



వెన్నెల్లో.. రామచంద్రుడు 
దొంగలు కట్టిన గుడి
ఏకశిలానగరం..కానీ ఓరుగల్లు కాదు!
తెలుగునాట సీతారామలక్ష్మణులు కొలువుదీరిన పుణ్యధామం.. కానీ భద్రాద్రి కాదు!
వాల్మీకి రామాయణంలో కనిపించనిది.. వెన్నెల వెలుగుల్లో మురిపించేది.. ఒకే క్షేత్రం. అదే ఒంటిమిట్ట! ఆంధ్రప్రదేశ్‌లో అపర భద్రాచలంగా పేరొందిన ఈ దివ్యక్షేత్రం శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
ఒంటిమిట్టకు ఆ పేరు ఇద్దరు దొంగల వల్ల వచ్చింది. వంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు దారిదోపిడీలు చేస్తూ.. దోచుకున్న ధనాన్ని ఒంటిమిట్ట గుహల్లో దాచుకునేవారు. కోదండరాముడు ఆ దొంగల బుద్ధి మార్చి వారిని సన్మార్గంలో నడిచేలా అనుగ్రహించాడట. ఆ ఇద్దరూ స్వామివారికి గుడి కట్టించారని చెబుతారు. అలా ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉంది ఒంటిమిట్ట. చుట్టూ కొండలు, పచ్చని పంటపొలాల మధ్యలో ఉంటుంది ఇక్కడి కోదండ రామాలయం. అపురూప శిల్పసంపదతో అలరారుతున్న ఈ దేవాలయ నిర్మాణంలో చోళరాజులు, విజయనగర రాజులు, మట్టిరాజుల కళావైభవం కనిపిస్తుంది. రాజగోపురాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయ మంటపంలోని ప్రతి స్తంభం ఒక కళారూపాన్ని ప్రదర్శిస్తుంది.
యుగయుగాల క్షేత్రం
ఒంటిమిట్ట ఆలయం వెనుక పౌరాణిక గాథలు ఎన్నో ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఇక్కడికి వచ్చి రాక్షసులను సంహరించాడట. దానికి కృతజ్ఞతగా మునులు ఏకశిలపై సీతారామ లక్ష్మణుల రూపాలను చెక్కారట. అందుకే ఇది ఏకశిలానగరమైంది. ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ మూర్తిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేశాడట.
చతుర్దశి నాడు..
ఒంటిమిట్ట ఆలయంలో ప్రత్యేకతలు ఎన్నో. సాధారణంగా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు. ఇక్కడ మాత్రం చైత్ర శుద్ధ చతుర్దశి నాడు కల్యాణం చేస్తారు. రామాయణం ప్రకారం  సీతారాముల వివాహం చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో జరిగింది. ఒంటిమిట్ట లోనూ అదే రోజున కల్యాణం చేయాలని విజయనగర సామ్రాజ్య నిర్మాతల్లో ఒకరైన బుక్కరాయలు నిర్ణయించారట. తొలికల్యాణ మహోత్సవానికి ఉత్తరఫల్గుణి నక్షత్రం ఘడియలు రాత్రి పూట ఉండటంతో రాత్రివేళలోనే కల్యాణం జరిపించారు. నాటి నుంచి నేటి వరకు చతుర్దశి వెన్నెల్లో స్వామివారి పెళ్లి నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట గర్భాలయంలో ఆంజనేయుడి విగ్రహం కనిపించదు. పవన సుతుడు.. సంజీవరాయుడిగా ఆలయం ఎదురుగా ఉంటాడు. బమ్మెర పోతన భాగవత కావ్యాన్ని ఇక్కడే రాశారని చెబుతారు. ఒంటిమిట్టకు ఏడాది పొడుగునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా, చతుర్దశి రోజు జరిగే కల్యాణాన్ని తిలకించడానికి ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. స్వామివారి సేవలో తరించి.. కోదండరాముడి కొండంత దీవెనలు అందుకొని తిరుగు ప్రయాణం అవుతారు.

ఇలా చేరుకోవచ్చు
ఒంటిమిట్ట కడప నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప నుంచి బస్సులు, ట్యాక్సీల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. తిరుపతి నుంచి వచ్చే వారు రైలులో నందలూరుకు చేరుకుని అక్కడి నుంచి బస్సులో వెళ్లొచ్చు.





దేశంలో ఆంజనేయ విగ్రహం లేని రామ దేవాలయం ఇదొక్కటే...ఇక్కడ ప్రతి ఒక్కటీ విశిష్టమైనదే భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని రామాలయం ఎక్కడుందో తెలుసా ? రామాయణ ఘట్టాలు జరిగిన ప్రదేశాలు !! తెలుగు జానపద సినిమాల రహస్య కోట ఇక్కడ ఉంది. మీరు శ్రీకాళహస్తి వెళ్తున్నారా ? 'రెండవ హంపి' చూసొద్దాం పదండి ..! ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది.... 


శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ మహత్యం ! ముందుగా తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలను భద్రాచలంలో నిర్వహించేవారు. రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ గా 2014 జూన్ 2 న విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణ లోకి వెళ్లిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీ రామ నవమి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవటానికి ఆలయాలు కనిపించలేదు. అప్పుడే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఒంటిమిట్ట. ఒంటి మిట్ట లో అంతగా ఏముంది ?? ఒంటిమిట్ట లో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం ఉన్నది. ఇక్కడున్న రామాలయాన్ని కోదండరామ స్వామి రామాలయం అంటారు. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది కూడా చదవండి : కడప - విభిన్న సంస్కృతుల నిలయం ! ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం దాని విశిష్టతకు, మహిమలకు పేరుగాంచినది. ఇక్కడ ప్రచారంలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ మహత్యం గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు. ఈ క్షేత్రానికి గల మరోపేరు ఏకశిలానగరం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టని 'ఆంధ్రా భద్రాచలం' గా పిలుస్తున్నారు ప్రజానీకం. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తారు. కోదండరామ స్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ? కోదండరామ స్వామి ఆలయానికి చేరుకోవడానికి అన్నివిధాలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం విమానంలో వచ్చేవారు కొత్తగా పునరుద్ధరించబడిన కడప విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ఏదైనా ప్రవేట్ లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. కడప విమానాశ్రయం కొత్త కాబట్టి విమాన సర్వీసులు ఇంకా అంతగా అందుబాటులో లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రైలు మార్గం ఒంటిమిట్ట లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన గానీ లేదా షేర్ ఆటోలో గానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే భాకరపేట్ రైల్వే స్టేషన్ (7 కి.మీ), కడప రైల్వే స్టేషన్ (25 కి.మీ) మరియు తిరుపతి రైల్వే స్టేషన్ (106 కి.మీ) లు ఒంటిమిట్ట కు చేరువలో ఉన్నాయి. రోడ్డు మార్గం ఒంటిమిట్ట కు రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది. కడప నుండి ప్రతి రోజు అరగంటకోసారి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. కడప 7 రోడ్ల కూడలి వద్ద కానీ లేదా కడప ప్రధాన బస్ స్టాండ్ నుండి కానీ లేదా కడప పాత బస్ స్టాండ్ నుండి కానీ ప్రభుత్వ బస్సులు ఎక్కొచ్చు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి ఏపి ఎస్ ఆర్ టీ సి బస్సులు అందుబాటులో ఉన్నాయి. చిత్ర కృప :


ఆలయ ప్రశస్తి ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించినాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలా నగరం అన్ని పేరొచ్చింది. మీకొక సందేశం వచ్చి ఉండాలె ..! ఆ .. గుర్తొచ్చింది కదూ ..! ఆంజనేయుని విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. చిత్ర కృప 


రామ తీర్థం రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఓరోజున సీతాదేవికి దప్పిక వేసిండట. అప్పుడు రాములవారు ఆ దప్పికను పోగొట్టటానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళ గంగను పైకి తెప్పించాడట. ఆది తాగి సీతాదేవి తృప్తి చెందినదిగా ఇతిహాసాల్లో చెప్పబడింది. అదే రామ తీర్థం గా నేడు పిలువబడుతున్నది. 


ఆలయ గోపురాలు కోదండరామ స్వామి ఆలయానికి మూడు ప్రధాన గోపురద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారా లోనికి వెళితే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించారు. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి.




శిల్ప సంపద ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. రామాయణ, మహాభారతంలోని కథలు మరియు దశావతారములు వటపత్రశాయి, వారధికి గుండ్రాళ్లు ఆంజనేయస్వామి వేస్తున్న దృశ్యం, లక్ష్మణమూర్ఛ, సీతాదేవికి ఆంజనేయస్వామి అంగుళీకమును చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం, మరియు శ్రీ కృష్ణ కాళీయమర్దనం, పూతన అనే రాక్షసిని సంహరించుట వంటి శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. 


ఆలయ విశేషాలు చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఇక్కడే ఆంధ్రా వాల్మీకి గా పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.


ఇమాంబేగ్ బావి ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్, 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఇతను ఒంటిమిట్ట కోదండరామున్ని పరీక్షించగా రాముని మహిమలను ప్రత్యక్షంగా చూసి స్వామి భక్తుడిగా మారిపోయాడు. కోదండరాముని కైంకర్యానికి ఒక బావిని కూడా తవ్వించాడని చరిత్ర చెబుతుంది. అదే ఇప్పుడు ఇమాంబేగ్ బావి గా పిలువబడుతున్నది. 


ఆశ్చర్యం కలిగించే మహిమలు ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనపడటం, సహజ పండితుడు బమ్మెర పోతన రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకు రాక నిలిపి వేయగా శ్రీరాముడు ప్రత్యక్షమై పూర్తి చేయడం, ఇమాంబేగ్‌ పిలిస్తే కోదండరాముడు 'ఓ' అని పలకడం, తూర్పువైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులు మాల ఓబన్న అనే భక్తుని కోసం పశ్చిమైపునకు మరలడం వంటి కథనాలు కోదండ రాములవారి మహిమలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. 


గొప్ప ఆలయాల్లో ఇది ఒకటి చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. కవి బమ్మెర పోతన, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే. ఆ కవి విగ్రహాన్ని ఇప్పటికీ ఆలయంలో దర్శించవచ్చు.


పూజలు,ఉత్సవాలు ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. సీతారాములవారి కళ్యాణం నిజంగా చూడముచ్చటగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. నవమినాడు పోతన జయంతి నిర్వహించి కవులను సత్కరిస్తారు.


ముక్తి పొందిన మహనీయులు స్వామి వారిని చూసి ముక్తి పొందిన మహనీయులు అయ్యల రాజు తిప్పరాజు, అయ్యల రాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పు గుండూరు వెంకటకవి, వరకవి మరియు జానపదల కథల ప్రకారం ఒంటుడు, మిట్టుడు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list