MohanPublications Print Books Online store clik Here Devullu.com

MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU



                           జ్యోతిష సామెతలు
విశ్వనాధ సత్యనారాయణగారు సామెతను నిర్వచిస్తూ సామెతలు ఆ జాతి యొక్క అనుభూతి పంయాన్ని ప్రతిబింబిస్తూ మహా శాస్త్రముల యొక్క సూత్రముల వలె నిగూడ రమణీయ వ్యాఖ్యాపేశలత్వాన్ని వాంఛిస్తూ ఉండే ఒక విలక్షణమైన సాహిత్య ప్రక్రియ అంటారు. సామెత వేదానికి సమానం (గాదె వేదక్కే సమాన).సామెత మర్మాన్ని గ్రహించిన వాడు వేద మర్మాన్ని గ్రహించగలడని అర్ధం.
అనుభవాల వేర్ల ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని గడించి సంస్కృతి అనే లతకు పూచిన పువ్వులే సామెతలు.
“పంది కలలో కనిపిస్తే శని దశ ఆరంభమైనట్లు” “కాకి మనిషి తల మీద తంతే పట్టుకున్న శని వదలి పోతుందట” “కాకి మనిషిని తంతే స్నానం చేసి శనికి దీపం పెట్టాలట” “అంగట్లో అష్ట భాగ్యం, అల్లుని నోట్లో శనేశ్వరం” “రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పలేదు” “కాలు పూర్తిగా కడుక్కోకపోతే శని పట్టుకుంటుందని” “ శనివారం పట్టుకున్న వాన శనివారమే వదుల్తుందట” అనే సామెతలు శనిగ్రహాన్ని తెలియజేస్తున్నాయి.
“:గ్రహచారం చాలకపోతే వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట” అనే సామెతకు గ్రహచారం జీవితానికి దగ్గర సంబందం ఉండటం వలన నిత్య జీవితంలో అనుభవిస్తున్న వాట్కి పర్యవసానం జ్యోతిష్యమేనంటూ చెప్పే విధంగా ఉంది ఈ సామెత.
“ అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమి తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందని “సామెత. తిధులలో చేయదగిన మంచి చెడు పనులు అర్ధం చేసుకొని అమావాస్య రోజు అశుభపలమని, ఏకాదశి శుభఫలమనే విషయాలు అర్ధం చేసుకోవచ్చు.
“కర్కాటకం చిందిస్తే కాట్కముండదు. కృత్తికలో కుత్తిక పిసుకుడు” ”చిత్త ఎండకు పిట్టల తల పగులును” వంటి సామెతలు వర్ష సంబంధమైనవి. కాల సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి.
“చంద్రుని చుట్టూ గుడి కడితే వర్షం కురుస్తుంది” వర్షం కురవటానికి చంద్రుడు కూడా ఒక కారకం. అనే విషయం ఈ సామెత ద్వారా తెలుస్తుంది.
“మిధునంలో పెట్టిన మొక్క మీసకట్టులో పుట్టిన కొడుకు అక్కరకు వస్తారు.”అని “ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు” సూర్యుడు మిధునంలో ఉండగా నాట్లు వేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి. ఆరుద్రలో వర్షాలు బాగా పడతాయని మీసకట్టు ఉన్నప్పుడే కొడుకు పుడితే తనకు శక్తి తగ్గే సమయానికి పిల్లవాడు ఎదిగి వస్తాడని సామెత.
శకున శాస్త్రం ప్రకారం “ కాకి అరిస్తే చుట్టాలోస్తారని, ఉత్తరం వస్తుందని” శకున సామెత. శకున మనస్సుకు సంబంధించింది.
“పౌర్ణమి రోజుల్లో రోగం తిరగబడుతుందట” అమావాస్య ఆడవారికి పున్నమి పురుషునికి రోగం తిరగబెడతాయి” అనే సామెత ప్రకారం అన్ని రోగాలు ఇటువంటి స్దితిని పొందకున్న రక్తం, హృదయ సంబంధమున్నా రోగాలన్నీ ఈ విధంగా తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయి. కారణం చంద్రుడు పౌర్ణమి రోజు బలవంతుడు. మిగతా రోజుల్లో చంద్రుని ఆకర్షణకు, పౌర్ణమి రోజు చంద్రుని ఆకర్షణకు వ్యత్యాసం ఉంటుంది. రక్త సంబంద దోషాలున్నప్పుడు అమావాస్యనాడు చంద్రుని నిర్బలత్వం, అస్తంగత్వం పొందటం వల్ల ఆడవాళ్ళకు ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. మానసిక వ్యాధులకు పౌర్ణమి సమయాలలో పురుషులు ఎక్కువగా భాదపడతారు. “ చంద్రమా మనసో జాతః” అనే సామెతలు చంద్రగ్రహాన్ని తెలియజేసేవిగా ఉంటాయి.

https://m.facebook.com/Mohan-publications-420023484717992/

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list