MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఏడు రోజుల్లో.. బరువు తగ్గండిలా..._weight loss

weight loss
















డు రోజుల్లో.. బరువు తగ్గండిలా...

బరువు తగ్గడానికి ఎలాంటి డైట్‌ తీసుకోవాలో చెప్పండి అని చాలా ఉత్తరాలు వస్త్తున్నాయి. ముఖ్యంగా ఏడాది చివరకు వచ్చేసరికి బరువు తగ్గడం అత్యంత ముఖ్యమైన పనిగా మారింది. కనీసం కొత్త ఏడాదిలోనైనా బరువు తగ్గాలని ప్రతినబూనుతారు. నిజానికి, బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటాయి. అందరికీ ఒకే విధమైన ఆహారం పడకపోవచ్చు. ఎవరికి వారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహార నియమాలు పాటిస్తూ, బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అందుకు వారంలోని ఏడు రోజుల డైట్‌ ప్రణాళిక ఉంది. ఎంతోమందికి లాభం చేకూర్చి పెట్టిన ఏడు రోజుల ప్రణాళిక మీ కోసం...

మొదటి రోజు:
కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఒక్క అరటి పండు తప్ప అన్ని పండ్లూ తీసుకోవచ్చు. గంట గంటకూ తీసుకోవచ్చు.

రెండో రోజు:
కేవలం కూరగాయలు మాత్రమే తీసుకోవాలి. ఉదయాన్నే అల్పాహారంలో ఒక మాదిరి సైజు బంగాళాదుంపను ఉడక బెట్టి తీసుకోవాలి. తరువాత గంట గంటకూ కూరగాయలు ఉడకబెట్టినవి కానీ, పచ్చివి కానీ కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం ఉపయోగించి తీసుకోవచ్చు.

మూడో రోజు:
పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అరటి పండు, బంగాళదుంప మాత్రం తీసుకోరాదు.
ఈ మూడు రోజులు అయ్యేసరికి ఒంట్లో ఉన్న ఎక్సెస్‌ వాటర్‌ బయటకు వెళ్లిపోతుంది. అదనపు నీరంతా వెళ్ళిపోవడంతో పాటు, మలబద్ధకం పోయి శరీరం తేలిక పడుతుంది. పండ్లు, కూరగాయల్లో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల, శరీరం రిపేర్‌ అయ్యి, కాంతిమంతంగా కనపడతారు.

నాలుగో రోజు:
ఆరు అరటి పళ్ళు, దానితో పాటు మూడు గ్లాసుల పాలు (ముప్పావు లీటరు) తీసుకోవాలి. వీటిని మూడు భాగాలుగా చేసి తీసుకోవచ్చు. ఉదాహరణకు రెండు అరటి పండ్లు, వాటితో పాటు ఒక గ్లాస్‌ పాలు చొప్పున ఉదయం అల్పాహారంలో, మధ్యాహ్నం భోజనంలో, అలాగే రాత్రి డిన్నర్‌లో తీసుకోవాలి. మధ్యమధ్యలో క్యాబేజ్‌ క్లియర్‌ సూప్‌ తీసుకోవాలి.

ఐదో రోజు:
నాన్‌ వెజ్‌ తినేవారైతే, అరకిలో చికెన్‌, ఎనిమిది టొమాటోలు కలిపి, కొద్దిగా మసాలా దినుసులు, ఉప్పు, మిరియాలు వేసి బాయిల్‌ చేయాలి. ప్రతి రెండు గంటలకూ కప్పు చొప్పున తీసుకోవాలి. శాకాహారులైతే తోఫూ (సోయా పన్నీర్‌) 300గ్రాముల వరకు తీసుకోవచ్చు (చికెన్‌కు బదులుగా).

ఆరో రోజు:
అయిదో రోజు లాగానే తీసుకోవాలి. కానీ, టొమాటోల బదులుగా కూరగాయలు ఉపయోగించాలి.

ఏడో రోజు:
బ్రౌన్‌ రైస్‌ ఒక కప్‌ + గ్రీన్‌ పీస్‌ కర్రీ + ఒక కప్‌ బత్తాయి రసం (పంచదార లేకుండా). ఇవే మూడు పూటలూ తీసుకోవాలి.

కొన్ని ముఖ్య సూచనలు
నాలుగో రోజు నుండి క్యాబేజ్‌ క్లియర్‌ సూప్‌ తీసుకోవచ్చు.
అయిదు, ఆరో రోజుల్లో నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి.
బ్లాక్‌ టీ, కాఫీలు చక్కెర లేకుండా తీసుకోవచ్చు.
పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు.
ఏడు రోజుల డైట్‌ అయిన తరువాత, రెగ్యులర్‌ డైట్‌లో కొంత నియంత్రణ పాటిస్తే, తగ్గిన
బరువును నిలుపుకోగలుగుతారు.
బీపీ, షుగర్‌ ఉన్నవాళ్ళు, ఇతర జబ్బులున్నవాళ్ళు ఈ డైట్‌ పాటించకూడదు.
మహిళలు ఋతుస్రావ సమయంలో ఈ డైట్‌ను పాటించకూడదు.
నెలకు ఒక్కసారి ఈ డైట్‌ చేయడం వల్ల బరువు క్రమంగా తగ్గుతారు.

డాక్టర్‌ జానకి, న్యూట్రిషనిస్ట్‌






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list