MohanPublications Print Books Online store clik Here Devullu.com

శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా?_ Can you keep the shiva Lingam at home?



శివలింగాన్ని 
ఇంట్లో ఉంచుకోవచ్చా?

   శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా పెట్టుకున్నట్లయితే ఏదో అరిష్టం జరుగుతుందని, ఇంట్లో ఉంచుకోవద్దని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు.


  అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తర్వాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది. సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం. అంతటి శక్తిమంతమైన లింగానికి నిత్యపూజ చేయడం కనీస ధర్మం. అదేవిధంగా నర్మదా బాణలింగాల వంటివీ ఇంటిలో ఉంచుకోవచ్చు.

    నిత్య పూజకు లోపం రానీయకూడదు. శివుడికి ఒక్కడికే నిత్య అభిషేకం చెప్పబడింది. ‘‘అభిషేక ప్రియ శివః’’ అన్నారు. కాబట్టి రోజూ శక్తి కొద్దీ భక్తీ లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు. అభిషేకం అంటే కచ్చితంగా మంత్రాలూ అవీ చదవాలి అనే నియమం ఏమీ లేదు.. శివ పంచాక్షరి (ఓం నమశ్శివాయ) చదువుతూ అభిషేకం చేయవచ్చు. శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు. ముందుగా దీపారాధన చేసుకోవాలి. కలశంలోని నీటిని గంగా గంగా గంగ అని అభిమంత్రించాలి.

     తరువాత ‘‘శ్రీ గంగా సహిత ఉమా మహేశ్వరాభ్యాం నమః ధ్యానం సమర్పయామి’’ అని అక్షితలు వేయాలి. లింగాన్ని పళ్ళెంలో పెట్టి స్నానం / అభిషేకం చేసుకుని, అభిషేకం అయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టి ఉంచితే సరి. .

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list