శ్రీ కాత్యాయనీ వ్రతం
Sri Katyayani Vratamu
Author: Challa Ramaganapati Prasadasastry
Publisher: Mohan Publications
Pages: 42
Sri Katyayani Vratamu
Author: Challa Ramaganapati Prasadasastry
Publisher: Mohan Publications
Pages: 42
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు....
ఈ వ్రతము వివాహము కావలసిన కన్యలకు కల్పవృక్షం వంటిది. ఏడువారాలు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. 6వ వారం ఉద్యాపన జరపాలి. మంగళవారంనాడు సూర్యాస్తమయకాలములో వ్రతాన్ని ఆచరించాలి. పగలంతా పండ్లు పాలుతీసుకుని రాత్రి వ్రతమైన తరువాత భోజనం చేయాలి. ఈ వ్రతాచరణము వల్ల వివాహమునకు ప్రతిబంధకమయిన కుజదోషములు ఇతర ప్రతిబంధక దోషములు నివారణమై శీఘ్రముగా వివాహమై అఖండ సౌభాగ్యముతో తులతూగుతారు.వ్రతము పూర్తి చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి తరువాత ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనం చేయాలి. మంగళ వారాలు భక్తితో జరుపాలి. మధ్యలో ఏ వారమైన ఆటంకం కలిగితే ఆ పై వారం జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారం ఉద్యాపన జరుపుకోవాలి.ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కాని వారు ఉదయం ముత్తైదువుల గృహాలకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానానికి ఇచ్చి రావాలి. ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి) వారిచే అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం పొందాలి. పగలు నిద్రపోకూడదు. చివరి వారంలో పుణ్యస్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకాలను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకాలను యిస్తే చాలా మంచిది...
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565