MohanPublications Print Books Online store clik Here Devullu.com

రంభావ్రతం_RambhaVratam


రంభాతృతీయావ్రతం
జ్యేష్ట మాసము  28-5-2017 ఆదివారం

తపో నిష్టలో వున్న శివుడు వుపచారించడానికి హిమవంతుడు తన కూతురు పార్వతిని అప్పగించాడు. పార్వతి యందు శివునికి ప్రేమ కలగడానికి ఆ సమయములో మన్మధుడు తన బాణాలను ప్రయోగించాడు. శివునికి చిత్తం చెదిరింది. అందుకు శివునికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరచి చోదాఉ. మన్మధుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడ నుండి వెళ్లి పోయాడు.
పార్వతి చిన్న బుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి ఎదురుగా వచ్చి ఆమెను గుచ్చి కౌగిలించుకుంది. పార్వతి బావురుమంది. తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకు వెళ్ళింది. ఇంతలో అక్కడికి సప్తమహర్షులు వచారు. . వారికి హిమవంతుడు తనకూతురు సంగతి చెప్పాడు. అప్పుడు ఆ మునులలో భ్రుగువు ఆమెను ఒక వ్రతం ఉంది నీవు ఆ వ్రతం చేస్తే శివుడు నీకు భర్త అవుతాడు. అని పలికారు.
అప్పుడు పార్వతి ఆ మహర్షులను ఆ వ్రతమును ఎప్పుడు, ఎలా చేయాలి అని అడిగింది. దానికి ఆ మునివర్యులు ఈ విధంగా చెప్పారు. బిడ్డా! ఈ వ్రతాన్ని పెద్దలు "రంభా వ్రతము" అంటారు. రంభ అనగా అరటి చెట్టు. ఆ వ్రతాన్ని జ్యేష్ట శుద్ధ తదియ నాడు చేయాలి. ఆనాడు ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచ వాళ్ళేనా ముగ్గులు పెట్టాలి. రంభ కు అధిష్టాన దేవతా సావిత్రి కనుక అరటి చెట్టు క్రింద సావిత్రి దేవిని పూజించాలి.
అందు మీద పార్వతి మహా షాయా! అరటి చెట్టుకు సావిత్రి దేవి అధిష్టాన దేవతా ఎలా అయ్యింది. అని అడిగింది. దానికి సమాధానముగా భ్రుగువు ఇలా అన్నాడు. బిడ్డా! సావిత్రి, గాయిత్రి అని బ్రహ్మ దేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రి దేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్ళడం మానివేసింది. గాయిత్రి ఆమెకు చాలా దూరము చెప్పి చూసింది. సావిత్రి తన మంకు పట్టును వదలలేదు. బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలిపో మనవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని అతడు సావిత్రిని శపించాడు.
అప్పుడు సావిత్రికి పశ్చాత్తాపం కలిగింది. బ్రహ్మ కాళ్ళ మీద పది మన్నించ మణి ప్రాధేయ పడింది. కాని బ్రహ్మకు దయరాలేదు. గత్యంతరము లేక సావిత్రి భూలోకానికి వచ్చి అరటి చెట్టైపుట్టింది. అరటి చెట్టుగా ఆమె బ్రహ్మగురించి అయిదు సంవత్సరములు తపస్సు చేసింది. అప్పటికి బ్రహ్మ కు మనస్సు కరిగింది. జఎష్టశుడ్డ తదియనాడు అతడు సావిత్రికి ప్రత్యక్షమయ్యాడు. "నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు అరటిచెట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు ఈడేరుతాయి. ఇక నీవు నాతొ సత్య లోకానికి రావచ్చు" అంటూ బ్రహ్మ ఆమెను తీసుకొని పోయాడు. సావిత్రికి శాపమోక్షమైన దినము కాబట్టి జ్యేష్ట శుద్ధ తదియ ఒక పర్వదినమైనది.
అప్పుడు పార్వతి "స్వామీ! అయితే ఈ వ్రతం సాంగం చేసే నియమాలు దయచేసి తెలియ జేయండి. అని కోరింది. అందు మీద భరు మహర్షి బిడ్డా! ముగ్గులు పెట్టి అరటిచెట్టు కింద మంటపం వేయవలెను. దానిని సరస పదార్ధ సంపన్నం చేయాలి. అరటి చెట్ల నీడను పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్త్రోత్రం చేయవలెను. రాత్రి జాగరణము చేయాలి. మరునాటి నుంచి పద్మాసనస్త అయి పగలు సావిత్రి స్త్రోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్ల క్రిందనే విశ్రమిస్తూ వుండాలి. ఇలా నెలరోజులు చేసి ఆ మీద సరస సంపన్నమైన ఆ మంతపమును పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఈ వరకు లోపాముద్ర చేసి భర్తను పొందింది. అని చెప్పాడు.
పార్వతి ఆవిధముగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దేక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్ళాడాడు. ఇది రంభా వ్రత గాద.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list