MohanPublications Print Books Online store clik Here Devullu.com

చంద్ర గ్రహణం 7-8-2017_ChandraGrahanam

చూడామణి నామక
అర్ధాల్పగ్రాస "చంద్ర గ్రహణం"
శ్రావణ శుద్ధ పౌర్ణమి 07-08-2017 సోమవారం శ్రవణా నక్షత్రమున కేతుగ్రస్ధ సవ్య గ్రహణం ఆగ్నేయాసన్నమున స్పర్శ రాత్రి -10-52 నిమిషాలకు, నైఋత్యాసన్నమున మోక్షం రాత్రి -12-48 నిమిషాలకు.
"రవిగ్రహే సూర్యవారే, సోమేసోమగ్రహేతధా
చూడామణి రితిఖ్యాతః తత్రానంత ఫలంలభేత్‌||
ఆదివారమున సూర్యగ్రహణము, సోమవారమున చంద్రగ్రహణము వచ్చినచో నీ గ్రహణములకు చూడామణి గ్రహణమందురు. ఇట్టి చూడామణి గ్రహణ కాలమున స్నానదాన జపాదులు చేసినచో అనంతమైన పుణ్యము చేకూరును.
"గ్రహణే సంక్రమణేవాసి, నస్నాయాద్యది మానవః
సప్తజన్మని కుష్ఠిస్యాత్‌, దుఃఖభాగేచ జాయతే||
గ్రహణకాలమునగాని, సంక్రమణ కాలాదులలోగాని, స్నానము చేయనివారు, ఏడుజన్మల పర్యంతము కుష్ఠురోగాది బాధలతో, దుఃఖితులైయుందురు.
"రాత్రో స్నానం నకుర్వీత'' అను నిషేధం ప్రకారం ప్రతిదినము రాత్రికాలమున స్నానము చేయరాదు.
నైమిత్తికంతు కుర్వీత స్నానం దానంచ, రాత్రిషు
అను ధర్మము ప్రకారము ఏదేని గ్రహణాదికారణములు నిమిత్తముగ చేసికొని రాత్రి కాలమున స్నానాదులు చెయవచ్చును.
జన్మక్షే నిధనం గ్రహేజ నిభతో ఘాతః క్షతిః శ్రీర్వ్యధా
చింత సౌఖ్య కళత్ర దౌస్ధ్య మృతయః స్సుర్శాననాసః సుఖం
లాభోపాయ ఇతి క్రమాత్త ద శుభ ధస్త్యే జపహపః స్వర్ణగో
దానం శాంతి రధో గ్రహం త్వశుభదం నో వీక్షమహుః పరే 
జన్మ నక్షత్రమందు గ్రహణం వచ్చిన నాశనం, జన్మ రాశి యందు గ్రహణం వచ్చిన మానసిక సమస్యలు, ద్వితీయ మందు హాని, తృతీయ మందు సంపద, చతుర్ధమందు రోగం, పంచమం నందు చికాకులు, షష్టమందు సౌఖ్యం, సప్తమం నందు భార్యకు కష్టాలు, అష్టమం నందు మరణతుల్య కష్టాలు, నవమం నందు గౌరవ భంగం, దశమం నందు సుఖం, ఏకాదశం నందు లాభం, ద్వాదశం నందు అపాయం. అశుభ దోష పరిహారానికి జపం, స్వర్ణ దానం, గోదానం, శాంతి చేయాలి. అశుభ ఫలప్రదమైన గ్రహణాన్ని చూడరాదు.
రాజ్యాభిషేక (ప్రమాణ స్వీకారం) నక్షత్రంలో గ్రహణం పడితే రాజ్య భంగం, బంధు క్షయం, మరణతుల్య కష్టాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్ధులు ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రవేశించిన నక్షత్రాన్ని గుర్తు పెట్టుకొని ఉద్యోగ, వ్యాపార కాలంలో ఆ నక్షత్రంలో గ్రహణం పడితే శాంతి చేసుకోవటం మంచిది. 
గ్రహణ సమయమున దేవత అర్చనలు, దైవ ధ్యానము, జపతపాదులు చేయడం క్షేమము. గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి. అవి చాలావరకూ మానవ నిర్మాణానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే స్త్రీ గర్భంలోని శిశువుకు హాని కలగకూడదని గ్రహణం చూడొద్దంటారు.గ్రహణ సమయంలో మానవ ప్రయత్నముగా గర్భవతులు దైవధ్యానమే శ్రేయస్కరము.
చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది.అన్ని పౌర్ణమి లకు చంద్రగ్రహణం ఏర్పడదు. .చంద్రగ్రహణం పౌర్ణమి నాడు ఏర్పడటానికి,కొన్ని పౌర్ణమిలకు ఏర్పడకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.చంద్రుడు పౌర్ణమి నాడు సూర్యునికి ఎదురుగా ఉంటాడు.అంటే భూమికి ఇరువైపుల సూర్య చంద్రులు ఉంటారు.సూర్య చంద్రుల మద్యలో భూమి ఉంటుంది.అన్ని పౌర్ణమిలకు సూర్యుడు ,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉండరు .అందువల్ల అన్ని పౌర్ణమిలకు చంద్రగ్రహణం ఏర్పడదు.
సూర్యుడు చంద్రుడు,భూమి ఒకే సరళరేఖపై ఉండి చంద్రుడు రాహువు దగ్గర గాని కేతువు దగ్గర గాని ఉండటం వల్ల భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది.చంద్రుడు పూర్తిగా కనపడకపోవటాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.పాక్షికంగా కనపడటాన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు.చంద్రబింబం పూర్తిగా కనిపించకుండా పోయి మరల పూర్తిగా కనిపించే వరకు గల కాలాన్ని గ్రహణం అంటారు.సూర్య చంద్ర గ్రహణాలకు రాహు కేతువులు కారణం కావటం వల్ల మన పూర్వీకులు సూర్య చంద్రులను రాహు కేతువులు మింగటం వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నాయని చమత్కరించారు.
గ్రహణములు అనగానే కీడు జరుగుతుంది, ఫలానా నక్షత్రములలో జనించిన వారు ఈవిధముగా పరిహారం చేయాలి, ఆలయాలు మూసేయాలి, లోకంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఈ గ్రహణ ప్రభావము 2,3 నెలల వరకు ఉంటుందని. ఈ గ్రహణ సమయంలో ఇంట్లో దీపారాధన చేయరాదని, కొందరు చేయ వచ్చని. ఫలానా నక్షత్రముల వారికిశాంతి చేయించాలని. ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు శుభమును ఇస్తాయని, కొన్నిఅశుభమును ఇస్తాయని. గ్రహణ సమయంలో పుట్టిన వారికి గ్రహణ మొర్రి వస్తుందని, గ్రహణ సమయంలో గర్భిని స్త్రీలు బయటకు వెళ్లరాదని, పౌర్ణమి-అమావాస్య నిజముగా అందరికి కీడు చేస్తాయా. ఇలాచాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి.
గ్రహణం సంభవించినపడు విడుదల అయ్యే కిరణాలు ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ఆ కిరణాలు ఎక్కడికైనా చొచ్చుకు పోతాయి కాబట్టి గ్రహణ సమయంలో వండటం, తినడం లాంటివి చేయకూడదు అంటారు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list