GRANTHANIDHI blog Posts updates, Followకై Facebook MOHAN PUBLICATIONS Page LIKE చెయ్యగలరు

గోదానం_Godanam


గోదానం Godanam GoPuja Govu Aavu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu


గోదానం చేస్తే మంచిదంటారు.. ఎందువల్ల?


అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి న‌దీ గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శ‌పించాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు.

నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చ‌నిపొమ్మ‌ని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్న‌ట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.

శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

వసుధైక కుటుంబం_VasudikaKutumbam


వసుధైక కుటుంబం VasudikaKutumbam Univers Galaxy World Earth BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu Antaryami Eenadu Eenadupaperవసుధైక కుటుంబం


విశ్వంలో ఏదీ- దేనికీ దూరంగా లేదు. దూరాభారం అసలే కాదు. సమస్త విశ్వంలోనూ స్థాణురూప దైవం నిండి ఉన్నట్లు చెబుతారు. అప్పుడు అంతటా ఏకరూపత ఉంటుంది కాబట్టి, దూరానికి తావే లేదని విశ్వసించాలి. కాకపోతే, మాయ అలా భ్రమ కలిగిస్తోంది. కమలం చిన్నది. దాని ఉనికి, పరిమాణం ఎంత? అత్యంత దూరాన అంతరిక్షంలో ఉండే సూర్యుడికి, దానికి సంబంధమేమిటి? అనుబంధం, హృదయానుబంధనం, అపురూప అనుసంధానం- దాన్ని ఏమని పిలవాలన్నదీ మరో ప్రశ్న.

వెన్నెల కిరణాలకే వికసించే కలువ- తన కలువరేకులంత కళ్లతో, నయనాల దిన్నెల్లో వెన్నెలను ఆస్వాదిస్తోందని అనుకోవాలి. చంద్రుడే వెన్నెల ప్రవాహాలను పంపి, సుదీర్ఘ స్పర్శలతో కలువ రేకులను విప్పుతున్నట్లు భావించాలి. నేలమీద మడుగులో కలువ. అందనంత దూరాన అంతరిక్షంలో చంద్రుడు. ఈ ప్రేమానుబంధానికి అర్థం, అంతరార్థం గ్రహించాలి. అడవిలో ఉసిరి. సముద్రంలో ఉప్పు- ఇది సురుచిర సమ్మేళనం. ఇది ఆకు, వక్క, సున్నం కలగలిసిన పక్వ పరిమళ తాంబూల చర్వణం.

అంతులేనంత ఉన్నతోన్నత పర్వతాలు. ఆ పక్కనే లోతు అంతుపట్టని లోయలు. నిర్గమ జలరాశి వద్దనే సముద్రాల లోపలి బడబాగ్నులు. స్వభావాలు, బలాబలాల్లో సమఉజ్జీలన్నంత సామరస్యం కనిపిస్తుంది. అంతా సమతుల్య జీవనం. ఒకదాని అవసరం మరోదానికి ఉంది. భగవంతుడికి తప్ప- ఈ లోకంలో ఏదీ మరోదాని సహకారం లేకుండా మనలేదు. మహాపర్వతమైనా ‘భూమిపీఠం’ ఉండాలి. బడబాగ్నికైనా ‘వాయుఊతం’ కావాలి. ఈ బంధాలకు అంతుబట్టని దూరాలు అతకవు. అవి లేవు కూడా!

ఇది ఏకసూత్ర విస్తరిత విశ్వం. బీజరూప విస్ఫోటక లోకం. ఏది ఎక్కడ ఊపిరి పోసుకున్నా, విస్తరించినా ఒక సూక్ష్మజీవి అవసరానికి కిందికి దిగి రావాల్సిందే. పైకి పాకిపోవాల్సిందే. భూమి అవసరానికి ఆకాశం అమృత జలాల్ని వర్షిస్తుంది. వాటి కోసం సముద్ర జలాలు ఆవిరులై మేఘాలుగా పైకి పయనిస్తాయి. వృక్షాలు వింజామరలు వీచి, వాటి ఉష్ణాన్ని శీతలీకరిస్తాయి. సానుకూలతల జీవన సరళి ఇది. పరస్పర సహకార ప్రవర్తనా శైలి ఇదే!

శ్వాసను సైతం లోకం కోసం పీల్చే వృక్షాలున్నాయి. కోయిల పాపల కోసం గూళ్ల పొత్తిళ్లుపరిచే కాకులున్నాయి. ఒంటరి జీవనం, ఏకాకితనం ఎక్కడా లేవు.

ఈ విశ్వం తనకు తానే ఎంతో దగ్గర. అంతకు మించి, పొదుపరి. ఒక గూడులా, పొదలా లక్షలాది జీవరాశుల్ని, అగణిత స్థావర జంగమాదుల్ని అది పరిష్వంగంలో పొదువుకుంటుంది. ప్రకృతి నడుమ సేదదీర్చే విశ్వజననిలా అలరారుతుంది.

విశ్వం అంటే విష్ణువు. విష్ణువు అంటే విశ్వం. అంతా విశ్వసర్వం. ఆ విరాటరూపుడితో స్వేచ్ఛగా నడయాడే సంతానం. అందరూ రక్త సంబంధీకులు, ఆత్మ బంధువులు. అన్నీ కలిసిన ఈ సువిశాల విశ్వగర్భంలో- ఎవరికీ ఎవరితోనూ పేచీ లేదు. పోటీ లేదు. ఈ సూత్రాన్ని అన్వయించుకుంటే, అలవాటు చేసుకుంటే- విశ్వమే వసుధైక కుటుంబం అవుతుంది. విశ్వాభిరామంగా మారుతుంది.
- చక్కిలం విజయలక్ష్మి

ఊరకరారు మహాత్ములు_ChagantiKoteswaraRao


ఊరకరారు మహాత్ములు ChagantiKoteswaraRao Lord Eswara Lord Parameswara Lord Krishna Lord Vishnu Lord Brahma Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakaluఊరకరారు మహాత్ములు...పరమేశ్వరుడు తనకు చేసిన దానికన్నా తనను నమ్ముకున్న భక్తులకు సేవ చేస్తే ఎక్కువ ఆనందిస్తాడు. అందుకే పరమభక్తుడైన వాడిని, తనను నమ్ముకుని బతుకుతున్న వాడిని అతిథిగా పంపుతాడు. ఆ అతిథికి చేసిన మర్యాద చేత తను ప్రీతిచెందుతాడు. ఆ ప్రీతిని అడ్డుపెట్టి అభ్యున్నతినిస్తాడు. భాగవతం దశమ స్కంధంలో నందనందుని కుశలం తెలుసుకు రమ్మని వసుదేవుడు తన పురోహితుడైన గర్గుణ్ణి వ్రేపల్లెకు పంపుతాడు.

అతనికి సముచిత సత్కారాలుచేసిన నందుడు....‘‘ఊరకరారు మహాత్ములు వారధముల యిండ్లకడకు వచ్చుటలెల్లం గారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా!’’ అంటాడు. అతిథులు సామాన్యుల ఇళ్ళకు రావడం సర్వశుభాలకు కారణం. ఊరకరారు మహాత్ములు... ఆయనకేం కోరికా? ఆయనకేం పంచలచాపు మీద, లేదా మీరు పెట్టే అన్నం మీద వెర్రా... ఆయనకేం కోరిక లేదు. ఆయన అలా వచ్చేవాడూ కాదు. వచ్చినా ఉండేవాడూ కాదు. కానీ ఆయన రావలసివచ్చింది, ఉండవలసి వచ్చింది. దేనికోసం? భగవత్‌ కార్యం మీద ఉన్నాడు. అతిథిగా ఈశ్వరుడే అలా పంపాడు.

ఇంటిలోపలికి వచ్చిన అతిథులకే కాదు, బాటసారులకు కూడా మనం పూర్వం అతిథి మర్యాదలు చేసేవాళ్ళం. ప్రధానదారుల వెంబడి ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్పనిసరిగా ప్రహరీగోడల బయట పొడవుపాటి అరుగులు కట్టేవాళ్ళు. అలసిసొలసిన బాటసారులు కాసేపు వాటిమీద సేదదీరేవారు. బయట ఎవరు వచ్చేదీ పోయేదీ కూడా ఆ ఇంటి యజమానికి తెలియదు. చూడటం తటస్థిస్తే మాత్రం ఫలితమేమీ ఆశించకుండా మంచినీళ్ళు, మజ్జిగ వంటివి ఇచ్చి సేవలో తరించేవారు. భక్తుడు సేదతీరడానికి నీ అరుగు ఉపయోగపడింది. కాబట్టి నీ పుణ్యం ఖాతా పెంచేస్తాడు.

భాగవతంలో ఒక ఘట్టం – యశోదాదేవి చిన్ని కృష్ణుడిని పెట్టుకుని కూర్చుని ఉంది. అకస్మాత్తుగా తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలిరూపంలో గిరగిర తిరుగుతూ వచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోయాడు. ఈ హఠాత్‌ పరిణామానికి మొదట విస్తుపోయినా తరువాత తేరుకుని గుండెలు బాదుకుంటూ... దూడవెంట ఆవు పరుగెత్తినట్లు కృష్ణా, కృష్ణా అంటూ అరుస్తూ పోతున్నది. కృష్ణుడు భయపడిపోయిన పిల్లవాడిలాగా తృణావర్తుడి మెడ గాఠ్ఠిగా పట్టేసుకుని మెల్లగా బిగించడంతో వాడు ఊపిరాడక నేలమీద చచ్చిపడిపోయాడు.

యశోదాదేవి వచ్చి చూసేసరికి తృణావర్తుడి శరీరం మీద పిల్లవాడు ఆడుకుంటున్నాడు. గబగబా వచ్చి వాడిని ఎత్తుకుని... ఏ జన్మలో ఏ నోము నోచుకున్నానో... ఎవ్వరికి ఏమి పెట్టితినో... నా బిడ్డ నాకు క్షేమంగా దక్కాడు... అని అంటుంది యశోద. ఎప్పుడు ఏ అతిథి ఏరూపంలో వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాడో కానీ దాని ఫలితం ఈవేళ నాబిడ్డ పెనుప్రమాదం తప్పించుకున్నాడంటుంది. వాల్మీకి మహర్షి కూడా సుందరకాండలో...‘‘ఏమీ తెలియని చేతకానివాడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమేశ్వర స్వరూపుడే’ అంటాడు.

అయినప్పుడు ప్రాజ్ఞుడు, శాస్త్రం చదువుకున్నవాడు పరమభాగవతోత్తముడయినవాడు, పాత్రత కలిగినవాడు ఇంటిముందుకు వచ్చి నిలబడి ఆయన చేతిలో ఏదయినా పెట్టే అవకాశం దొరకడమంటే జన్మజన్మాంతర సుకృతమే అది. లేకుంటే నీకు అటువంటి అతిథి దొరుకుతాడా! అదృష్టం పడితేనే అటువంటి అతిథి ఇంటికొస్తాడు. లేకపోతే నీ దగ్గరకెందుకొస్తాడు? ఎందుకు చెయ్యి చాపుతాడు? ఎందుకు స్వీకరిస్తాడు? స్వీకరించడు. అటువంటి మహాత్ములు ఇంట్లోకి అడుగుపెట్టడం చాలు. ఒక్కొక్కరికి పెట్టింది ఒక్కొక్కరి దశతిరగడానికి కారణమవుతుంది.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం_International Mother Language Day


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం International Mother Language Day Telugu Language Telugu Lipi Bhasha Baasha MotherTounge BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం International Mother Language Day Telugu Language Telugu Lipi Bhasha Baasha MotherTounge BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతీ ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలనీ భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో పదే పదే ప్రకటించింది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో పదే పదే ప్రకటిస్తోంది. 2002లో ఈ సందర్భంగా యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ తన సందేశంలో ఇలా చెప్పారు: ‘ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో స్కూల్లో తోటి విద్యార్థులతో మాట్లాడతామో, ఆ భాష మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. మాతృభాషా దినోత్సవ ప్రకటన సదర్భంగా ప్రపంచంలోని అన్ని భాషలు సమానంగా గుర్తించబడ్డాయి. ప్రతి భాషా మానవ ప్రతిస్పందనల విశిష్టతలను కలిగి ఉంటుంది. ప్రతి భాషకు సంబంధించిన సజీవ వారసత్వాన్ని మనం అనుభవించాలి’ అని ఆయన ప్రకటించారు.
ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవలసింది ఏమిటంటే - మాతృభాషలోనే భావోద్వేగాల అభివ్యక్తిని, జ్ఞానాభివృద్ధిని సమున్నతంగా సాధించగలమని. అదే సమయంలో తన వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భాషీయుడి హక్కు అని, తన భాషను కాపాడుకోవడం ద్వారానే ఇది సాధ్యమని.
భాషను బట్టే జాతి గుర్తించబడుతుంది. కాలగమనంలో రాజ్యాల సరిహద్దులు, పాలకులు మారినా ఆయా జాతుల మాతృభాషలు మారవు. పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోనే మన తెలుగు జాతిలోనే ఇటీవల రాష్ట్ర విభజన ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర-తెలంగాణలు మరొక ఉదాహరణ. ప్రాంతాలను బట్టి, ప్రాకృతికతను బట్టి ఒకే భాషాజాతిలో నెలకొనే సాంస్కృతిక వైవిధ్యాలను, వారి వారసత్వాలను కూడా కాపాడుకోవాలని యునెస్కో సందేశం విశదపరుస్తోంది. ప్రపంచంలోని మౌలిక, వైరూప్య వారసత్వాన్ని రక్షించాలనే ప్రయత్నంలో భాగంగానే భాష విషయంలో యునెస్కో కృషి చేస్తోంది. సంప్రదాయ ప్రజా సంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం - వీటిని రక్షించుకోవడం మాతృభాషల రక్షణతోనే వీలవుతుంది. మాతృభాషను కోల్పోతే వారసత్వంగా సాధించుకున్నదంతా కోల్పోయి, ఆ జాతి పూర్తిగా పరాయీకరణ పొంది గుర్తింపును, గౌరవాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా పెద్ద భాషలతోపాటు చిన్న, అతి చిన్న భాషలను కూడా కాపాడవలసి ఉంది. మన రాషా్ట్రల్లోనే ఉన్న గిరిజన భాషలను కూడా రక్షించవలసిన అవసరాన్ని మన దేశంలోని పెద్ద భాషల రాషా్ట్రలు, ప్రభుత్వాలు గుర్తించవలసి ఉంది.
చిన్న భాషలు ఎదిగినందువలన పెద్ద భాషలకు ప్రమాదం ముంచుకొస్తుందన్న వాదం తప్పు. అది ఎదగడం వల్ల ఆ భాషీయులు మాత్రమే కాక దాని చుట్టూతా ఉన్న పెద్ద భాషా జాతి కూడా ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఆ రెండు భాషల మధ్య పరస్పరం భాషపరంగా, సంస్కృతిపరంగా ఇచ్చిపుచ్చుకోవడం సహజంగా జరిగిపోతుంది. ఇందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అన్నిరంగాల్లో సమాన అవకాశాలు తప్పనిసరి. ఈ క్రమ ంలో తమను తాము అభివృద్ధి చేసుకున్న జాతులు ముందడుగు వేస్తాయి. మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న గోండుల కంటే పొరుగురాషా్ట్రల్లో ఉన్న గోండుల సంఖ్య, ప్రదే శం ఎంతో ఎక్కువగా ఉంది. తమ భాషకు లిపి ఉందని ఇంతకాలం తెలియనిస్థితిలో ఉన్న గోండులు తమ పూర్వులు వాడిన లిపిని కనుగొని ఇటీవల తమ భాషాభివృద్ధికి కృషి చేయడం మన రాష్ట్రంలో ప్రారంభమయింది. అయితే పొరుగు రాషా్ట్రల్లో పెద్దసంఖ్యలో ఉన్న గోండులు అక్కడి అధిక సంఖ్యాక భాషల లిపిగానే వాడుకుంటున్నారు. అక్కడ కూడా గోండీ లిపి విస్తరిస్తే క్రమంగా ఈ రెండు మూడు రాషా్ట్రల్లోని గోండులు తాము ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో ప్రత్యేక రాషా్ట్రన్ని కోరతారని కొందరు ఊహిస్తున్నారు. ఇదే నిజంగా జరిగితే అందుకు గోండి జాతి ప్రజలను అభినందించాల్సి ఉంటుంది. మాతృభాషా సిద్ధాంత విజయంగా దానిని భావించవలసి ఉంటుంది.
తెలుగు భాషోద్ధారకుడు గిడుగు రామమూర్తి సవరలకు వారి మాతృభాషలోనే పాఠాలు చెప్పడం, చైతన్యపరచడం వందేళ్ళ క్రితమే ఆయన శాసీ్త్రయ దృక్పథాన్ని సూచిస్తుంది. అదే దృక్పథంతోనే ఆయన తెలుగు భాషను ప్రజాస్వామ్యీకరించాల్సిన అగత్యాన్ని, అందుకు మార్గాన్ని కనిపెట్టగలిగారు. పండితుల పిడి కౌగిలిలో బిగుసుకుపోయి, కఠినమైన సమాసాల కోరలలో నలిగిపోతున్న తెలుగు సంకెళ్ళను తెంచి, ప్రజల భాషకు పట్టం గట్టేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసింది అందుకే. మాతృభాష పరిరక్షణ అంటే అన్ని అవసరాలను దాని ద్వారా తీర్చుకోవడమే. అంటే నేటి ప్రజాస్వామ్య యుగంలో అన్ని రంగాల్లో పరిపాలన, విద్యాబోధన, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అన్నిటా ప్రజల భాషకు పట్టంగట్టేందుకు కావలసిన పునాదులను గిడుగు, ఆయనతో పాటుగా గురజాడ, తాపీ ధర్మారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాసి్త్ర వంటి అనేక మంది మహనీయులు కృషి చేశారు.
సంయుక్త మద్రాసు రాష్ట్రంలో రాజకీయంగా ఎదగలేకపోయిన కొన్ని వర్గాలు ఉద్యమించడంతో ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమం జరిగింది. నిజానికి అది భాషను ఆధారంగా చేసుకుని జరిగిన ఒక ప్రాంతీయ ఉద్యమం మాత్రమే గాని, మొత్తం తెలుగు భాషా సమాజానికి సంబంధించిన ఉద్యమం కాదు. ఆంధ్ర రాష్ట్రంగా వే రుపడిన ప్రాంతం కాక తక్కిన ప్రాంతాల్లో 40 శాతం పైగా ఉన్న తెలుగువారిని వదులుకుని రావడానికి కారణాన్ని నాటికి, నేటికి సమైక్యవాద నాయకులు ఎవ్వరూ ప్రస్తావించరు. ఈ అంశంపై ఎవరూ వారిని ప్రశ్నించరు. ఫలితంగా గడచిన అరవైయేళ్ళలో తమిళనాడు అంతటా తెలుగు ప్రజలు తమ ప్రాథమిక హక్కు అయిన భాషా సాంస్కృతిక అణచివేతకు గురైనారు. పరాయీకరణ చెందారు. ఇక్కడే తెలంగాణ ఉద్యమంలో భాషా సాంస్కృతిక అంశాలను గమనించాలి. దక్షిణ భారతమంతటా విస్తరించి ఉన్న తెలుగు ప్రజల భాషలోను, సాంస్కృతికతలోను కొన్ని వైవిధ్యాలున్నాయి. వీటికి ప్రాకృతిక కారణాలతో పాటు వేర్వేరు రాజ్యాలలో పరాయి పాలనలో శతాబ్దాలుగా వుండడం కూడా కారణం. భాషా సాంస్కృతికతలకు అతీతంగా రాజకీయ అవసరాలు బలంగా ఉన్నప్పుడు పాలనాపరంగా ప్రత్యేక రాషా్ట్రల ఏర్పాటు ఉద్యమాల్ని సానుభూతితో పరిశీలించాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. నాటి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఉద్యమాన్ని కాని, నేటి తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని కానీ ఈ కోణం నుంచే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండు రాషా్ట్రల్లోనూ అధిక సంఖ్యాకులైన తెలుగు వారి భాషాభివృద్ధికి పాలకులు ఎటువంటి చర్యలు చేపట్టనున్నారనేది ముఖ్యం. గడచిన 60 యేండ్లుగా సంయుక్త రాష్ట్రంలో ఏ భాష ప్రాతిపదికగా ఆ రాష్ట్రం ఏర్పడిందో, ఆ ప్రాతిపదికనే పాలకులు అన్ని విధాలా ధ్వంసం చేసింనందువల్ల ఇప్పుడు రెండు రాషా్ట్రల్లోను మాతృభాష పరిస్థితి శోచనీయంగా ఉంది.
ప్రపంచంలోని పెద్ద భాషల్లో ఒకటైన తెలుగుకు అన్ని శాస్త్ర, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఎదగగల సమర్ధత ఉంది. ఎంతో సాహిత్య చరిత్ర ఉంది. అటువంటి దాన్ని ఎదుగూ బొదుగూ లేకుండా పాలకులు చేశారు. ఇప్పుడైనా రెండు రాషా్ట్రల్లోని ప్రభుత్వాలు తమ భాషా విధానాన్ని ప్రకటించి, ప్రజల భాషలో పరిపాలనను, విద్యను, శాస్త్ర సాంకేతిక జ్ఞానాభివృద్ధిని, సమాచార సాధనాలను శక్తివంతం చేసేందుకు పూనుకోవాలి. అప్పుడే ఇవి ప్రత్యేక రాషా్ట్రలుగా ఏర్పడినందుకు ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ఇంకా పాత ధోరణిలోనే ఉభయులూ పరిపాలన కొనసాగిస్తే అది వారి ప్రజా వ్యతిరేకతను సూచిస్తుంది. పరిణామాలు భయంకరంగా ఉంటాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాషా్ట్రల నాయకులు తమ భాషా విధానాలను స్పష్టంగా, వివరంగా ప్రకటించాల్సి ఉంది. ‘ఒక పటిష్టమైన భాషా విధానం ఉంటే, ఏ భాషనైనా మనం కాపాడుకోవచ్చునని, అభివృద్ధి చేసుకోవచ్చునని యునెస్కో ప్రకటనల్లో కూడా ఉంది. ఇంగ్లీషును నేర్చుకోవటం అంటే తెలుగును పట్టించుకోకపోవటం, తొక్కి వేయటం కాదు. ఇతర భాషలు నేర్చుకోవటం అనే అవసరాన్ని తీర్చుకోవాలన్నా అది మాతృభాష ద్వారా తీర్చుకోవటమే సరైన, శాసీ్త్రయమైన విధానం.
ఇదే సమయంలో పొరుగు రాషా్ట్రల్లోని నిలిచిపోయిన అసంఖ్యాక తెలుగువారు అక్కడికి ప్రవాసులుగా వెళ్ళినవారు కాదని, తొలినుంచి అక్కడ స్థానికంగా ఉన్నవారేనని మనం తెలుసుకోవాలి. ఈ సంగతిని మరిచిపోయేంతగా మనం వ్యవహరించాం. ఇప్పుడు అక్కడి తెలుగువారిలో తెలుగు నేర్చుకోవాలన్న ఆసక్తి మెల్లమెల్లగా ఎదుగుతోంది. దీన్ని కూడా మాతృభాషా సిద్ధాంత విజయానికి మరొక ఉదాహరణగా తీసుకోవచ్చు.
మొత్తం మీద మాతృభాషను పరిరక్షించుకోవటం అంటే కోల్పోతున్న మాతృభాషలను తిరిగి ఉద్ధరించుకోవటమంటే ప్ర జల ఆత్మగౌరవ భావనను అభివృద్ధికోరికను సూచిస్తుంది. అన్ని భాషాజాతులకు సమాన అభివృద్ధి అవకాశాలను సమకూర్చినప్పుడే ప్రజాస్వామికంగా అంతర్జాతీయ అవగాహనకు, పరస్పర అభిమానాన్ని పెంపొందించుకోడానికి దారులు ఏర్పడుతాయి.

దివ్య స్మరణ_DivyaSmarana


దివ్య స్మరణ DivyaSmarana AllisWell Antaryami Eenadu Eenadu Paper BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


దివ్య స్మరణ
‘అందరూ బాగుండాలి’ అనేది కేవలం ఓ వాక్యం కాదు. అది ఒక దివ్యమంత్రం. అన్ని ఇతర మంత్రాల కంటే, అదే గొప్పగా పనిచేస్తుంది. ప్రయోగించి చూసినవారికి దాని ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి.

‘అందరూ బాగుండాలని అనుకోవాల్సిన అగత్యం ఏమిటి’ అంటూ ఎదురుప్రశ్న వేసేవారున్నారు. ‘ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది’ అన్నది వారు వేసే రెండో ప్రశ్న.

అందరూ బాగుండాలని అనుకోవడం వెనక రహస్యం ఉంది. ‘సర్వేజనా స్సుఖినో భవంతు’ అని పెద్దల మాట. ఇతరులు బాగుండాలని కోరుకునే మనిషి, తానూ బాగుంటాడు.

ప్రతి రోజూ- తనకు సంబంధం లేని మనిషి క్షేమం కోరి హృదయపూర్వక ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం! వాటి కోసం అతడు ఎక్కడికీ వెళ్లనక్కరలేదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే, శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావ ప్రకంపనలు ఏర్పడి, ధ్యానంగా మారి, రోగాల్ని దూరం చేస్తాయి. ఇది యోగుల బోధ.

లోక క్షేమం కోరుకునేవారి బాగును భగవంతుడే చూస్తాడంటారు. ఓ నలుగురు ఇళ్లు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టుకింద ఎవరు ఉండనిస్తారు? నిజాయతీగా, నిస్వార్థంగా ఉండేవారు; నలుగురి క్షేమమూ కోరేవారే లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్యశక్తి. దాన్ని ఏ దేవుడి పేరుతోనైనా పిలుచుకోవచ్చు.

అందరికీ నీడనిచ్చే చెట్టుగా మారాలి మనిషి. పచ్చదనాన్ని కాపాడాలి. అందరికీ వెలుగునిచ్చే సూర్యుడి ముందు అతడు మోకరిల్లాలి. గాలిని కలుషితం చేయకూడదు. గుక్కెడు నీటి కోసం విలవిలలాడేవారికి చెలమగా మారాలి. పర్యావరణాన్ని కాపాడాలి. భూమిని నివాసయోగ్యం చేయాలి. ప్రేమపూర్వకమైన మాటలకు వందనం చేయాలి.

యుద్ధం చేయనంటూ వెనుతిరిగిన అర్జునుణ్ని కృష్ణుడి మాటలే మార్చాయి. విశ్వరూపాన్ని చూసి, విశ్వంలో తానూ భాగమేనని గ్రహించి, అంతిమ సత్యం తెలుసుకున్న ప్రతి నరుడూ అర్జునుడే!

వివేకానందుడి పలుకులు విశ్వమంతటా ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటాయి. అందరి కోసం గాంధీజీ చెప్పిన మాటలు, చేసిన పనులు ఎంతో గొప్పవి.

లోకహితం కోరే మానవుడు సహజంగానే దివ్యత్వాన్ని సాధిస్తాడు. అతడికి ఆ అర్హత, యోగ్యత కలిగించి నారాయణుడు లక్ష్యం నెరవేర్చుకుంటాడు. సకల జనహితమే ఈశ్వరుడికి ఇష్టమైన మంత్రం. ‘ఓం నమశ్శివాయ’ అంటే ఆయన ప్రీతి చెందుతాడో లేదో తెలియదుగాని, ఇతరుల హితం కోరే చిన్నప్రాణినైనా ఆయన ప్రేమించక మానడు.

సర్వుల హితం కోరడంలో ప్రేమ ఇమిడి ఉంటుంది. ఎవరి కోసం వారే ఉంటే, ఆ జీవితం నిష్ఫలం. దానికి ప్రాముఖ్యం, అర్థం ఉండవు. మనిషి జీవితం ఏ క్షణం నుంచి ఇంకొకరి కోసం సాగుతుందో, ఆ క్షణం నుంచే సేవాభావం వెలుగొందుతుంది. సేవ కేవలం హృదయానికి సంబంధించినదై ఉండాలి. దాన్ని ఆలోచనలు, మాటలు అనుసరించాలి. ఆలోచనను హృదయం ఎప్పుడూ మంచి దారిలోనే నడిపిస్తుంది. హృదయం ఒక దిక్సూచి. ప్రేమకు అది కేంద్రస్థానం. సేవ, ప్రేమల్ని మనిషి కళలుగా నేర్చుకోవాలి. అదే సమగ్ర జీవిత కళ. అహంకారాన్ని విడనాడాలి. ఉపనిషత్తులకు ప్రాధాన్యాల పట్టిక ఉంది. అందులో అన్నింటికన్నా ముందు ఉండేది మానవత్వమే.

సకల జీవరాశులూ చల్లగా ఉండాలన్న భావన పెరిగేకొద్దీ, మనిషి అసలైన ఆనందానికి అర్థం తెలుసుకుంటాడు. అటువంటి నామస్మరణ ఉన్న చోట, మంచి వెల్లివిరుస్తుంది. అప్పుడే రుషులు సంతోషిస్తారని, దేవతలు దీవిస్తారని ఉపనిషత్‌ వాక్యం!
- ఆనందసాయి స్వామి

పంచముఖ ఆంజనేయఆరాధన_PanchamukhaAnjaneya


పంచముఖ ఆంజనేయఆరాధన PanchamukhaAnjaneya Lord hanuman Lord Maruti Lord Anjaneya Panchamukha Anjaneya Swamy Bhakthi Pustakalu BhakthiPustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన అంటే?


శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. స్వామివారి ఆరాధనలో పంచముఖ ఆంజనేయస్వామి ప్రార్థనకు విశిష్టత వుంది. శ్రీ హనుమాన్‌ మాలా మంత్రాన్ని జపిస్తే అన్ని వ్యాధులు, పీడలు తొలగిపోతాయని పరాశర సంహితలోని ఆంజనేయచరిత్ర వివరిస్తోంది. ఐదు ముఖాలతో వుండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్‌ ప్రధానముఖంగా వుంటుంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహునికి అభీష్టసిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి వుంటుంది. కుడివైపు చివరన వుండే వరహా ముఖం దానప్రపత్తిని ఎడమవైపు చివరన వుండే హయగ్రీవ ముఖం సర్వవిద్యలను కలుగజేస్తాయి. అందుకనే పంచముఖ ఆంజనేయస్వామి దర్శనం అన్ని విధాల శుభమని పురాణాలు చెబుతున్నాయి. తుంగభద్ర నదీతీరంలో స్వామి వారి కోసం తపస్సు ఆచరించిన శ్రీరాఘవేంద్రస్వామికి ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయులుగా ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. పంచముఖ హనుమాన్‌కు వున్న పదిచేతుల్లోని ఆయుధాలు భక్తులను సదా రక్షిస్తాయి. నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తులనుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా దర్శనమిస్తారు.

హ్రస్వదృష్టి(మయోపియా)_Myopia హ్రస్వదృష్టి మయోపియా Myopia EyeMyopia Eye Sight Eye Problems Pediatric eye problems

మైనస్‌కు బెదరొద్దు!
హ్రస్వదృష్టి(మయోపియా).చిన్నతనంలోనే మొదలయ్యేచూపు సమస్య.ఇది పిల్లలతో పాటే ఎదుగుతూ వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే చదువులపై పెద్ద ప్రభావమే చూపుతుంది. బోర్డు మీద టీచర్‌ రాసిందేంటో సరిగా కనబడక, అర్థమయ్యీ కాక, తప్పుల మీద తప్పులు చేస్తుంటే చదువేం ఒంట పడుతుంది? ఈ సమస్య ఎవరికొస్తుందో తెలియదు. వచ్చిందంటే మాత్రం పోదు. దీన్ని పెరగకుండా చూసుకోవటం తప్ప పూర్తిగా నయం చేసుకోవటం అసాధ్యం. నిజానికి దీనికి చికిత్స పెద్ద కష్టమేమీ కాదు. కళ్లద్దాలు ధరిస్తే చాలావరకు చూపును సరిచేసుకోవచ్చు. కాకపోతే సరైన సమయంలో గుర్తించటం, కళ్లద్దాలు ధరిస్తూ క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవటం కీలకం. లేకపోతే మొత్తం చూపే దెబ్బతినొచ్చు.

కన్ను దృశ్యదర్శిని. అవటానికి చిన్నదే గానీ సమస్త ప్రపంచాన్ని పట్టి చూపుతుంది. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అనటం కూడా అందుకే. ఇంతటి కీలకమైన కళ్లకు.. ముఖ్యంగా పసి కళ్లకు ఇప్పుడు దూరం చూపును దెబ్బతీసే హ్రస్వదృష్టి శాపంగా మారుతోంది. దీంతో పిల్లలు కళ్లు చిట్లించి చూడటం, కనురెప్పలు కాస్త మూస్తూ.. తదేకంగా చూస్తూ.. పాఠశాలలో బోర్డు మీద రాసినవి కనబడక తెగ ఇబ్బంది పడుతుంటారు. చివరికి చదువులోనూ వెనకబడి పోతుంటారు. ఇప్పటి పిల్లలు టీవీలకు, కంప్యూటర్లకు ఎక్కువగా అతుక్కుపోతున్నారని.. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్స్‌ వంటివి విపరీతంగా చూసేస్తున్నారని.. ఇవన్నీ హ్రస్వదృష్టికి దోహదం చేస్తున్నాయని చాలామంది అనుకుంటుంటారు గానీ శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. భౌగోళిక, జన్యుపరమైన అంశాలే దీనికి బీజం వేస్తున్నాయి. పాశ్చాత్యదేశాల కన్నా మనలాంటి ఆసియాదేశాల పిల్లల మీదే హ్రస్వదృష్టి ఎక్కువగా దాడి చేస్తుండటమే దీనికి నిదర్శనం. తల్లిదండ్రులిద్దరూ హ్రస్వదృష్టి గలవారైతే పిల్లలకూ వచ్చే అవకాశం పెరుగుతుంది. నెలలు నిండకముందే పుట్టే పిల్లలకు, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేవారికి కూడా దీని ముప్పు పెరగొచ్చు. కంటికి మరీ దగ్గరగా వస్తువులను పెట్టుకొని చూడటం కూడా కొంతవరకు సమస్యకు దారితీయొచ్చు. కాబట్టి దీనిపై సరైన అవగాహన ఏర్పరచుకోవటం ఎంతో అవసరం.

ఏంటీ హ్రస్వదృష్టి
హ్రస్వదృష్టి తరచుగా చూసే సమస్యే. దీన్నే నియర్‌ సైట్‌, మయోపియా అనీ అంటారు. దీని బారినపడ్డవారికి దగ్గరి వస్తువులు బాగానే కనబడతాయి గానీ దూరంగా ఉన్నవి స్పష్టంగా కనబడవు. మనదేశంలో కంటి సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే పిల్లల్లో మూడింట రెండొంతుల మంది హ్రస్వదృష్టితో బాధపడుతున్నవారే. ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది. హ్రస్వదృష్టికి ప్రధాన కారణం- కనుగుడ్డు సైజు పెరగటం. మన కంట్లో ముందువైపు కనిపించే నల్లగుడ్డు, దాని వెనక లెన్సు ఉంటాయి. బయటి నుంచి వచ్చే కాంతి కిరణాలను ఈ లెన్సు- కనుగుడ్డు వెనకాల ఉండే రెటీనా పొర మీద సరిగ్గా కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. దీంతో ఆయా దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి. ఈ ప్రక్రియలో కనుగుడ్డు, రెటీనా పొర మధ్య ఉండే దూరం (ఆక్సియల్‌ లెంగ్త్‌) చాలా కీలకం. సాధారణంగా పుట్టినపుడు సుమారు 17 మిల్లీమీటర్లుండే ఈ దూరం పెద్దయ్యాక దాదాపు 24 మిల్లీమీటర్ల వరకు చేరుకుంటుంది. ఇది తగ్గినా, పెరిగినా చూపు మీద గణనీయమైన ప్రభావం పడుతుంది. ఒక మిల్లీమీటరు దూరం పెరిగినా చూపు పవర్‌ (డయాప్టర్‌) మైనస్‌ 3 అవుతుంది. అదే మిల్లీమీటరు దూరం తగ్గితే పవర్‌ ప్లస్‌ 3 అవుతుంది. నిజానికి చాలామందికి పుట్టుకతోనే ప్లస్‌ 3 పవర్‌ ఉంటుంది. అసలు చిక్కేంటంటే- వయసు పెరుగుతున్నకొద్దీ కంటి పొడవు, ఆకారం మారుతూ వస్తుండటం. కనుగుడ్డు పొడవు పెరుగుతున్నకొద్దీ నల్లగుడ్డుకూ రెటీనా పొరకు మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. దీంతో ప్లస్‌ పవర్‌ నెమ్మదిగా తగ్గుతూ.. సున్నాకు చేరుకుంటుంది. దీన్నే ఇమెట్రోపైజేషన్‌ అంటారు. కనుగుడ్డు సైజు ఇంకా పెరుగుతూ వస్తే మైనస్‌ పవర్‌ మొదలవుతుంది. ఇదే హ్రస్వదృష్టికి మూలం. కనుగుడ్డు, రెటీనా పొర మధ్య దూరం పెరిగినపుడు కాంతి కిరణాలు రెటీనా మీద పడకుండా.. కాస్త ముందుభాగంలోనే ఆగిపోతాయి. దీంతో దూరం వస్తువులు సరిగా కనబడవు. అంతా మసక మసకగా అనిపిస్తుంది. దగ్గరివి మాత్రం బాగానే కనబడతాయి.

నిర్ధరణ
హ్రస్వదృష్టిని చాలావరకు లక్షణాల ఆధారంగానే అనుమానించొచ్చు. అయితే కంటిని పూర్తిగా పరీక్షించి సమస్యను నిర్ధరించటం చాలా అవసరం. అందుకే డాక్టర్లు ముందుగా కంటిని నిశితంగా పరిశీలించి మెల్లకన్ను ఏమైనా ఉందా? కంటి వెనకభాగం ఎలా ఉంది? అనేవి చూస్తారు. హ్రస్వదృష్టి విషయంలో కంట్లో సైక్లోపెంటలేట్‌ చుక్కల మందు వేసి పరీక్షించటం చాలా కీలకం. ఈ మందుతో తాత్కాలికంగా కంటిపాప పెద్దదవుతుంది. సీలియరీ కండరాలు వదులవుతాయి. అనంతరం రెటీనోస్కోపీతో పరీక్ష చేస్తే దృష్టి దోషం కచ్చితంగా తెలుస్తుంది. కంటి వెనకాల భాగం ఎలా ఉందో కూడా చూస్తారు. మిగతావన్నీ బాగానే ఉండి దృష్టి దోషం మైనస్‌ పవర్‌లో ఉంటే హ్రస్వదృష్టిగా నిర్ధరిస్తారు. సమస్య ఒక్క కంట్లోనే ఉందా? రెండు కళ్లలో ఉందా? సమస్య తీవ్రత ఎలా ఉంది? అనేవి కూడా ఇందులో బయటపడుతుంది.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
హ్రస్వదృష్టి ఉన్నా కూడా దాన్ని గుర్తించకుండా ఉండిపోయే పిల్లలూ కనబడుతుంటారు. ముఖ్యంగా ఒక కంట్లోనే దోషం ఉన్నప్పుడు.. మరో కన్ను బాగానే ఉంటుంది. దీంతో చూపులో పెద్ద తేడా కనబడదు. ఎప్పుడైనా అనుకోకుండా కంటికి ఏదైనా అడ్డు పడ్డప్పుడు మసక మసకగా అనిపించి సమస్య బయటపడొచ్చు. అప్పటికే సమస్య ముదిరిపోయి ఉండొచ్చు కూడా. పవర్‌ ఎక్కువగా ఉన్నవారికి.. ఒక కంట్లో పవర్‌ ఉండి, మరో కంట్లో ఎలాంటి పవర్‌ లేనివారికి సమస్యను సకాలంలో గుర్తించకపోతే చివరికి దృష్టిమాంద్యానికి దారితీయొచ్చు. దోషం ఉన్న కన్ను క్రమేపీ కనిపించకుండా పోతూ.. ఆఖరికి దృష్టిమాంద్యంలోకి (ఆంబ్లియోపియా) వెళ్లిపోవచ్చు. అప్పుడు అద్దాలు ఇచ్చినా చూపు తిరిగి మెరుగుపడదు. దృష్టిదోషాలు గల పిల్లల్లో సుమారు 5 శాతం మందికి ఆంబ్లియోపియా వచ్చే అవకాశముంది. ఏడాదికోసారి కంటి పరీక్ష చేయటం ద్వారా ఈ స్థితి రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా బడిలో చేర్పించే సమయంలోనే పిల్లలకు సంపూర్ణ కంటిపరీక్ష చేయించటం ముఖ్యమనే సంగతిని అంతా గుర్తించాలి.

ప్రధాన చికిత్స అద్దాలే
హ్రస్వదృష్టి గలవారికి ఆయా పవర్‌కు అనుగుణమైన అద్దాలు వాడితే చూపు బాగా మెరుగవుతుంది. తొలిసారి అద్దాలు వాడటం మొదలెట్టిన తర్వాత మూడు, నాలుగు నెలలకు మరోసారి పరీక్ష చేసి చూస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకపోతే అద్దాలను అలాగే కొనసాగించొచ్చు. ఏదైనా తేడా కనబడితే పవర్‌ మార్చాల్సి ఉంటుంది. తర్వాత ఆర్నెల్లకోసారి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అద్దాలు ఇష్టం లేకపోతే, నాట్యం వంటివి చేసేవారికి, ఆటలాడేవారికి కాంటాక్ట్‌ లెన్సులు ఇవ్వొచ్చు. అయితే పిల్లలు కాంటాక్ట్‌ లెన్సులు ధరించటం కష్టం. రోజూ తీసి పెట్టటం వల్ల ఇన్‌ఫెక్షన్ల వంటివి తలెత్తొచ్చు. అందువల్ల చాలావరకు అద్దాలకే ప్రాధాన్యం ఇస్తారు. దృష్టిదోషం స్థిరపడిన తర్వాత హ్రస్వదృష్టిని పూర్తిగా నయం చేయటానికి లేసిక్‌ శస్త్రచికిత్స బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 18 ఏళ్ల తర్వాతే.. అదీ ఏడాది వరకు పవర్‌ మారకుండా ఉంటేనే చేస్తారు. నిజానికి ఒకసారి కంటి సైజు పెరిగితే దాన్ని తగ్గించటమనేది అసాధ్యం. అందుకే లేసిక్‌ సర్జరీలో కార్నియా మందాన్ని, వంపును తగ్గించటం ద్వారా మాత్రమే చూపును సరిచేస్తారు. అయితే ఇది అందరికీ పనికిరాదు. కార్నియా మందం పలుచగా ఉన్నవారికి దీన్ని చేయటం కుదరదు.

* కార్నియా మందం పలుచగా గలవారికి కంటి లోపలే లెన్సును అమర్చే ఐసీఎల్‌ ప్రక్రియతో హ్రస్వదృష్టిని శాశ్వతంగా నయం చేయొచ్చు. సమస్య చాలా తీవ్రంగా గలవారికి.. అంటే మైనస్‌ పవర్‌ 9 దాటినవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే నల్లగుడ్డుకు, కంటిపాపకు మధ్య దూరం తక్కువగా గలవారికి దీన్ని చేయటం కుదరదు.

ప్రధానంగా 3 రకాలు
తీవ్రతను బట్టి హ్రస్వదృష్టిని 3 రకాలుగా విభజించుకోవచ్చు. మైనస్‌ పవర్‌ 2 వరకు ఉంటే మామూలు (మైల్డ్‌), మైనస్‌ 2-5 వరకు ఒక మాదిరి (మోడరేట్‌), మైనస్‌ 5 కన్నా ఎక్కువుంటే తీవ్ర (హై) హ్రస్వదృష్టిగా పరిగణిస్తారు. చాలామంది మైనస్‌ పవర్‌ పెరుగుతోంటే లోపల కన్ను దెబ్బతింటుందేమోనని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. అద్దాలతో ఎలాంటి హ్రస్వదృష్టినైనా సరిదిద్దుకోవచ్చు. కానీ సరైన అద్దాలు వాడకపోతేనే ఇబ్బంది.

అనుమానించేదెలా?
* హ్రస్వదృష్టి పిల్లలకు స్కూలులో బోర్డు మీద రాసినవి సరిగా కనిపించవు. దీంతో బోర్డు దగ్గరికి వెళ్లి రాసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.
* టీవీకి దగ్గరగా కూచొని చూస్తుంటారు. పుస్తకం కంటికి దగ్గరగా పెట్టుకొని చదువుతుంటారు.
* దూరంగా ఉన్నవాటిని చూడాలంటే కళ్లు చిట్లించి, తదేకంగా చూస్తుంటారు.
- ఇలాంటివి గమనిస్తే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

ఆర్నెల్లకోసారి కంటి పరీక్ష
శరీర ఎదుగుదల ఆయా వయసుల్లో కాస్త ఉద్ధృతంగా సాగుతుంటుంది. ఈ క్రమంలో కన్ను సైజు కూడా వేగంగా పెరుగుతూ వస్తుంది. పిల్లలకు 13 ఏళ్లు వచ్చేసరికి కనుగుడ్డు చాలావరకు ఎదుగుతుంది. ఆ తర్వాతా పెరగొచ్చు గానీ అంత ఎక్కువగా ఉండదు. మొత్తమ్మీద 18-20 ఏళ్లు వచ్చేసరికి కన్ను సైజుతో పాటు దృష్టి కూడా స్థిరపడిపోతుంది. అందుకే హ్రస్వదృష్టి చాలావరకు చిన్నవయసులో.. 13 ఏళ్లలోపే బయటపడుతుంటుంది. అయితే కొందరికి ఒక కంట్లోనే సమస్య ఉండొచ్చు. ఇంకొందరికి ఒక కంట్లో ప్లస్‌ పవర్‌, మరో కంట్లో మైనస్‌ పవర్‌ ఉండొచ్చు (అనైసోమెట్రోపియా). దీంతో సమస్యను పోల్చుకోవటం కష్టమవుతోంది. అందువల్ల పుట్టిన తొలి సంవత్సరంలోనే పిల్లల కంటి డాక్టర్‌తో ఒకసారి విధిగా పరీక్ష చేయించటం మంచిది. అంతేకాదు, దృష్టిదోష లక్షణాలేవీ లేకపోయినా కూడా పిల్లలకు 13-14 ఏళ్లు వచ్చేవరకూ.. అంటే దృష్టి స్థిరపడేవరకూ ఏటా కంటి పరీక్ష చేయించటం తప్పనిసరి. ఒకసారి మెదడులో దృష్టి వ్యవస్థ స్థిరపడిపోతే దాన్ని సరిదిద్దటం అసాధ్యం. కాబట్టి పిల్లలకు క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయిస్తే సమస్య ఏదైనా ఉంటే వెంటనే పట్టుకోవచ్చు. దృష్టిదోషం గల పిల్లలకైతే.. ముఖ్యంగా హ్రస్వదృష్టి గలవారికి ఆర్నెల్లకోసారి విధిగా కంటి పరీక్ష చేయించాలి. ఎందుకంటే కన్ను సైజు పెరుగుతుంటే దానికి అనుగుణంగా అద్దాల పవర్‌ కూడా మార్చాల్సి ఉంటుంది. లేకపోతే అద్దాలు ధరిస్తున్నా కూడా సరిగా కనబడక పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా 18 ఏళ్ల వరకూ క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించాలి.

ముదరకుండా జాగ్రత్తలు
హ్రస్వదృష్టికి అద్దాలు వాడుతున్నా సమస్య ముదరకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. సాధారణంగా ఇలాంటి పిల్లలకు కంటికి మరీ దగ్గరగా పుస్తకాలు పెట్టుకొని చదవటం వంటివి అలవాటై ఉంటాయి. దీంతో అద్దాలు పెట్టుకున్నా అలాగే చేస్తుంటారు. ఇలాంటి అలవాటు నుంచి పిల్లలను మాన్పించాలి. అలాగే మరీ ముందుకు వంగి రాయటం, చదవటం చేయకూడదు. పుస్తకం మీద వెలుతురు సరిగా పడేలా చూసుకోవాలి. టీవీలు, కంప్యూటర్ల వంటివి కొంతసేపు చూడటంలో తప్పులేదు. కాకపోతే తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఇటీవలి కాలంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌ వాడకానికి అలవాటు పడుతుండటం పెద్ద సమస్యగా మారింది. వీటిని అదేపనిగా ముఖానికి దగ్గరగా పెట్టుకొని వీడీయోగేమ్స్‌ ఆడటం, వీడియోలు చూడటం మంచిది కాదు. దీంతో కంట్లోని కండరాలు ఆయా దూరాలకు అలవాటుపడి, కనుగుడ్డు పెరగటం ప్రేరేపితమై మైనస్‌ పవర్‌ ఎక్కువయ్యే అవకాశముంది. ఎప్పుడూ ఇంట్లో, నీడపట్టున ఉండేవారితో పోలిస్తే ఆరుబయట గడిపే పిల్లలకు హ్రస్వదృష్టి పెరగటం తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల పిల్లలను కనీసం రోజుకు 2, 3 గంటలైనా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి.

* కొత్తగా ఆర్థోకెరటాలజీ వంటి కొత్త విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రాత్రంతా నల్లగుడ్డు మీద కాంటాక్ట్‌ లెన్సులను పెట్టి, తెల్లారాక తీసేస్తారు. దీంతో అద్దాలు లేకుండానే చదవటం వంటి పనులు చేయటానికి వీలవుతుంది. కాంటాక్ట్‌ లెన్సు పెట్టటం వల్ల కార్నియా వంపు మారి చూపు మెరుగవుతుంది. అయితే దీని ప్రభావం ఒక రోజే ఉంటుంది. అందువల్ల వీటిని ప్రతి రాత్రి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా అధ్యయనాలు సాగుతున్నాయి. మనదగ్గర ఇదింకా అందుబాటులోకి రాలేదు.

* అట్రోపిన్‌ చుక్కల మందుతో హ్రస్వదృష్టి మరింత ముదరకుండా చూడటంపైనా ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ చుక్కల మందు వేసినపుడు కంట్లోని సీలియరీ కండరాల సంకోచ వ్యాకోచాలు ఆగిపోతాయి. దీంతో దూరంగా ఉన్నవి బాగానే కనబడతాయి గానీ దగ్గరివి మసక మసకగా కనబడతాయి. అప్పుడు బైఫోకల్‌ అద్దాలు ఇవ్వటం ద్వారా హ్రస్వదృష్టి ముదరకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు. అట్రోపిన్‌ మోతాదును తగ్గించటం ద్వారా దగ్గరి వస్తువులు కనబడకపోవటం వంటి దుష్ప్రభావాల బారినపడకుండా చూసుకోవటం మీదా అధ్యయనాలు సాగుతున్నాయి.

ఏడుకొండలవాడికి ఏ నైవేద్యం_Prasadam
ఏడుకొండలవాడికి  ఏ నైవేద్యం Prasadam Naivedyam Varieties of Prasad TTD Tirumala Tirupathi Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


ఏడుకొండలవాడికి
ఏ నైవేద్యం... ఎప్పుడు? ఎలా?తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి... చక్కెర పొంగలి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు. మరి... వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా? ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక పలహారం! రుతువులను బట్టి ఆహారం! సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదం వండేవారు వంట సమయంలోనూ, తర్వాతా వాసన సోకకుండా ముక్కుకు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. స్వామికి సమర్పించేదాకా బయటి వారెవరూ దాన్ని చూడరాదు.

నైవేద్యం పెట్టేది ఇలా...
♦ ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు.
♦ గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు.
♦ స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు.
♦ విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి దళాలను అభికరిస్తారు.
♦ కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడిచేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు.
♦ చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే.
♦ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న వివిధ పత్రాలు కలిపిన నీటిని సమర్పిస్తారు.
♦ నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.
♦ రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు.
♦ ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం
♦ పది, పదకొండు గంటల మధ్య రాజభోగం
♦ రాత్రి ఏడు – ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.
♦ తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తుకు అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.
♦ నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.
♦ ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు.

ఉదయం బాలభోగం
♦ మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, రవ్వ కేసరి
మధ్యాహ్నం రాజభోగం
♦ శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం
రాత్రి శయనభోగం
♦ మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం (వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)
అల్పాహారాలు
లడ్డు, వడ, అప్పం, దోసె.. స్వామి పలహారాల జాబితా ఇదీ...
♦ ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని ఆవుపాలు సమర్పిస్తారు
♦ తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు
♦ ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది
♦ అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది
♦ సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు
♦ అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!
♦ అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గుడాన్నం) పెడతారు.
♦ ఇక పవళించే సమయం దగ్గర పడుతుంది.
♦ ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

సకల దేవతా స్వరూపం_Kamadhenu
సకల దేవతా స్వరూపం Kamadenu Cow Gomatha Aavu kamadhenu KamadhenuPooja Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu
సకల దేవతా స్వరూపం

సకల దేవతా స్వరూపం Kamadenu Cow Gomatha Aavu kamadhenu KamadhenuPooja Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


అందాల తులసి కోట_GodessTulasi
అందాల తులసి కోట GodessTulasi Tulasi TulasiVanam TulasiMaa TulasiGodess BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakau BhaktiPustakalu

అందాల తులసి కోట

బృందావని, కృష్ణజీవని, నందిని, విశ్వపావని, బృంద, పుష్పరాస... ఇవన్నీ తులసీమాత పేర్లే. హిందువులకి తులసి ఆరాధ్య దైవం. దేశవ్యాప్తంగా తులసిని పరమ పవిత్రమైనదిగా పూజిస్తారు. మిగిలిన మొక్కలకన్నా ప్రత్యేకంగా కనిపించేలా దానికో చక్కని కోటను కట్టి ఆ కోటకు రంగులేసి అలంకరించడంతోబాటు, ఆ కోటను రకరకాల ఆకారాల్లో కట్టి, అందులో మొక్కను ప్రతిష్ఠించి, రోజూ దీపం పెట్టి పూజిస్తారు. గుడియా వైష్ణవులయితే కార్తీకమాసంలో తులసీవివాహం కూడా జరిపిస్తారు.

తులసి శ్రీమహాలక్ష్మి అంశ అనీ, శాపవశాత్తూ భూలోకంలో పుట్టి, విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై, ‘శంఖుచూడుడు అనే రాక్షసుణ్ణి వివాహం చేసుకున్నాక, ఆ శ్రీహరితో కల్యాణం జరుగుతుంది’ అని వరమిచ్చాడనేది ఐతిహ్యం. భార్య పవిత్రంగా ఉన్నంతవరకూ శంఖుచూడుడికి మరణం లేదనే వరం ఉంది. రోజురోజుకీ అతని ఆగడాలు శృతిమించడంతో, శ్రీహరి ఆ రాక్షసుడి వేషంలో తులసిని పొంది, అతన్ని సంహరిస్తాడు. అప్పుడు తులసి తనకు కళంకం తీసుకొచ్చింది సాక్షాత్తూ మహావిష్ణువే అయినా క్షమించకుండా శిలైపొమ్మని శాపమిస్తుంది. అంతట విష్ణువు ఆమె గత జన్మ వృత్తాంతం చెప్పి, ఆమె శరీరం గండకీనదిగా ప్రవహిస్తుందనీ, అందులో తాను సాలగ్రామంగా ఉంటాననీ, ఆమె శిరోజాలు తులసి మొక్కగా మారి, పూజలందుకునేలా వరమిచ్చాడనేది దేవీ భాగవత వ్యాఖ్యానం.
ఆ విధంగా శ్రీహరి సన్నిధానాన్ని చేరుకున్న ఆ శ్రీమహాలక్ష్మి అంశ కాబట్టే తులసిని విశ్వపావనిగా పూజిస్తారు.

ఔషధాల తులసికోట!
తులసి పూజనీయమైనది మాత్రమే కాదు, ఔషధపరమైనదిగానూ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. ఇంట్లో పెంచుకునే మిగిలిన మొక్కలకీ తులసి మొక్కకీ వ్యత్యాసం ఉంది. ఇతర మొక్కలన్నీ రాత్రివేళల్లో ఆక్సిజన్‌ని పీల్చుకుని, పగటివేళల్లో ప్రాణవాయువుని విడుదల చేస్తాయి. కానీ రాత్రీపగలూ తేడా లేకుండా ఆక్సిజన్‌ని విడుదల చేయడమే తులసి గొప్పతనం. ఆ కారణంతోనే తులసిని ఔషధమొక్కగా భావించి ఇంటి ముందు పెంచుతారు. దాని ఆకుల్లో యూజెనాల్‌ అనే పసుపురంగు నూనె ఉంటుంది. ఇది బాష్పవాయువు రూపంలో గాల్లోకి విడుదలవుతూ బ్యాక్టీరియా, క్రిమికీటకాలు దగ్గరికి రాకుండా చేస్తుంది. తులసి గాలి పీల్చితే ఆరోగ్యమని చెప్పడంలోని అంతర్లీన సూత్రం ఇదే. అందుకే తులసిని ఇంటిముందో వెనక పెరట్లో పెంచుతారనేది శాస్త్రీయ కథనం.

ఎవరు ఏ కారణంతో పెంచుకున్నా తులసి ప్రత్యేకమైనది. దాన్ని పెంచుకునే కోట అంతే ప్రత్యేకంగానూ అందంగానూ ఉండాలన్నదే నేటి గృహాలంకరణ నిపుణుల అభిప్రాయం. అందుకోసమే తులసి కోటల్ని చెక్క, పాలరాయి, టెర్రకోట... వంటి వాటితో రకరకాల ఆకారాల్లో రూపొందించి, ఆపై రంగురాళ్లతో అలంకారాలూ చేస్తున్నారు. ఒకప్పుడు దీపంకోసం కిందిభాగంలో చిన్న గూడు కట్టేవారు. ఇప్పుడు దీపంతోబాటు ఇతర పూజాసామగ్రి పెట్టుకునేలానూ ఏర్పాటుచేస్తున్నారు. కోటలోనే మందిరం ఉన్నట్లూ కడుతున్నారు. అటు సంప్రదాయ, ఇటు ఆధునిక నిర్మాణశైలి కలగలిపి మరీ వీటిని నిర్మిస్తున్నారు. మొత్తమ్మీద తమ తులసికోట వినూత్నమైన డిజైన్లలో ఆకర్షణీయంగా కనిపించాలన్నదే గృహాలంకరణ ప్రియుల అభిమతం కూడా.
మీ ఇంటి బడ్జెట్_HomeBadgetమీ ఇంటి బడ్జెట్ HomeBudget Budget for home Budget BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu
మీ ఇంటి బడ్జెట్


మీ ఇంటి బడ్జెట్ HomeBudget Budget for home Budget BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu


మట్టి మేలు..తల పెట్టవోయ్‌_ClayKitchenwere

మట్టి మేలు..తల పెట్టవోయ్‌ClayKitchenwere Claypots Clayhomeware Clayclay kitchen set clay utensils clay pots for cooking BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu

మట్టి మేలు..తల పెట్టవోయ్‌!


మట్టిపాత్రల్లో తింటే మంచిదని అంటారు నిజమేనా?
రాగిపాత్రల్లో మంచినీళ్లు తాగడం.... ఇనుప మూకిట్లో వండుకోవడం వల్ల ప్రయోజనాలు వాస్తవమేనా..
అల్యూమినియం ఆహారంలో కలిస్తే అనారోగ్యకారకమా?
మరి నూనె పీల్చుకోని నాన్‌స్టిక్‌ పాత్రల మాటేంటి?...

పెరుగుతున్న ఆరోగ్యస్పృహలో భాగంగా... ఏం తింటున్నాం అనేదాంతోపాటు ఎందులో తింటున్నాం అనే ఆలోచన కూడా అందరిలో పెరుగుతోంది. మట్టిపాత్రల జమాన పోయి వంటని వేగవంతం చేసే కుక్కర్ల వాడకంలోకి ఎప్పుడో వచ్చాం. అడుగంటని నాన్‌స్టిక్‌ పాత్రలు... సర్జికల్‌ మెటల్స్‌తో చేసిన వంట పాత్రల ట్రెండ్‌ మనకు తెలిసిందే. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో మట్టిపాత్రల్లో వండి తింటే మంచివనే ప్రచారం ఊపందుకుంది.


గట్టి శరీరానికి మట్టి...

మట్టి మేలు..తల పెట్టవోయ్‌ClayKitchenwere Claypots Clayhomeware Clayclay kitchen set clay utensils clay pots for cooking

మట్టిపాత్రల్లో చేసిన వంటకం ఆరోగ్యానికి మంచిదే. అందులో సందేహం లేదు. ఆయుర్వేదం ప్రకారం... మట్టిపాత్రలో వంటకం పోషకాలని కోల్పోకుండా చేస్తుంది. అలాగే పదార్థాల సహజసిద్ధ సువాసనలని కోల్పోకుండా చేయడంలోను, నాణ్యత తగ్గకుండా చేయడంలోను ముందుంటుంది. ముఖ్యంగా మట్టిపాత్రలకుండే సన్నని రంధ్రాలు(పోరస్‌).. వంటకంలోని ప్రతి అణువుకి వేడిని, తేమని, మట్టి పరిమళాన్ని అందిస్తాయి. పాత్ర, పదార్థాలు నెమ్మదిగా వేడెక్కి మాడిపోకుండా ఉంటాయి. దాంతో ఒక రకమైన ప్రత్యేకమైన రుచి వస్తుంది. శాకాహారం, మాంసాహారం రెండింటికి ఈ మట్టిపాత్రలు మంచివే. మాంసాహారం వండినప్పుడు ప్రొటీన్లు పూర్తిగా విచ్ఛిన్నమై కూరల రుచి మరింత పెరుగుతుంది. సాధారణంగా మట్టికి క్షార స్వభావం ఉంటుంది కాబట్టి... పుల్లని పదార్థాలు వండినప్పుడు వాటితో చర్యపొంది పీహెచ్‌ స్థాయిలు సమంగా ఉండేటట్టు చేస్తుంది. ఈ క్రమంలో శరీరానికి క్యాల్షియం, పాస్ఫరస్‌, మెగ్నీషియం, ఇనుము, సల్ఫర్‌ వంటి పోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలకి తగినంత తేమ అందడం వల్ల అధికంగా నూనె, కొవ్వులని వాడాల్సిన అవసరం ఉండదు. మట్టిముంతల్లో తోడుపెట్టిన పెరుగు రుచి చాలా బాగుంటుంది. చేపలు వంటి ఘాటైన వాసన ఉండే పదార్థాలు మట్టిపాత్రల్లో వండితే రుచి, సువాసన రెండూ ఉంటాయి. అయితే పెద్దమొత్తంలో వంటలు వండేటప్పుడు మట్టిపాత్రలని ఉపయోగించలేం. ఉపయోగించినా శుభ్రత పెద్ద సమస్య.
జాగ్రత్తలు: రంగు పూయని మెరుపులేని మట్టి పాత్రలు వంటకానికి మంచివి. ఒకవేళ రంగు పూసినట్టుగా అనుమానం ఉంటే అరగంట ముందుగా నీళ్లలో నానబెట్టి రంగుపోయిన తర్వాత అప్పుడు వాడుకుంటే మంచిది.


ఇనుములాంటి శరీరానికి...

మట్టి మేలు..తల పెట్టవోయ్‌ClayKitchenwere Claypots Clayhomeware Clayclay kitchen set clay utensils clay pots for cooking

ఇవి జీవితకాలం మన్నుతాయి. వాడకానికి మంచివి. కానీ వీటితో వచ్చిన ఇబ్బందల్లా ... బరువు. శుభ్రం చేయడం కష్టం. త్వరగా తుప్పుపడతాయి. ఈ ఇబ్బందులు తప్పించి.. ఇనుము బాండీల్లో వంట మంచిదే. ఇనుముతో చేసిన పాత్రల్లో వండినప్పుడు ఇనుము వంటకాల్లో చేరి ఐరన్‌ లోపం రాకుండా ఉంటుందని క్లెమ్‌సన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువు, తుప్పు వంటి సమస్యలు రాకుండా ఆధునిక పద్ధతుల్లో ఎనామిల్‌, సెరామిక్‌ పూతలు పూసి ఈ పాత్రలని డిజైన్‌ చేస్తున్నారు. వీలైతే మన వంటింట్లోకి వీటికి స్థానం కల్పించుకోవడం మంచిది. ఇనుము పాత్రల్లో వంటకం పిల్లల్లో హిమోగ్లోబిన్‌ స్థాయిలని కూడా పెంచుతుంది.
జాగ్రత్తలు: ప్రతిరోజూ వాడకం కంటే.. వారంలో మూడుసార్లు వండితే చాలు. పుల్లని రుచి ఉండే కూరలు వండేటప్పుడు అవి ఇనుముతో చర్యపొంది వాటి రుచి మారడానికి ఆస్కారం ఉంటుంది. వాడిన తర్వాత గాఢత లేని సబ్బునీటితో కడిగి ఎండబెట్టి... కొద్దిగా వంటనూనె రాసి ఉంచితే తుప్పు పట్టకుండా ఉంటాయి. రాగి పాత్రల్లో నిల్వ చేసినట్టుగా ఇనుము పాత్రల్లో నీటిని నిల్వ ఉంచకూడదు. రుచిని, స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. వండిన తర్వాత కూడా స్టీల్‌, గ్లాసు పాత్రల్లోకి వంటకాలని మార్చుకోవాలి.
టమాటా సాస్‌ వేసి చేసే వంటకాలని అల్యూమినియం పాత్రల్లో వండితే ఆ లోహం శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.


మట్టి మేలు..తల పెట్టవోయ్‌ClayKitchenwere Claypots Clayhomeware Clayclay kitchen set clay utensils clay pots for cookingస్టీల్‌ మంచిదే....

తళతళా మెరిసే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలు వంటకానికి సౌకర్యంగా ఉండటంతోపాటూ... శుభ్రం చేసుకోవడం తేలిక. వీటితో హాని కూడా తక్కువే. స్టీల్‌.. విభిన్న లోహాల సమ్మేళనం. ఇందులో పదిశాతం నికెల్‌ ఉంటే.. 18శాతం క్రోమియం ఉంటుంది. నికెల్‌ పాత్రలని మెరిసేటట్టు చేస్తే, క్రోమియం పాత్రలకు తుప్పు పట్టకుండా చేస్తుంది. సాధారణంగా అల్యుమినియం లేదా రాగి పాత్రలపై ఈ పూత పూస్తారు. ఇలా చేయడం వల్ల పాత్రలని వేడిచేయడం తేలిక. స్టీల్‌ పాత్రల్లో వండిన పదార్థాలకు ఎటువంటి హాని ఉండదు. ఏరకం వంటకాలైనా ఈ పాత్రల్లో వండుకోవచ్చు. ఈ పాత్రలు పదార్థాల రంగు, రుచిని పెద్దగా ప్రభావితం చేయవు.
జాగ్రత్తలు: చాలా అరుదుగా మాత్రమే నికెల్‌ వంట పదార్థాల్లో కలవడానికి ఆస్కారం ఉంది. అలా జరిగితే నికెల్‌ అలెర్జీ రావొచ్చు. కానీ ఈ పరిస్థితి అరుదే.


మట్టి మేలు..తల పెట్టవోయ్‌ClayKitchenwere Claypots Clayhomeware Clayclay kitchen set clay utensils clay pots for cookingనూనె తక్కువ పడుతుంది...

టైటానియం గురించి మనం ఎక్కువగా విని ఉండం. ఈ లోహాన్ని శస్త్రచికిత్సల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వైద్య పరికరాల తయారీలో, దంతాలకు వేసే క్లిప్పుల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. పెద్దగా బరువు ఉండదు... దృఢంగా ఉంటుంది. ఈ సుగుణాల వల్లే ఈ లోహాన్ని వంటింటి పాత్రల తయారీలో ఉపయోగిస్తున్నారు. టైటానియంకు పదార్థాలు అంటుకోవు. దాంతో నూనె వాడకం తగ్గుతుంది. పోషకాలు, వంటకాల సహజసిద్ధ పరిమళం కోల్పోకుండా వండుకోవచ్చు. అల్యూమినియం పాత్రలపై టైటానియంని పైపూతగా వేసి ఈ పరికరాలని తయారుచేస్తుంటారు. అల్యూమినియం పదార్థాల్లోకి పోకుండా ఈ టైటానియం అడ్డుకుంటుంది. వీటిని శుభ్రం చేయడం తేలిక.


వంటకి.. నీళ్ల నిల్వకి

మట్టి మేలు..తల పెట్టవోయ్‌ClayKitchenwere Claypots Clayhomeware Clayclay kitchen set clay utensils clay pots for cooking

మన శరీరానికి కావాల్సిన అత్యవసర పోషకాల్లో రాగి(కాపర్‌) కూడా ఒకటి. కానీ తక్కిన లోహాలతో పోలిస్తే రాగి పాత్రల్లో వంటకం క్లిష్టమైన అంశమే అంటున్నాయి పరిశోధనలు. కారణం... మనకి రోజుకి 900మిల్లీగ్రాముల రాగి అవసరం అవుతుంది. దానికి పదిరెట్ల ఎక్కువగా అందినా మన శరీరం తట్టుకోగలుగుతుంది. నేరుగా వంటల కోసం వాడటం కన్నా... నీళ్లు నిల్వ చేసుకోవడం ఉత్తమం. వంటలు చేసినా శుభ్రత చాలా ముఖ్యం.


అల్యూమినియం తగ్గించాల్సిందే..

వంటల్లో అల్యూమినియం పాత్రలని మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ గడిచిన ఐదేళ్లలో వెలువడిన అధ్యయనాల అల్యూమినియం పాత్రల వాడకాన్ని తగ్గించమని చెబుతున్నాయి. కారణం.. శరీరంలోకి చేరిన అల్యూమినియం తెచ్చే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. మన శరీరానికి హాని చేసే లోహాల జాబితా చేస్తే అందులో అల్యూమినియం ముందు ఉంటుంది.
- డాక్టర్‌ జానకీశ్రీనాథ్‌, పోషకాహార నిపుణులు

మట్టి మేలు..తల పెట్టవోయ్‌ClayKitchenwere Claypots Clayhomeware Clayclay kitchen set clay utensils clay pots for cooking BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu


MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం