MohanPublications Print Books Online store clik Here Devullu.com

జిఎస్‌టికి సిద్ధమయ్యేందుకు ఎస్‌ఎంఇలకు చిట్కాలు_GST



జిఎస్‌టికి సిద్ధమయ్యేందుకు
ఎస్‌ఎంఇలకు చిట్కాలు

జిఎస్‌టి గడువు దగ్గర పడుతోంది. బడా కంపెనీలు ఇందుకు సిద్ధమైనా చిన్న, మధ్య తరహా కంపెనీ (ఎస్‌ఎంఇ)లు మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఈ కంపెనీలూ జిఎస్‌టికి సిద్ధమయ్యేందుకు అవసరమైన చిట్కాలను క్లియర్‌టాక్స్‌.కామ్‌ వ్యవస్థాపకులు, సిఇఒ అర్చిత గుప్తా తెలియజేస్తున్నారు.
దేశంలో చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్‌ఎంఇ) పాత్ర అత్యంత కీలకం. ఒక విధంగా చెప్పాలంటే ఈ రంగం మన దేశ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తి. ఎస్‌ఎంఇ చాంబర్‌ ఆఫ్‌ ఇండియా నివేదికల ప్రకారం... పారిశ్రామిక ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో 40 శాతం ఈ రంగం ద్వారానే సమకూరుతోంది. దాదాపు 4.2 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. ఏటా ఈ రంగం పది లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తోంది. జిఎస్‌టి గడువు దగ్గర పడుతోంది. బడా కంపెనీలు ఇందుకు సిద్ధమైనా చిన్న, మధ్య తరహా కంపెనీ (ఎస్‌ఎంఇ)లు మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఈ కంపెనీలూ జిఎస్‌టికి అమలుతో ఎస్‌ఎంఇల రంగంలోనూ అనేక భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. జిఎ్‌సటి కోసం ఈ రంగం ఎలా సిద్ధం
కావాలంటే.. ఐటిసి లెక్కింపు
ఎస్‌ఎంఇ సంస్థలు ముందుగా ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటిసి)కు సంబంధించిన చట్టాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఐటిసి లభ్యతే జిఎ్‌సటి విధానంలో పన్నుల చెల్లింపుకు అయ్యే ఖర్చులు, వ్యాపార పోటీ సామర్ధ్యాన్ని నిర్ణయిస్తాయి. మార్కెటింగ్‌, రవాణా వంటి ఖర్చులను వ్యాపార ఖర్చులుగా ఐటిసి కింద తిరిగి పొందవచ్చు. దీంతో ఎస్‌ఎంఇల నిర్వహణ ఖర్చులు తగ్గి, లాభాలు పెరుగుతాయి. ఈ ప్రభావం కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌పైనా ప్రభావం చూపుతుంది. పక్కాగా జిఎ్‌సటి అమలు చేసి, ఐటిసి ద్వారా ఈ ఖర్చులు తగ్గించుకోవచ్చు.
ఇన్వాయిస్లు, లావాదేవీల వివరాలు
అమ్మకందారులు, కొనుగోలుదారుల ఇన్వాయి్‌సలు పూర్తిగా ఒకే విధంగా ఉండాలి. ఇందులో ఏ మాత్రం తేడా ఉన్నా ఐటిసి క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయి. దీనికి తోడు సరుకుల సరఫరాదారులు సమయానికి రిటర్న్‌లు ఫైల్‌ చేయడంతోపాటు, పన్నులు కూడా చెల్లించాలి. అంటే ఇన్వాయి్‌సలు, ఇతర రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలి. అపుడే ఐటిసి క్లెయిమ్‌ చేసుకోవడం వీలవుతుంది. ఇందుకు సంబందించిన సాంకేతిక అంశాలపై ఎస్‌ఎంఇలు ముందే సరైన అవగాహన పెంచుకోవాలి. చట్ట ప్రకారం ఇన్వాయి్‌సలు, రికార్డులు పక్కాగా నిర్వహిస్తూ సమయానికి జిఎ్‌సటి చెల్లించే విశ్వసనీయులైన సరఫరాదారుల నుంచే సరుకులు కొనుగోలు చేయాలి.
ఆర్థికంగా సిద్ధమై ఉండడం
ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ విడుదల అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు జిఎస్‌టి ప్రారంభంలో కొన్ని సమస్యలూ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఎంఇలు ముందు జాగ్రత్తగా ముందే అవసరమైన నిధులను సమకూర్చుకుని ఉంటే, వ్యాపారాలకు ఇబ్బందులు ఉండవు. లేకపోతే అదనంగా అప్పులు చేయాల్సి ఉంటుంది.
మాన్యువల్‌ బుక్‌ కీపింగ్‌ వద్దు
భారత ఆర్థిక రంగాన్ని పూర్తిగా డిజిటైజ్‌ చేయడం కూడా జిఎ్‌సటి లక్ష్యాల్లో ఒకటి. జిఎ్‌సటి పరిధిలోకి వచ్చే వ్యాపారులు, వ్యాపార సంస్థలు అవసరమైన ఇన్వాయి్‌సలు, ఇతర పత్రాలను పూర్తిగా జిఎ్‌సటిఎన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇందుకోసం ఎస్‌ఎంఇలూ తమ అకౌంట్‌లు, రికార్డులను మాన్యువల్‌ పద్దతిలో కాకుండా డిజిటల్‌ రూపంలో భద్రపరిచి అప్‌లోడ్‌ చేయడం మంచిది. ఇలా చేయడం వలన పెద్దగా తప్పులు జరిగే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఎంఇలు తమ సిబ్బందికి డిజిటల్‌ పద్ధతిలో ఇన్వాయి్‌సలు, ఇతర రికార్డులు నిర్వహిచడంలో శిక్షణ ఇవ్వాలి.
సాఫ్ట్‌వేర్‌ పరంగా జాగ్రత్తలు
జిఎ్‌సటి హయాంలోనూ పన్నుల పరిధిలోకి వచ్చే వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఏటా 37 రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి. జిఎస్‌టిఎన్‌ పోర్టల్‌ ద్వారానే ఈ రిటర్న్‌లు ఫైల్‌ చేసి జిఎ్‌సటి పన్ను చెల్లించాలి. ఇందులో ఏ మాత్రం పొరపాటు జరిగినా తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఎలాంటి పొరపాట్లు జరగకూడదనుకుంటే, సరైన జిఎ్‌సటి కంప్లయన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కోవడం మంచిది. ఈ సాఫ్ట్‌వేర్‌లోనే పూర్తి చేయాల్సిన అన్ని దరఖాస్తులు, పన్ను చెల్లింపు విధానం ఉంటాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list