MohanPublications Print Books Online store clik Here Devullu.com

మార్గశిరమాసం_MargasiraMasam

MargasiraMasam, Margasira MargasiraLAKSHIVARALU

MargasiraMasam, Margasira MargasiraLAKSHIVARALU

మార్గశిరమాసం

మాసానాం మార్గశీర్షాహం’(మాసాల్లో మార్గశిర మాసాన్ని నేనే) అంటాడు గీతాచార్యుడు. చాంద్రమానం ప్రకారం వచ్చే తొమ్మిదో మాసం- మార్గశిరం. చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల ఇది. ప్రకృతి కాంతకు సీమంతంగా,తుషారబిందువుల హేమంతంగా కవులు దీన్ని అభివర్ణించారు.

‘మార్గశీర్షం’ అనే మాట జన వ్యవహారంలో మార్గశిరంగా మారింది. ఈ మాసానికి పూర్వం ‘అగ్ర హోమాగ్ని’ అనే పేరు ఉండేది. ఇదే మాసంతో సంవత్సరం ప్రారంభమయ్యేదనీ కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసాన్ని భక్తులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఈ రోజుల్లో విష్ణువును పూజించాలని శాస్త్ర వచనం. ‘ప్రతిరోజూ ప్రాతఃకాలం నన్ను స్మరించేవారికి, సదా ప్రార్థించే భక్తులకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటాను’ అని మహావిష్ణువు సృష్టికర్త బ్రహ్మకు వివరించాడని ‘విష్ణుపురాణం’ చెబుతోంది.

మార్గశిర మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని పెద్దలంటారు. తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిని తాకాలని, ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని పఠించాలని, పుణ్య నదుల్ని స్మరిస్తూ పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు.

మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఆ స్వామి చేతిలో ధరించిన శంఖాన్ని సైతం పూజించడం, భక్తజనులు పాటించే ఒక సంప్రదాయం. ‘పాంచజన్యమా! నీ నాదం అసామాన్యం. అది ఆలకించిన వెంటనే, దేవతలందరూ ఒక్కటై వచ్చేలా చేయగలిగిన ఘనత నీది. నీకు సాదర నమస్కారం. నీ కాంతి ప్రభ అత్యంత అనుపమానం. అది పదివేల చంద్రుల కంటే అధికం’ అని భక్తులు శ్లోక సహితంగా స్తుతిస్తారు.

సూర్యనారాయణ రూపుడైన విష్ణువు, వృశ్చికం నుంచి ధనూరాశిలోకి ప్రవేశించే కాలం ఇది. ఇదే నెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. విష్ణువును యోగనిద్ర నుంచి మేల్కొలుపుతూ ఆరాధకులు ‘ధనుర్మాస వ్రతం’ ఆచరి స్తారు. కొందరు కాత్యాయనీ వ్రతం ఎంతో నిష్ఠగా నిర్వర్తిస్తుండటం చిరకాల సంప్రదాయంగా వస్తోంది.

అనేక పర్వాలకు, పండుగలకు మార్గశిరం నెలవు. మార్గశిర లక్ష్మీవారాలు ఆ దేవిని పూజించేందుకు ఉత్తమమైన రోజులని భావిస్తారు. గురువారాన్ని ‘లక్ష్మీవారం’ అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి ‘సుబ్రహ్మణ్య షష్ఠి’గా ప్రసిద్ధి చెందింది. ఈ షష్ఠి శివతనయుడైన కుమారస్వామికి ప్రియమైన తిథి కావడంతో, కొన్నిచోట్ల దీన్ని ‘సుబ్బరాయ షష్ఠి’గా ఆచరిస్తారు.

మార్గశిర శుద్ధ ఏకాదశి అనేది- వైకుంఠ ఏకాదశి లేదా మోక్షఏకాదశిగా విఖ్యాతి చెందింది. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి చేసే దైవ దర్శనం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఇదే ఏకాదశి ‘గీతాజయంతి’గానూ ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో శిఖరాయమానంగా కీర్తించే ‘భగవద్గీత’ను ప్రవచించిన రోజుగా ఈ ఏకాదశిని పరిగణిస్తారు.

మార్గశిర శుక్లపక్ష త్రయోదశినాడు ‘హనుమత్‌ వ్రతం’ ఆచరిస్తారు. స్వామిని షోడశోపచారాలతో పూజిస్తారు. గోధుమ అప్పాలు, గోధుమరవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తిపూర్వకంగా తోరాన్ని ఏడాదిపాటు ధరిస్తారు.

మార్గశిర పూర్ణిమను ‘దత్త జయంతి’గానూ పరిగణిస్తారు. త్రిమూర్త స్వరూపుడిగా దత్తాత్రేయుణ్ని అర్చించే రోజు ఇది. నేడు ‘గురుచరిత్ర’ పారాయణం అనేక ఫలితాలనిస్తుందని పలువురు విశ్వసిస్తారు.

కొన్ని ప్రాంతాల్లో- మార్గశిరంలోని శుక్ల అష్టమిని ‘కాలభైరవ అష్టమి’గా పిలుస్తారు. కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ని, శివుణ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

కృష్ణపక్ష ఏకాదశిని ‘ఉత్పత్తి ఏకాదశి’ అంటారు. ఒక సందర్భంలో, ‘ఏకాదశి’ కన్య ఆవిర్భవించడం వల్ల ఈ పేరు వచ్చిందని పురాణగాథలు చెబుతాయి.

భక్తజనావళి దైవమాసంగా భావించే ఈ మార్గశిరం, ఇలా ఎన్నో విలక్షణతలను సంతరించుకుంది!
                                                - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

+++++++++++++++++++


మాసం పర్వం

విష్ణుప్రీతికరం... లక్ష్మీప్రదం


మన ఇష్టదైవానికి సంబంధించిన నామాలను సాధ్యమైతే ప్రతినిత్యం లేదా సంవత్సరంలో ఆయా దేవతలకు సంబంధించిన మాసంలో లేదా వారంలో ఆయా దేవతలకు ప్రీతిపాత్రమైన రోజున స్మరించడం వల్ల ఇష్టదైవం అనుగ్రహం కలుగుతుందనడంలో సందేహం లేదు. మార్గశీర్షమాసం విష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసం రోజులూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విశిష్ట ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు స్త్రీలోకానికి దక్కిన మహావరం. మార్గశిర గురువార వ్రతాన్ని విధి విధానాలతో ఆచరించడం సర్వశ్రేయోదాయకం.

శుభప్రద షష్ఠి
మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడానికి సర్వోత్తమమైనది. ఈ రోజున శివపార్వతుల గారాల తనయుడైన కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. అదేవిధంగా కుజదోషం ఉన్నవారు, గోచారం ప్రకారం కుజుడు నీచస్థానంలో సంచరిస్తూ, పలు రకాలైన ఇబ్బందులకు గురవుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే, ఆయా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తి. వీలయిన వారు పుట్టలో పాలు పోయడం శ్రేయోదాయకం.
(24, శుక్రవారం సుబ్రహ్మణ్య షష్ఠి






























No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list