GRANTHANIDHI blog Posts updates, Followకై Facebook MOHAN PUBLICATIONS Page LIKE చెయ్యగలరు

ఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌_StopRelationWithSmartphone


ఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌ StopRelationWithSmartphone Smartphone Phonephobia Nomophobia SmartphoneAddiction AddictionToSmartphone KillingRelationswithSmartphone Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu Eenadu EenaduSundayMagazine SundayMagazineCoverstoryఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌!

స్మార్ట్‌ఫోన్‌... ఈ కాలపు అద్భుత ఆవిష్కరణ. సైకిల్‌ తర్వాత అత్యంత ప్రయోజనకరమైన సాధనం ఇదేనంటూ ప్రపంచమంతా జేజేలు పలుకుతున్న గ్యాడ్జెట్‌. దేశ, ప్రాంత, వర్గ, భాషా భేదాలు లేకుండా అందరి చేతుల్లో వెలిగిపోతున్న ఉపకరణం. వేలి స్పర్శతో వేయిన్నొక్క పనులు చేసి పెడుతోందంటూ సంబరంగా ఈ చిన్ని పరికరానికిగానీ అతుక్కుపోయామా... అంతే సంగతులు!

దంపతులిద్దరూ మంచం మీద చెరోవైపు తిరిగి పడుకుని ఉంటారు. మధ్యలో చార్జింగ్‌కి పెట్టిన రెండు సెల్‌ఫోన్లు. కింద ‘మేమిద్దరం మాకిద్దరు’ అంటూ ఓ వాక్యం.

‘కాసేపు ఆ ఫోను పక్కనపెడితే మూడుముళ్లూ వేయిస్తాను’ పెళ్లి పీటల మీద ఫోన్లతో బిజీగా ఉన్న వధూవరులను బతిమాలుతుంటాడు పురోహితుడు.

‘ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారంటే ఏమిటి అర్థం?’‘వాళ్లిద్దరి ఫోన్లూ ఛార్జింగ్‌లో ఉన్నాయని..!’

సామాజిక మాధ్యమాల్లో తలమునకలవుతున్నవారి గురించి ఆ మాధ్యమాల్లోనే ఇలాంటి జోకులు ఎన్నో. సెల్‌ఫోన్‌ ఇప్పుడు చాలా స్మార్ట్‌గా మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చేసింది. పుష్కరం క్రితం అసలా పదమే లేదు నిఘంటువులో. ఇప్పుడు ప్రపంచమంతా దాని చుట్టూనే తిరుగుతోంది!

ఇంట్లో కుటుంబసభ్యులకు ఏనాడూ శుభోదయం చెప్పనివారు నేడు సామాజిక మాధ్యమాల్లో ముఖపరిచయమే లేని మిత్రులకు శుభోదయం చెప్పకుండా మంచం దిగడం లేదు. చాలామందికి ఇదో అబ్సెషన్‌ అయిపోయింది. మనదేశంలో మూడింట ఒక వంతు స్మార్ట్‌ఫోన్లలో రోజూ స్టోరేజ్‌ స్పేస్‌ అయిపోతుండడం చూసిన గూగుల్‌ దానిపై అధ్యయనం చేసింది. అందమైన ఫొటోలతో, దేవుళ్ల చిత్రాలతో ప్రజలు చెప్పుకొంటున్న ఈ శుభోదయం సందేశాలే అందుకు కారణమని తేల్చింది. గత ఐదేళ్లలో ఇలాంటి చిత్రాలకోసం గూగుల్‌లో వెదుకుతున్న వారి సంఖ్య పదిరెట్లు పెరిగిందట. ఈ సమస్య తగ్గించడానికే ‘స్టేటస్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్‌. అక్కడ ఒక్క ఫొటో పెట్టి, గుడ్‌మార్నింగ్‌ అని క్యాప్షన్‌ ఇస్తే అందరికీ చెప్పినట్లే. కానీ దాన్ని ఉపయోగించేవారు అరుదు. కొత్త సంవత్సరం నాడు ఒక్క మనదేశంలోనే రికార్డు స్థాయిలో రెండు వేల కోట్ల సందేశాలను ఫోన్లు చేరవేశాయి.ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని సందేశాలు నమోదవలేదు!

ఇది చాలదూ ఫోనుని మనం ఎంత ఎక్కువగా వినియోగిస్తున్నామో చెప్పడానికి.

ఫోను వాడితే తప్పేముంది?
తప్పేమీలేదు, ఫోను అవసరమే. అయితే ఆ వాడకానికి ఒక పరిమితి అంటూ లేకపోతేనే తిప్పలు. రెండువైపులా పదునున్న కత్తిలాంటిదీ స్మార్ట్‌ఫోను. దాంతో పనులూ చేసుకోవచ్చు. కాలక్షేపమూ చేయొచ్చు.దుర్వినియోగమూ చేయొచ్చు. దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామన్న దాన్నిబట్టి ఫోను మన నియంత్రణలో ఉందో లేక మనమే దానికి బానిసలమయ్యామో తెలుస్తుంది. ఫోన్‌ ద్వారా బంధుమిత్రుల యోగక్షేమాలు విచారించవచ్చు. ఉద్యోగ, వ్యాపార పనుల గురించి మాట్లాడొచ్చు. సందేశాలూ మెయిల్సూ పంపొచ్చు. ఇంకా ఎన్నో పనులు చేయొచ్చు. వాటికి ఎంతో సేపు పట్టదు. బ్యాంకు లావాదేవీలూ ఇతరత్రా పనులూ రోజూ ఉండేవి కావు. అయినా ఎక్కువ సమయం ఫోనుతో గడుపుతున్నారంటే, ఫోను లేకపోతే చేతులు విరిచేసినట్లుగా ఇబ్బంది పడిపోతున్నారంటే- ఫోనుతో గడపడమనేది వారికి వ్యసనంగా మారిపోయిందనే అర్థం. కొందరు సామాజిక మాధ్యమాలు ఎక్కువగా చూస్తుంటారు. తమ పోస్టుకి లైకులూ కామెంట్లూ ఎన్నొచ్చాయోనని పదినిమిషాలకోసారి చెక్‌ చేస్తుంటారు. కొందరు ట్విటర్‌ని అనుసరిస్తుంటారు. అనుక్షణం అప్‌డేట్స్‌ కావాలి వారికి. ఇంకొందరు అవసరం ఉన్నా లేకపోయినా వారికి తోచిన విషయం గురించి అంతర్జాలంలో శోధిస్తుంటారు. వీరే కాదు, వీడియోలూ, సినిమాలూ చూసేవారూ; గాసిప్స్‌ చదివేవారూ; ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారూ; గంటల తరబడి గేమ్స్‌ ఆడేవారూ... ఇలా ఎందరో తమను తాము సెల్‌ఫోన్‌తో కట్టేసుకుంటున్నారు. తింటున్నా, రోడ్డుమీద నడుస్తున్నా, వాహనం నడుపుతున్నా, ఆఖరికి నిద్రపోతున్నా చేతిలో సెల్‌ఫోను వదలడం లేదు ఇలాంటివారు.

దాన్ని వ్యసనమని ఎలా అంటారు?
చాలామందికి ఫోన్‌ అబ్సెషన్‌ అంటున్నారు దీనిపై పరిశోధన చేసిన నిపుణులు. అంటే వారి ‘మనసంతా ఫోనే’ ఆక్రమించేసి ఉంటోందట. ఆ దశ కూడా దాటి కొందరు వ్యసనం స్థాయికి చేరుకుంటున్నారన్నది నిపుణులు చెప్తున్న లెక్క. ఇప్పుడిది ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న సమస్య. మన దేశ పరిస్థితి చూస్తే...
* సెమిస్టర్‌ పరీక్షలు పాస్‌ కాకపోవడంతో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని కళాశాలనుంచి పంపించేశారు... రోజూ 14 గంటలు ఫోనుతో గడుపుతూ చదువు వదిలేసిన ఆ అబ్బాయిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాఠాలు వినకుండా ఫోనుతో ఆడుకుంటున్నాడని 16 ఏళ్ల కుర్రాడి ఫోనును స్కూలు యాజమాన్యం తీసుకుంది... ఆ అబ్బాయి మరో ఫోను కొనుక్కోడానికి తండ్రి జేబులో డబ్బు దొంగిలించాడు. దిల్లీలోని ఎయిమ్స్‌కి ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి. పరిస్థితులు చేతులు దాటితే కానీ అవి ఆస్పత్రిదాకా రావన్నది వాస్తవం. హైదరాబాద్‌లోనూ
ఖరీదైన ఫోన్లు కొనుక్కోవడానికే ఎక్కువ మంది విద్యార్థులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.
* 13-24 మధ్య వయసువారిలో గత ఏడాదిలోనే ఫోన్‌ ఎడిక్షన్‌ సమస్య 75 నుంచి 100 శాతం వరకూ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారికి ఎంఆర్‌ఐ, సీఏటీ స్కాన్‌ పరీక్షలు చేసినప్పుడు వాటి ఫలితాలు హెరాయిన్‌, కొకైన్‌ లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారి ఫలితాలను పోలి ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
* రెండేళ్ల క్రితం జరిగిన ఓ అధ్యయనంలోనే స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారిలో 83 శాతం దాన్ని పక్కనే పెట్టుకు పడుకుంటున్నారని తెలిసింది. 57 శాతం ఫోను లేకుండా తాము బతకలేమని చెప్పారట.
* నానాటికీ డేటా చౌకగా లభించడమూ కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ని ముంచెత్తడం వల్ల ఈ సమస్య భవిష్యత్తులో ఎన్నో రెట్లు పెరుగుతుందని క్రిసిల్‌ రీసెర్చ్‌ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
* చాలామంది నవతరం తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించడానికి ఫోనుల్ని వాడుకుంటున్నారన్నది నిపుణుల ఫిర్యాదు. ఫోనులో రైమ్సో, కార్టూన్‌ ఫిల్మో పెట్టి పసిపిల్లలు అది చూస్తుంటే తాము పనులు చేసుకుంటున్నారనీ ఈ అలవాటే పిల్లల్ని ఫోనుకు అలవాటు చేస్తోందనీ పెద్దయ్యాకా అది పోవడం లేదనీ నిపుణులంటున్నారు.

ఇది వ్యసనంగా మారిందని ఎలా తెలుస్తుంది?
* ఫోను లేకుండా క్షణం కూడా ఉండలేను... అంటుంటారా?
* ఫోను వాడే విషయంలో కుటుంబ సభ్యులకూ మీకూ మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయా?
* చదువూ, ఇంటి పనులూ, ఆఫీసు పనులను సమయానికి పూర్తిచేయలేకపోతున్నారా?
* మనసు బాగోనప్పుడల్లా ఫోన్‌ ఆన్‌ చేస్తున్నారా?
* చదువు/ఉద్యోగం తప్ప మరో హాబీ లేదా? మిగిలిన సమయం అంతా ఫోనుతోనేనా?
* పనిలో ఉన్నా సోషల్‌ మీడియా పోస్టులూ లైకులూ కామెంట్ల గురించీ ఆలోచిస్తుంటారా?
* కాసేపు ఫోనుకి దూరంగా ఉండాల్సి వస్తే చిరాకుపడిపోతున్నారా?
* స్నేహితులను కలిసి మాట్లాడడంకన్నా ఫోనుతో గడిపే సమయమే ఎక్కువగా ఉంటోందా?
* భోజనం చేసేటప్పుడూ పడుకున్నప్పుడూ ఫోను పక్కనే పెట్టుకుంటున్నారా?
... పై తొమ్మిది ప్రశ్నల్లో కనీసం ఆరింటికి ‘అవును’ అన్నది సమాధానమైతే ఫోను వాడకం వ్యసనంగా మారినట్లే లెక్క.

ఫోను ఉంది వాడుకోడానికేగా, ఎక్కువసేపు వాడితే నష్టమేముంది?
ఫోను అవసరానికి వాడాలి. అనవసరంగా వాడితే నష్టమే. ఎవరికి వారు తమ ఫోన్లకి అతుక్కునిపోవడం వల్ల ముఖ్యంగా మానవసంబంధాలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. ప్రత్యక్ష స్నేహ సంబంధాల కన్నా వర్చువల్‌ స్నేహాలు ఎక్కువవుతున్నాయనీ, ముఖ పరిచయం లేకుండా దూరంగా ఎక్కడో ఉన్నవారితో చాటింగ్‌ చేసి ఆ స్నేహాలను నమ్మి జీవితాలను పణంగా పెట్టే యువతీయువకులు ఎక్కువవుతున్నారనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికత వాడకం ఎక్కువైన కొద్దీ మనుషులు యంత్రాల్లా మారిపోతున్నారన్నది వాస్తవం. ఏకాగ్రత తగ్గడమూ, మానసిక ఒత్తిడి పెరగడమూ, నిద్రలేమీ, కుంగుబాటూ, ఒంటరితనమూ ఫోను ఎక్కువగా వాడేవారిలో కన్పించే లక్షణాలు. ఒత్తిడితో బాధపడుతున్నవారికి ఉద్యోగ, కుటుంబ జీవితాలను సమన్వయం చేసుకోమని ఒకప్పుడు నిపుణులు సలహాలిచ్చేవారు. ఆ వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ కాస్తా ఇప్పుడు టెక్‌ లైఫ్‌ బ్యాలన్స్‌గా మారింది. ఫోను వాడకం మానసికాందోళనను పెంచుతున్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన ఒక అధ్యయనం తేల్చింది. ఫోను కనపడకుండా ఉంటే ఏదో కోల్పోయినట్లు అన్పించడమూ ఫోను మోగకపోయినా మోగినట్లు అనుభూతి చెంది పదే పదే తీసి చూడడమూ, పలకరిస్తే చికాకు పడడమూ... ఇలాంటివి ఫోను వ్యసనంగా మారుతోందనడానికి నిదర్శనాలు.   

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం