MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఏలినాటి శని ఈ రాశుల్లో..!_71/2YearsofShaniMahadasainZodiac


ఏలినాటి శని ఈ రాశుల్లో..! 71/2YearsofShaniMahadasainZodiac Lord Shani Lord Shanideva Lord Shani in Horescope Lord Shani in Zodiac Shanimahadasa Arthastamashani Shanisancharam Elinatishani Festival Ugadi Ugadi Ugadi The Festival Eenadu Sunday Magazine Eenadu Sunday Magazine Ceter Spread Eenadu Suday Paper Bhakthi Pustakalu BhakthiPustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


ఏలినాటి శని ఈ రాశుల్లో..!

సమస్త ప్రాణకోటి పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అగ్రజుడు. ఇద్దరూ న్యాయాధిపతులే. అయినా వీరిలో ఈ లోకంలోని జీవుల పాపపుణ్యాలను బట్టీ ఇక్కడే దోషాలను పరిహరించే బాధ్యతను నిర్వర్తిస్తున్న శనికి విశిష్ట స్థానం ఉంది. శని దోషకాలంలో దాగున్న పరమార్థం అదే. విళంబినామ సంవత్సరంలో జాతక రీత్యా ఏయే రాశులవారికి శని దోషాలు ఉన్నాయంటే...
 
జాతకంలో శనిదోషం ఉంది అనగానే చాలామంది ఆందోళన చెందుతుంటారు. శనిదోషం శుభప్రదమైనది కాకపోవడమే ఇందుకు కారణం. అయితే, శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎంతటి దోషం నుంచైనా ఉపశమనం లభిస్తుందనేది జ్యోతిషపరమైన వాస్తవం. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు ఆయా రాశుల్లో చేసే సంచారాన్ని అనుసరించి శనిదోషం ఉంటుంది. ఈ శనిదోషాలు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని మూడురకాలుగా ఉంటాయి.

ఏలినాటి శని
పూర్ణాయుష్కుడైన ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని మూడుసార్లు వస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శని ఏడున్నర సంవత్సరాలపాటు జాతకంమీద ప్రభావం చూపే కాలాన్ని ఏలినాటి శని అంటారు. దీన్నే ఏడునాడు శని అని కూడా వ్యవహరిస్తారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. ఇది శుభాశుభాల మిశ్రమకాలం. ఏ వ్యక్తి జాతక చక్రంలోనైనా పన్నెండు రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో సంబంధిత గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. జన్మరాశి నుంచి పన్నెండు, ఒకటి, రెండు స్థానాల్లో శని ఉన్న కాలాన్ని ఏలినాటి శని కాలంగా పేర్కొంటారు. మళ్లీ తిరిగి ఈ ఏడున్నర సంవత్సరాలను ద్వాదశ శని, జన్మశని, ద్వితీయశని అనే మూడు దశలుగా విభజిస్తారు. ఒక్కో దశా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. జన్మరాశి నుంచి పన్నెండో స్థానంలో శని ఉంటే దాన్ని ద్వాదశ శని అంటారు. ఈ కాలంలో ప్రమాదాలు, ధననష్టం, అపార్థాలు, అపోహలు అధికంగా ఉంటాయి. శనీశ్వరుడు ఒకటో స్థానంలో ఉన్న కాలాన్ని జన్మశని అంటారు. ఈ కాలంలో శారీరక, మానసిక అనారోగ్యాలు ఎక్కువవుతాయి. సంపాదన ఉంటుంది కానీ డబ్బు చేతిలో ఉండదు. జన్మరాశి నుంచి రెండో స్థానంలో శని ఉంటే ఆ కాలాన్ని ద్వితీయ శని అంటారు. ఏలినాటి శని చివరి దశ ఇది. ఈ కాలంలో ధననష్టం, అపార్థాలు ఉన్నప్పటికీ కోలుకునే దశ ప్రారంభమవుతుంది. విళంబినామ సంవత్సరంలో వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారికి ఏలినాటి శని దోష కాలం నడుస్తోంది. వృశ్చికరాశివారికి 2011లో ఏలినాటిశని ప్రారంభమైంది. వీరికి ఈ ఏడాదంతా ద్వితీయ శని దోషం కొనసాగుతుంది. 2020 జనవరి 24తో ఏలినాటిశని పూర్తవుతుంది. ధనూ రాశివారికి 2014 నవంబరు నుంచీ ఏలినాటి శని ప్రారంభమైంది. వీరికి ఈ ఏడాదంతా జన్మ శనిదోషం కొనసాగుతుంది. 2023 జనవరి నాటికి దోషకాలం పూర్తవుతుంది. మకరరాశివారికి 2017 జనవరిలో ఏలినాటిశని ప్రారంభమైంది. వీరికి ఈ ఏడాదంతా ద్వాదశ శని దోషకాలం. 2025 మార్చితో శనిదోషం పూర్తవుతుంది.
అర్ధాష్టమ శని
ఏలినాటి శని పూర్తయిన రెండున్నరేళ్ల తర్వాత అర్ధాష్టమ శని కాలం ప్రారంభమవుతుంది. జన్మరాశిలో శని నాలుగో ఇంట ఉన్న కాలాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి. విళంబి నామ సంవత్సరంలో కన్యారాశివారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. 2017లో ప్రారంభమైన ఈ శని దోషం 2020 ప్రథమార్ధం వరకూ ఉంటుంది.

 
అష్టమశని
అర్ధాష్టమశని దోషం పూర్తయిన ఏడున్నర సంవత్సరాల తర్వాత అష్టమ శని ప్రారంభమవుతుంది. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన దోషకాలం. అపమృత్యుభయం, అనారోగ్యం, అవమానాలు వంటివన్నీ ఈ దోషకాలంలోనే జరుగుతాయి. అష్టమశని రెండున్నరేళ్ల కాలం పాటు ఉంటుంది. విళంబి నామ సంవత్సరంలో వృషభరాశివారికి ఈ అష్టమ శని నడుస్తోంది. 2017లో ప్రారంభమైన ఈ దోషం 2020 వరకూ కొనసాగుతుంది.

ఇలా పరిహరిద్దాం
ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం. ఇందుకోసం శాస్త్రాల్లో పేర్కొన్న చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి. ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవ గ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి. శనివారంతోపాటు త్రయోదశి, అమావాస్య కలసివచ్చినప్పుడు శనీశ్వరుడిని తప్పక ఆరాధించాలి. పరమేశ్వరుడి పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి. ముఖ్యంగా కాకులకు ఆహారం పెడితే మంచిది. యాచకులకూ వికలాంగులకూ పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించడం మంచిది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list