MohanPublications Print Books Online store clik Here Devullu.com

Bommala Koluvu, బొమ్మల కొలువు

bommalakoluvu

Bommala Koluvu
బొమ్మల కొలువు
bommalakoluvu

మా బొమ్మల కొలువుకు 44ఏళ్లు

   విజయదశమి కంటే.. ముందే రాజ్‌భవన్‌లో పండగ వాతావరణం మొదలైంది. బొమ్మల కొలువు కోలాహలం శ్రీకారం చుట్టుకుంది. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ.. బంధు మిత్రులతో కలిసి ఈ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్‌ చెబుతున్న పండగ విశేషాలివి.

మా పెళ్లై నలభై మూడేళ్లు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా చేసుకుంటున్నాం. మొదటి రోజున ఓ పెద్ద కలశంలో బియ్యం, కందిపప్పు, బెల్లం, కూరగాయలు.. ఇలా వంటకు ఉపయోగించే నిత్యావసరాలన్నీ అందులో వేసి పెడతాం. ఆ కలశాన్ని కేంద్రబిందువుగా ఉంచి.. బొమ్మల్ని ఏర్పాటు చేస్తాం. బొమ్మలంటే కేవలం మట్టి, చెక్క, లోహాలతో చేసిన దేవతా ప్రతిమల్ని ఉంచుతాను. అంతేకాదు అత్తింటి వారి నుంచి సంప్రదాయంగా వచ్చిన విగ్రహాలూ, కులదైవం, ఇతర దేవతా ప్రతిమలు ఉంచుతాం. అమ్మవారి ఆయుధాలు, వీణ, పుస్తకాలు.. ఇలాంటివి బొమ్మలకొలువులో ఉంటాయి. ఈ నవరాత్రులు అన్నిరోజులూ తెల్లవారుజామునుంచే పూజలు మొదలవుతాయి. సాయంత్రం పూట బంధు మిత్రులందర్నీ పిలిచి తాంబూలం, తీర్థప్రసాదాలు ఇస్తుంటాను. పదో రోజున కలశం తీసి.. అందులోని పదార్థాలతో దేవుడికి నైవేద్యాలు చేసి పెడతాం.
మహిళల పండగ: మహిళలు చేసే పండగ అంటే ఇదే. అమ్మవారంటే ఎవరో కాదు శక్తికి ప్రతిరూపం. స్త్రీ లేనిదే పురుషుడు లేడు. మహిళలు దేనికీ తీసిపోరు అని ఆమె ప్రతిరూపమే చెబుతుంది. రాక్షసులను సంహరించే అమ్మకు పూజ చేసే ప్రతి మహిళా ఆమె నుంచి ధైర్యసాహసాలను అలవరచుకోవాలి. ఆడపిల్లలకీ నేర్పించాలి.
పిల్లలకి పాఠాలు: బొమ్మల కొలువుపెట్టుకుని ప్రతిరోజూ పూజ చేసుకోవడం వల్ల చిన్నారులకు విజ్ఞానం కూడా వస్తుంది. మా పిల్లల చిన్నతనంలో వాళ్ల చేతే బొమ్మలు పెట్టించేదాన్ని. ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటే సమాధానాలు చెప్పేదాన్ని. పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు విను నేను చెబుతా అంటే సరిగ్గా బుర్రకు ఎక్కకపోవచ్చు. ఇలాంటి ఏర్పాట్లలో భాగస్వాముల్ని చేయడం వల్ల వారి చిట్టి బుర్రలకు పలు సందేహాలు వస్తాయి. ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలనే ఆత్రుత పెరుగుతుంది. అలా వారిలో ఆసక్తి కలిగినప్పుడు మన సంస్కృతీ, సంప్రదాయాల గురించి వారికి చెబితే చక్కగా అర్థం చేసుకుంటారు.

   


   




 


   


  


    






   

   
    


  


    


 


  


   










    


    


    


 


    

















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list